ముందడుగు

(అంశం:”బానిససంకెళ్లు”)

ముందడుగు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు
రక్షణ లేదా స్త్రీ జాతికి
ఆది నుండి ఆధునిక యుగం వరకు
అజ్ఞానాంధకారాలు పోయి
విజ్ఞానం విశ్వ వ్యాప్తమైన
బుద్ధులు సుద్దు కాకా
వంచన నయవంఛనలతో
వావి వరస చిన్న పెద్ద
తారతమ్యం లేకుండా
మగాడు అనే ఒకే ఒక అక్కసం తో
రక్కసి లా రాక్షుసునిలా
కుక్కల్లా పీక్కు తినే పైశాచిక
మృగత్వానికి చెల్లించక తప్పదు
భారీ మూల్యం

ఆడదాని లో అమ్మ అక్క చెల్లి వదిన అనే మానవ సంబంధాలు
నరనరాల్లో జీర్ణించుకునే
తత్వం మానవత్వం పెరగాలి
ఆడదానిలో శక్తి స్వరూపాన్ని చూడాలి

స్వేచలేని జీవితం నిరంతరం సంకెళ్లే అని రూసో
స్వాతంత్ర్యం అనగా స్వేచ్ఛ అని తిలక్
అర్ధరాత్రి స్త్రీ తిరిగినరోజే స్వాతంత్ర్యం అని గాంధీ
చెప్పిన మాటలు మనిషిగా
బుర్రకేంక్కించుకుంటే
ఆడదాని జీవితం బానిస సంకెళ్లు కాదు

ఇకనైనా స్త్రీ ని గౌరవించి బానిస సంకెళ్లు తెంచి ముందడుగు వేద్దాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!