ప్రతిరోజూ పలకరిస్తే చాలు

ప్రతిరోజూ పలకరిస్తే చాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చంద్రకళ.దీకొండ

పురుటినొప్పులకోర్చి
పునర్జన్మను పొంది
నీకు జన్మనిచ్చిన తల్లికి.
కడుపుతీపితో నిన్ను
కంటిపాపలా కాపాడే
కనిపెంచిన మాతకు.
తాను పస్తులున్నా నీ
కడుపు నింపే దయామయికి.
తన కోరికలు త్యాగం చేసి
నీ ఆశలు తీర్చుటకై తపించే త్యాగమయికి.
కఠినమైన మాటలతో నీవు తూలనాడినా క్షమించి,ప్రేమించే ప్రేమమయికి.
ఒక్కరోజు ఉత్సవంలో వేడుక చేస్తే పొంగిపోదు.
నీవు ప్రతిరోజూ పలకరిస్తూ ఉంటే చాలు.
తన బ్రతుకే పండుగలా భావిస్తుంది…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!