వ్యాస కవిత

వ్యాస కవిత.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల.

ఇది ఒక అందమైన జీవితం అవ్వాలని
ఆది ఉన్నన్నాళ్లు వసంతాలెే నిండాలని
ఆనందాలు కళకళలాడెేలా మనసు పొంగాలని
ఘల్లు ఘల్లు మంటూ మువ్వల సవ్వడి వినాలని
పాపాయి అడుగులెే మన ఇంట నడయాడాలని
మల్లెలు పరిచిన వెన్నెల వాకిలి అవ్వాలని
నీవే ఆదర్శమై స్త్రీ జాతిని గౌరవించాలని
ఎప్పుడు చిరునవ్వులు పెదవులపై ఉండాలని
అమ్మ అడుగులో అడుగునై నడవాలని
నువ్విచ్చిన ఈ జీవితం వరమై జీవించాలని
భాషకందని భావాలెన్నో నీలో ఉన్నాయని
మరుజన్మకైన అమ్మ అనే పిలుపు తోడుండాలని
అమ్మకు పిల్లలు ఆనందం అవ్వాలని
అమ్మకు ఆదర్శంగా నాన్న తోడై ఉండాలని
అవతారమూర్తి ఆదర్శమూర్తి అమ్మేనని
పిల్లలు మరువరాదని అదే ఆదర్శవ్వాలని
దేవుడు రాసిన నుదుటిరాత ఇదేనని
అది తెలుసుకుంటే తప్పేమీ కాదని
రేపటి తరానికి మనమే ఆదర్శవంతులమని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!