అమ్మకు వందనము

అమ్మకు వందనము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పి.వి.వి.యన్.రాజకుమారి

అమ్మకు వందనమంటు చేతురు
వేడుకలు ప్రేమను పంచుదురు.
మాతృదినోత్సవము నాడు
అమ్మను తలచి మిగిలిన రోజులు తలచరు జనులు
సంతోషము అమ్మకు ఎప్పుడు
అని ఆలోచించె వారెవ్వరు లేరు
బిడ్డల ఆకలి తీరగ అమ్మకు సంతోషము
మచ్చలేని పిల్లలు ఎదుగుదల,
అందరిచే మన్ననలు పొందు బిడ్డల నైజం సంతోషం
పిల్లల ఉన్నత విద్య ఉద్యోగములు చూసి ఆనందం
తన సుఖము ఎరుగని త్యాగ మయి
భర్త పిల్లల తోడిదే లోకము
అలుపెరగని నిత్య శ్రామికురాలు
కుటుంబ సంతోషములో తన సంతోషం
వెతుకును పిచ్చి తల్లి
ప్రియమగు మాటలతో నిత్యము పలికుచు
క్షేమ సమాచారము తెలిపిన
అప్పుడే అసలైన మాతృదినోత్సవము
మాతృదేవోభవ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!