గెలుపే నాది (చిత్ర సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు:దొడ్డపనేని శ్రీ విద్య
చిత్రం: కొండపొలం
కథ: సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
కధ ఎలా ఉందంటే: నల్లమల నేపథ్యంలో సాగే అడవి కథ ఇది. ఓ యువకుడి సాహస యాత్ర గా , భయం భయంగా కనిపించే ఓ యువకుడు. ఆత్మవిశ్వాసంతో తలపైకెత్తి నిలిపి, ధైర్యాన్నీ, తనపై తనకి నమ్మకాన్ని ఇచ్చే ఓ యువతి.
ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే. గొర్రెల కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై సహజంగా ఆవిష్కరిస్తూ తీసినది. ఎంతో సహజంగా ఉంది సినిమా. అడవిలోకి వెళుతున్న కొద్దీ ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆసక్తిని రేకెత్తిస్తుంది కథ కమానిషు. కథానాయకుడికి ఎదురయ్యే ఒక్కొక్క సవాల్. ఒక్కో వ్యక్తిత్వ వికాస పాఠంలా ఉంటుంది. హీరో పాటు మనకి కూడా. అడవి తల్లి ఎంత గొప్పదో, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఎంత ఉందో ఆ సన్నివేశాలు చాటి చెబుతాయి. ప్రకృతి ని సంరక్షించుకుంటే అడవులు అంత సమృద్దిగా ఉంటాయి. అడవులు ఉంటే మనకు వర్షాలు పడ్తాయి. వర్షాలు పడితే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే మనం బాగున్నట్లే.
కథ విషయం:
ఆరంభంలో పిరికివాడిగా కనిపించిన కథానాయకుడు. అడవితో మమేకమైన కొద్దీ ధైర్యశాలిగా మారే క్రమం. పులితో చేసే పోరాటం సినిమాకి హైలైట్. నవల వేరు, దాన్ని సినిమాగా మలచడం వేరు. నాకయితే ఈ మధ్య వచ్చిన అన్నింటిలో ఇది బాగా నచ్చింది.
ధన్య వాదాలు తపస్వి
🙏🙏🙏
మంచి సమీక్ష
ధన్య వాదాలు పద్మ నాభ రావు గారు
మన్నించండి లేటు గా reply ఇస్తున్నందుకు
🙏🙏🙏