విలువల అవగాహన కథ

విలువల అవగాహన కథ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

సమీక్షకులు: నారుమంచి వాణి ప్రభాకరి

ఈ కథ కామాక్షి కంటీ ఆపరేషన్ లో ఉండే విషయం హాస్యాన్ని పండించింది. ఇంకా సమీక్ష చూస్తే చిత్రంగా, విచిత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మికతో కూడిన విలువలు సామాజిక విశ్లేషణ ఉన్నాయి.
రసాయన శాస్త్ర ఆచార్యులుగా పదవీ విరమణ చేసిన ఆయన బాల్యం నుంచి ఆధ్యాత్మిక విలువలు తెలిసి, పెద్దల మధ్యన పెరిగి ఎన్నో విషయాలు జీవిత సత్యాలుగా అవగాహన చేసుకొని, బావి తరాలకు అటు రసాయన, ఇటు ఆధ్యాత్మిక విలువలతో బోధన చేసి నేడు సాహితీ రంగంలో ఆయన విలువ గల రచనలు అందిస్తున్నారు.
“ఆనాటి తరం ఆలోచనల అవగాహన, అంతరాల పెంపకం వారి చాదస్తం పద్దతిలో మాటలు ఇవన్నీ ఎంతో విన్నూత్న విధానము.” నేటి తరానికి
స్ఫూర్తి ప్రదాతగా కీర్తిగా నిలిచారు ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు.

కామాక్షమ్మ- కంటి  ఆపరేషన్
రచన:ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

   “ఒరే కాముడు ఈ రోజునే కదరా! మనం కళ్ళ డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి. అని కాకినాడలో ఉంటున్న కామాక్షమ్మ మనుమడు కామేశ్వరరావుని కళాశాల కి వెళ్ళే ముందు అడిగింది.” “బామ్మతో అవునే ఈ రోజే వెళ్ళాలి.” మంచి కుర్రాడు ఢిల్లీలో ఎయిమ్స్ లో చదివి ఉన్న ఉరుకి సేవచేయాలని ఇక్కడే ప్రాక్టీసు పెట్టాడు. నా దగ్గర ఇంటర్మీడియట్ చదివాడే.
పదిహేనేళ్ళ క్రిందట పి.ఆర్ కాలేజీలో అని కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న కామేశ్వరరావు అన్నాడు.
“ఏమొరా మీ నాన్న అమ్మ చేతిలో పోవాల్సిన నాకు నిన్ను చూసుకోమని వారి దారిన వాళ్ళు దేముడు. దగ్గరకి వెళ్ళిపోయారు. అయినా ఎనభై ఏళ్ళు దాటిన నాకు శుక్లాలు ఇప్పుడు రావడమేమిటి. నీ భార్యకి నీకు నే భారం అన్న కామక్షమ్మ చేయి పట్టుకుని మనుమడు ఆపి ఊరుకోవే బామ్మ. చాగంటి వారు ప్రవచనములు చెప్పే అయ్యప్ప కోవెల దగ్గర వాడి క్లినిక్. నేనంటే గురుభక్తి. తండ్రిలా చూస్తాడు. నీకేమి భయంలేదు. కాలేజి నుంచి వచ్చి ఆరుగంటలకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని ఎప్పటిలానే బామ్మని ఎదురు రమ్మని కాలేజికి వెళ్ళాడు కాముడు అనే కామేశ్వరరావు. ఏమిటో భార్యని కాదని భర్తలేని నన్ను రోజు ఎదురురా! అంటాడు. వాడి భార్య కూడా అమ్మమ్మ గారు, మీరు లేకపోతే ఆయన ఎలా జన్మిస్తాడు. అని ఆప్యాయత చూపుతుంది. వీళ్ళ చేతుల మీద దినం దిబ్బ చేరితే బాగుణ్ణు అనుకుంటే రెండు కళ్ళకి ఈ వయస్సులో శుక్లాలేమిటి నా సౌభాగ్యం లానే దాపురించాయి అనుకున్నారు. సాయత్రం కాలేజి నుంచి రాగానే  బామ్మని కామేశ్వరరావు గారు డాక్టర్ మనోజ్ దగ్గరకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే రండి మాష్టారు అని, బామ్మగారి కాళ్ళకి దణ్డంపెట్టి మనోజ్ బామ్మగారికి టెస్ట్ లు చేసి పర్వాలేదు, వయస్సు మీదపడ్డా  దృఢంగా ఉన్నారు. మళ్ళీ ఆదివారం లేజర్ ట్రీట్మెంట్ చేస్తాను. చక్కటి ఆరోగ్యం బామ్మగారిది అనగానే అవును బాబు కళ్ళజోడు లేకుండా సూదిలో దారం ఎక్కించేదాన్ని. ఎప్పుడు చిర్రున చీదలేదు, జీవితాన ఇప్పుడు ఈ కంటి జబ్బు ఏమిటో! అంటే “భయంలేదు బామ్మ గారు.. అన్న మనోజ్ కి కృతజ్ఞత చెప్పి బామ్మతో ఇంటికి బయలు దేరారు కామేశ్వరరావు. “ఒరే కాముడు నువ్వు కోప్పడనంటే ఒకటి అడుగుతాను, ఏమనుకోకురా అని ఇంటికి రాగానే అన్న బామ్మతో అంటే చెప్పవే బామ్మ. వాడి కులం, గోత్రం గురించా నీ భాధ అనగానే కాదురా! అని ఒరే వాడికే మెల్లకన్ను. ఇక వాడు నా కంటికేం ఆపరేషన్ చేస్తాడు. “సర్వేంద్రియానాం నయనం ప్రదానం అన్నారు” అదే భయంరా అనగానే “పక.. పక..నవ్వుతూ మెల్లకి, నీ కంటికి సంబంధం లేదే అందుకేనా ఆందోళనగా వాడి మొహాన్ని అంతసేపు చూశావు. అని బామ్మతో అన్న కామేశ్వరరావుతో, నీవు ఉండగా నాకేమి భయంరా కాముడు అని ఆప్యాయంగా మనుమడి తలనిమిరారు కామక్షమ్మ. “కంటి ఆపరేషన్ తరువాత కళ్ళజోడు లేకుండానే చాగంటి రామాయణం, గరికపాటి నవజీవన వేదం, సాగరఘోష చదివి. మనుమడు కాముడుతో పాపం తక్కువగా అంచనా వేసాను. కళ్ళ డాక్టర్ గురించి అని రెండు నెలల తరువాత మనుమడుతో కలసి వెళ్ళి జీవితసారమే భగవద్గీత అని.  డాక్టర్ కి తనవంతు ఫీజ్ గా  ఇచ్చి ధీర్గాయుష్మాన్ భవ అంటు దీవించి వచ్చారు కామక్షమ్మ గారు.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!