ఇనుప సంకెళ్ళు

(అంశం:”బానిససంకెళ్లు”)

ఇనుప సంకెళ్ళు

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

ఆ గొంతుపై ముద్రలు
గర్వంతో కాలికతికిన
తోలు బూట్ల చిహ్నాలు…

ఆ గుండె గాయాలు
నరం లేని నాలుక
వాగిన మాటల తూటాలు….

ఆ బానిసత్వపు బ్రతుకులు
నియంతలు పెట్టిన భిక్షపాత్రకు
అతికిన మెతుకులు….

ఆ నలిగిన జీవితచక్రాలు
అధైర్యపు ఇరుసుతో అదుపు తప్పిన
భయ బంధిత రథాలు…

ఆ అసహాయ అసువులు
బలవంతులకై ఎదురుచూసే
బలహీన మనసుల ఇనుప సంకెళ్ళ ఆనవాలు..!
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!