ద సీక్రెట్ (పుస్తకం సమీక్ష )

ద సీక్రెట్ (పుస్తకం సమీక్ష )
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచయిత్రి :⁠ రోండా బర్న్

సమీక్షకులు :⁠ మాధవి కాళ్ల

ఈ పుస్తకంలో ఈ రహస్యాన్ని మన జీవితంలోని ఒక్కొక్క అంశం – డబ్బు, ఆరోగ్యం , బాంధవ్యాలు, ఆనందనలోను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాను. ఈ ప్రపంచంలో మన జరిపే అన్యోన్య చర్యలను దీని ఉపయోగాన్ని గ్రహిస్తారు. మాలో దాగి ఉన్న, ఇంతవరకు బయట పడని శక్తిని అర్దం చేసుకోవడం మొదలుపెడతారు. ఇలా బయట పడిన దివ్యశక్తి మన జీవితంలో ప్రతిదశనూ ఆనందంతో నింపివేస్తుంది. “రోండా బర్న్”  గారు “ఏడాది క్రితం తన జీవితంలో ఉన్న ఆనందం మొత్తం పోయింది.” ఆమె విపరీతమైన అలసటకి గురయ్యేటంతగా శ్రమించారు. వాళ్ల నాన్న గారు హఠాత్తుగా చనిపోయారు, నాతో పని చేసే వారితోనూ, నేను ప్రేమించే నా వాళ్ళతోనూ, నా సంబంధాలు గందరగోళంగా ఉన్నాయి. “ఆనాటి ఆ గొప్ప విషాదాన్నించి నాకు అతి గొప్ప బహుమతి లభించబోతుందని” ‘నాకు ఎంత మాత్రం తెలీయలేదు’.  “నాకు గొప్ప రహస్యం – జీవిత రహస్యం – క్షణం సేపు గోచరించింది”. తన కూతురు హేలీ ఇచ్చిన పుస్తకంలో దొరికింది. “ఆ పుస్తకం వందేళ్ళ క్రితంది” తను ఆ రహస్యాన్ని చరిత్రపుటల్లో వెతకడం ప్రారంభించారు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారందరిని ఆమె నమ్మలేకపోయారు.వాళ్లందరూ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు..ప్లేటో, షేక్సియర్, న్యూటన్, హ్యూగో, లింకన్.నమ్మకం కుదరక అందరికీ ఈ విషయం ఎందుకు తెలియదు? అని అనుకున్నారు. “ఈ రహస్యాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరిక తనని దహించి వేసింది”. “ఈ రహస్యాన్ని ఒక సినిమా తీయాలి అన్న ఆలోచన నా మనసులు నాటుకుపోయింది.” ఆ తర్వాత రెండు నెలల్లో మా సినిమా, టీవీ నిర్మాతల బృందం ఈ రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే దాన్ని గురించి తెలుసుకోకుండా వాళ్ళ ప్రయత్నాన్ని  కొనసాగించటం అసంభవం అవుతుంది. కానీ మాకు ఈ రహస్యం గురించి తెలుసు. అందుకే పూర్తి నమ్మకంతో ఆమె ఎక్కువ మంది గురువులున్న అమెరికాకి, ఆస్ట్రేలియ నుంచి విమానంలో వెళ్ళారు. “సినిమా ప్రపంచమంతటా విస్తరిసూంటే అనేక అద్భుతాల గురించి కథలుగా వెల్లువగా వచ్చాయి.”  దీర్ఘకాలం నుంచి ఉండిన నొప్పులు నయమయ్యాని, నిస్పృహ తొలగిపోయిందని, రోగాలు తగ్గిపోయాయని జనం ఉత్తరాలు రాశారు.” “రహస్యం ఎలా ఉపయోగించాలి “. అల్లాఉద్ధీన్ భూతంలాగే, ఆకర్షణ సిద్ధాంతం మన ప్రతి ఆజ్ఞనూ శిరసావహిస్తుంది. మీరు కోరుకునేది సంభవించడానికి మూడు సులుమైన సోపానాల ద్వారా సృజనాత్మక ప్రక్రియ సహాయపడుతుంది. అవేమిటంటే – అడగడం, నమ్మడం, అందుకోవడం. నమ్మడంలో చేతలు, మాటలు, మీరు కోరుకున్నది ఇదివరకే పొందారన్న భావన. ఇవన్నీ కలగలిసి ఉన్నాయి. మీరు కోరుకునేది ఏమిటో ప్రపంచాన్ని అడగడమనేది, మీ కోరికను స్పష్టం చేసుకోవడానికి పొందే అవకాశం. మీ మనసులో అది స్పష్టంగా ఉంటే, మీరు అడిగినట్లే. మీ కోరికను సాక్షాత్కరింపజేయడానికి ప్రపంచానికి సమయం పట్టదు. మనం నిద్రపొయ్యే ముందు మనకి ఏం కావాలో అది  కోరుకుంటే ఖచ్చితంగా నేరవేరుతుంది. నా లైఫ్ లో కొన్ని సంఘటనలు జరిగాయి. పూర్తి నమ్మకంతో కోరుకోండి. “శక్తివంతమైన ప్రక్రియలు “. ఎదురుచూడడం అనేది శక్తివంతమైన ఆకర్షణ శక్తి. మీరు కోరుకున్నది జరుగుతోందని ఎదురుచూడండి. మీరు కోరని వాటిని ఎదురుచూడకండి. “కృతజ్ఞత అనేది మీ శక్తిని బదిలీ చేసే శక్తివంతమైన ప్రక్రియ.” మీరు కోరుకున్నవాటికి ముందుగా ధన్యవాదాలు చెప్పడం వల్ల మీ కోరికలకు ప్రబలశక్తి తోడై అది ప్రపంచానికి మరింత శక్తివంతమైన సంకేతాలను పంపిస్తుంది. “ధనం తాలూకు రహస్యం “. మీ ఆలోచనల త్రాసు సంపద వైపు మొగ్గుచూపెట్టి చూడండి. సంపద గురించి ఆలోచించండి. పోస్టులో చెక్కులు వస్తున్నట్టు ఊహించుకొండి. ఈ క్షణం ఆనందాన్ని అనుభవించటం మీ జీవితంలోకి త్వరగా డబ్బు రావటానికి ఉపయోగపడే మార్గం. డబ్బుని ఆకర్షించాలంటే, సంపద మీద మనసుని కేంద్రీకరించండి. “జీవితం యొక్క రహస్యం ” మీ జీవితం తాలూకు బ్లాక్ బోర్డుని మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. మీరు చెయ్యవల్సిన ఒకే ఒక పని ఇప్పుడు బాగా ఉందని అనుకోవడం. మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించే సమయం ఇదే. “మీరు మీలో అంతర్గత శక్తిని ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ శక్తిని మీవైపుకి ఆకర్షిస్తారు.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!