కులమతాల కొట్లాటలు

కులమతాల కొట్లాటలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కార్తీక్ నేతి

స్వేఛ్చ, సమానత్వం, స్వతంత్ర,
బద్దంగా రుపోదించిన
రాజ్యాంగం మనదేశం,
అయిన సమిసి పోలేదు కుల మతాల బేదాలు,
నడి రోడ్డు పై కొనసాగుతునే ఉన్నాయి హత్యలు,
జంతువులకు లేని జాతి బేదాలు ఎందుకు మనకి ,
బైబిలైన, భగవద్గీతైన బోదించేది ఒకటే విలువలు ,
విశ్వామానవ వాదం కోసం టాగూర్ గారు
రచించారు అనేక రచనలు,
మతాలు వేరైనా మనుషులోక్కటే అంటూ కందుకూరి గారు చేసారు ఎన్నో కార్యక్రమాలు,
భిన్నత్వంలో ఏకత్వం అనే ముసుగులో
నడుస్తన్నాయి ఎన్నో అనేకతత్వాలు,
మిస్సైలు ప్రయోగంలో కన్నా ఈ కుల, మతాలు
కుమ్ములాటలోనే పోయాయి ఎన్నో ప్రాణాలు ,
మతాలను, కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఖద్దరు వేసుకున్నా తెల్ల దొరలు.
మననుండి మార్పు రానంతవరకు సాగుతూనే ఉంటాయి ఈ కులమత కొట్లాటలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!