అవతలి గట్టు(కథ సమీక్ష)

అవతలి గట్టు(కథ సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచయిత : అరవింద

సమీక్ష కులు : యాంబాకం.

ఈ కథలో మనం ఏమైనా తెలుసుకున్నిమనిపిస్తే దాన్ని ఎవరితో నైనా పంచుకోవాలని అను కుంటాము. అది సహజగుణం ఇది తప్పు కాదు. ఒక ఋషి కూడ తను శక్తిని పొందిన వారు కూడా తిరిగి వచ్చి భోధన చేస్తారు. సత్యానికి ఉన్న శక్తి అదే ఎదుటి వారికి తెలియ జెప్పాలనే ఆవేదన. అదే  “అవతలగట్టు ” కథ అరవింద రచయిత యొక్క తపన. తను చెప్పాలను కొన్న సందేశం ఈ కథ రూపంలో చెప్పాడనిపిస్తుంది. ఇలాంటి సందేశాలు మనం మన పాఠకులు “దాసరి నారాయణ”గారు దగ్గర చూసాము. అయన కూడా ఆయన కథలో ఒక సందేశం ఉండేలా రచన ఉంటుంది.
కథ పేరు: ” అవతలి గట్టు”
ఈ కథ పేరులోనే రచయిత యొక్క సామర్థ్యం తెలిసి పోతుంది కదూ! పాఠకులను ఉత్తేజితులను చేసే కొత్త తరహా నవల కథ. ఆలోచన ధోరణిలో అత్యంత ఆధునిక భావాలు గల పాత్రలతో ఆసక్తి కలిగించే కథ. గమనంతో నిత్యజీవిత. మానవులందరిలోని ఆత్మ స్వరూపం ఒక్కటే అందరి సుఖ, దుఃఖాలు ఒకటే సర్వమానవ సమానత్వం పరమాత్మ స్వరూపం ఆకళింపు చేసుకోగలగటం మనిషికి ధన్యత్వాన్నిస్తుంది. కర్తవ్యాన్ని భోధిస్తుంది. ఆ మనిషి జోలికి చీకటి గుణాలు రాలేవు, అతని లో భయానికి తావుండదు. అటువంటి సాత్విక తేజస్సు దీప్తించాలి ప్రతి గుండెలోనూ సర్వమానవ కళ్యాణాన్ని మనసుల విందుగా జేసే ఆ పండుగలు ఎప్పటికీ..! ఈ కథ టైటిల్ “అవతలి గట్టు “చదవగానే మనం ఏదో నదీ తీరం, సముద్రతీరం, సలయేరు ఒడ్డు అని ఊహిస్తాం. “రచయిత యొక్క ఇది ఔదార్యం తపన అందులో కూర్చుని. కథ చదువుతూ ఉంటే మనకు బోరు కాదు అసలు కథ చదువు తున్నట్లు ఉండదు, ప్రాత్రలను చూసినట్టు ఉంటుంది. మనకు దగ్గరగా ఉంటుంది. ఎక్కడో కంటిపాపలో మెదిలినట్టుగా ఎక్కడో మన మధ్యలో విన్నట్టుగా ఉంటుంది. ఇందులో ఒక వాక్యంలో రచయిత “ఇవతలి గట్టునుంచి “అవతలి గట్టుకు చేరటం లాంటిది జీవితం ” ఇవితలి గట్టు అనే బాల్యానికి అవతలి గట్టు అనే వృధ్ధాప్యానికి మధ్య కోరికలు, ఆశయాలు అనే నదీ ప్రవాహామే జీవిత వాహిని జీవితమనే నదిలో ఈదుతూ ఉంటే “అవతలి గట్టు” కు చేరగలమా! రచయిత చివరిలో చెప్పిన వాక్యాలు “అసలు వ్యక్తిత్వానికి పునాదులు బాల్యం నుంచి ఏర్పడతాయి. “బద్దకమే దరిద్రం కృషిలోనే అన్ని సంపదలూ ఉంటాయి. ధర్మాన్ని అతిక్రమించకు అన్యాయాన్ని సహించకు బీదరికానికీ, కష్టాలకీ భయపడకు, ఆత్మ గౌరవం కాపాడుకో నీ కంట్లో ఎవరైనా పొడిస్తే, నీకు ఎంత బాధ కలుగుతుంది. నవ్వు ఎవరి కంట్లోనైనా పొడిస్తే వాళ్ళకీ అదే బాధ మనుషులు ఆకలి, సుఖమూ, దుఃఖం. ఉన్నాయని గుర్తు ఉంచుకోవాలి! ధన వ్యామోహం సుఖలాలస అనర్థాలకి నాంది. భౌతిక వాద ప్రభావంలో మనం పోగొట్టకున్న జీవితపు విలువల్ని ప్రతిష్టించాలి. ఇలా ఈ కథలో చాలా చాలా గొప్ప గొప్ప వాక్యలు ఉంటాయి. ఈ కథను తప్పకుండా పాఠకులు చదివి “అవతలి గట్టు కు రావాలనికాంక్షిస్తూ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!