బావగాడు

(అంశం: “ఏడ తానున్నాడో”)

బావగాడు

రచన: శాంతి కృష్ణ

ఏడతానున్నాడో వాడు
నా చెల్లిని రాక్షసబల్లిని భరించేవాడు

ఏడతానున్నాడో వాడు
ఈ గుదిబండను జీవితాంతం మోసేవాడు..

ఏడతానున్నాడో వాడు
తన సౌఖ్యాన్ని మాకొప్పగించి
మా తలపోటును తగిలించుకునేవాడు..

ఏడతానున్నాడో వాడు
మా చెల్లి తన్నులను భరించేవాడు..

ఏడతానున్నాడో వాడు
ఒక్కగానొక్క దురదృష్టవంతుడు
నాకు కాబోయే బావగాడు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!