(అంశం:”బానిససంకెళ్లు”)
పోరాడు
రచన:సుశీల రమేష్
విషవాయువుల కు నెలవైన
మ్యాన్ హోళ్ళలో దిగిన వాడు
ప్రాణాలతో బయటికి వచ్చేనా.
సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేస్తూ
ఊపిరాడక అదే అతని చివరి
రోజుగా ప్రాణాలువిడిచిన గాథలెన్నో
ఒక సామాజిక వర్గానికి చెందిన
ప్రజలు పారిశుద్ధ్య వృత్తిలో
మగ్గిపోతున్న పేదవాడి ప్రాణాలకు
భద్రత లేదాయే.ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ,అవి మంత్రిగారి ఇంట్లో మగ్గుతున్నాయేమో. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి
సాధించినా పారిశుద్ధ్య పనులకూ
మనుషులను వినియోగించే
దుస్థితి దేశానికే అవమానకరం కాదా, రక్షణ లేని పారిశుద్ధ్య కార్మికులారా పోరాడండి
పోరాడితే పోయేదేముంది
బానిస సంకెళ్లు తప్ప.
***