మనో ధైర్యం

(అంశం:”అగమ్యగోచరం”)  

మనో ధైర్యం

రచన ::పసుమర్తి నాగేశ్వరరావు

నేటి జీవితం అగమ్యగోచరం
ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి
బతుకులు నేల వైపు చూస్తున్నాయి
సగటుమనిషిసంసారసాగరాన్నిదలేకపోతన్నాడు

ఇంటిలో ఉంటే ఆకలి చావు
బయటకు వస్తే కరోనా చావు
బతుకు బండి భారమై వెర్రిచూపులు చూస్తున్నాడు
గుండెలోగుక్కెళ్ళు మింగుతున్నాడు

గొంతుచించుకుఅరచినాగోడుపెట్టుకున్న
అర్చేవారు ఎవరు తీర్చేవారు ఎవరు
కాలంతో కదలలేక ముందుకుపోలేక జీవన సాగరం లో కొట్టుమిట్టాడుతున్నాడు

కడుపునిండా తిండి కరువై కళ్ళనిండా నిదుర కరువైఅతలాకుతలంఅవుతున్నాడు
భార్యపిల్లలనుచూసుకుంటూబెంగతో జీవచ్చవం అవుతున్నాడు

కనీసఅవసరాలుకరువైనిత్యవసరవస్తువుల ధరలు బరువై
వేగుతున్నఈకాలానికిమంచిరోజులు రావాలని ఆశిద్దాం

ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ
స్వార్ధం విడిచి మానవతను చాటుకుంటు
మనోధైర్యం తో ముందడుగు వేస్తూ
మంచి ప్రపంచాన్ని సృష్టిద్దాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!