అంతం కానిది

అంతం కానిది

-సుజాత.కోకిల.

“అది ” ఒక పెద్ద  అనాథ ఆశ్రమం  దానికి  పెద్ద ప్రహరీ గోడ  దానికి  ముందు పేద్ద  గేట్లు ఉన్నాయి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఆ చిన్న గేటు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. దాని ముందు  స్టూల్ పై వాచ్మెన్ కూర్చొని వున్నాడు. ఆ చిన్న గేటుకు ఒక బోర్డు తగిలించి ఉన్నది. దానిపై వృద్ధాశ్రమం ఖైరతాబాద్ పిన్కోడ్ అని  వగైరా వగైరా రాసి ఉంది.

గేటు ఇరువైపులా  పెద్ద అశోకచెట్లు  ఉన్నాయి. గాలికి చక్కగా  ఊగుతూ వచ్చి పోయే వారందరినీ ఆకర్షిస్తున్నాయి. కొమ్మలు  రమ్మని స్వాగతం పలుకుతున్నట్టుగా, వుంది.గేటు లోపల  అడుగుపెట్టి చూడగానే ఎంతో అందంగా పూల వనంతో అందంగా   ఉంది. కృష్ణుడు చెలికత్తెలతో ఆడే బృందావనంలా వుంది.

చూపరులకు ముచ్చట గొలిపే విధంగా ఆహ్లాదకరంగా కమ్మని సువాసనలు  వెదజల్లుతూ ఉంది ఆ ప్లేస్ మధ్య మధ్యలో దారికి ఇరు వైపుల అందమైన పూలచెట్లున్నాయి ఇంకా  అటూ ఇటూ చక్కగా వెళ్లడానికి కాబోలు  మధ్యలో చక్కగా గచ్చు పరిచి ఉంది. మధ్యమధ్యలో వెనుకకు ఆనుకునెే సిమెంట్ కుర్చీలున్నాయి.వృద్ధులు కాలక్షేపానికి అక్కడక్కడా   కాలక్షేపం చేస్తు బాతాఖానీ చేస్తున్నారు.

ఒక  ఆవిడ ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది.  ఆకాశం నలుపైనా మెరిసే నక్షత్రాలు తెలుపే అనుకుంటూ  తనది తాను నవ్వుకుంది.దాని అర్థం పిల్లలు ఆకాశంలో మెరిసే నక్షత్రం లాంటి వాళ్లు అమ్మా నాన్నలు ఆకాశం అంత విశాల హృదయులు అని అర్థం !చాలా చదువుకున్న ఆవిడలా ఉంది.చుట్టూ చూశాను చాలా హడావుడిగా ఉన్నారు ఈ ప్రపంచమే  ఒక విచిత్రం  జీవితం, ఒక చదరంగం లాంటిది? అందులో ఆడే పావులం!మనం

ఏ పావు ఎటుమలుపు తిరుగుతుందో  తెలియని   ఈ వింత జీవితం భగభగ మండే ఎండల్లో కాయకష్టం చేసుకుని తనపై ఆధారపడెే వాళ్ల కడుపు నింపాలని ఆరాటపడుతుంటారు తల్లిదండ్రులు తమ కడుపులు నిండకున్నా ఫర్వాలేదు తమ బిడ్డల కడుపు నిండాలనే తాపత్రయపడుతూ కష్టపడుతుంటారు పిల్లలుమాత్రం తల్లిదండ్రుల కడుపులు నింపకుండా  తమ స్వార్థం చూసుకునే పిల్లలు కొందరు  తల్లిదండ్రుల ఆనందాన్ని చూసే మరికొందరు కూడా లేక పోలేరు!

“అన్నీ”ఉండి కూడా ?అన్నం పెట్టకుండా తమ
తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా  ఆనాథాశ్రమంలో నెట్టే వాళ్లు కోకొల్లలు తల్లిదండ్రులకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి.తాము కష్టపడ్డ ఫర్వాలేదని  తమ పిల్లలను ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించి  ఉద్యోగాలు చేసుకుని చక్కగా ఉండాలని తల్లిదండ్రులు ఆశించి ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తే  ఉద్యోగాలంటూ ఉన్న ఊర్లను తల్లిదండ్రులను  విడిచిపెట్టి ఉన్నది  ఊడ్చుకుని విదేశాలకు పోయేవాళ్లు ఎంతోమంది  ఉన్నారు.ఊళ్లల్లో ఉంటూ కూడా తల్లిదండ్రులు చూడకుండా వీధినపడేసే వారు మరికొందరు

తల్లిదండ్రుల ఆవేదన ఇంతా అంత అని చెప్పలేము!అందరూ ఉండి అన్నీ ఉండి కూడా  జీవచ్ఛవాల్లా బతుకులను వెళ్లదీస్తున్నారు.అభాగ్యులు  తల్లిదండ్రులకు ఆశలు కోరికలు కూడా ఉంటాయి. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టుగా మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ  జీవించాలని ఉంటుంది తల్లిదండ్రులకు కొన్ని ఆశలు. ఉంటాయి. అవి మనం పిల్లలుగా నెరవేర్చాలి

ఈ వృద్ధాప్యంలో వాళ్లకి ఆలనాపాలనా అవసరం ఇప్పటి తరము వారికి బంధాల విలువలు తెలియవు తెలిసిన అర్థం చేసుకోరు సమిష్టికుటుంబాలలో  కష్టసుఖాలను అర్థం చేసుకుంటారు.మనుషుల విలువలు తెలుసుకుంటారు ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలియదు మనుషులు దూరం అయ్యాక వారి విలువ తెలుస్తుంది.

ఈ రోజుల్లో కొడుకు కోడలు ఉద్యోగాలు చేస్తున్నారు    కోడలు ఉద్యోగం చేసివచ్చేసరికి  ఇంట్లో ఒక మనిషి ఉంటుంది వాళ్ళకెంతో రిలీఫ్గా ఉంటుంది కాని అది వాళ్లు తెలుసుకోరు ? ఉద్యోగం చేసి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది.ఇంటికి వచ్చేసరికి చిరునవ్వుతో తల్లిలాంటి అత్త గ్లాసుడు మంచినీళ్లు ఇస్తుంది.ఎంత బాగుంటుంది పిల్లల ఆలనాపాలన కూడా చూసుకుంటారు వచ్చేసరికి సగం బాధ్యత అయిపోతుంది.అదే”  గుర్తించరు. అది వాళ్లకు అర్థం కాదు? ఫ్రీడమ్ కావాలని కోరుకుంటారు. ఆ ఫ్రీడంలో ఆనందం ఎక్కడుందో వాళ్లకు అర్థం కాదు  నాకు చిన్నప్పుడు  ఒకటి గుర్తుకు వస్తుంది.

మా ఇంట్లో తాతమ్మ ఉండేవి ఇంటి పెత్తనం అంతా తానే చూసుకునేది అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్లం మా తాతమ్మది నోరు పెద్దగా ఉండేది బయట వాళ్లంతా గయ్యాళి అనేవాళ్లు అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు  మేము కూడా గయ్యాలనెే అనుకునేవాళ్లం మా తాతమ్మకి అందరం చాలా భయపడేవాళ్లం  పొలం తాలూకు మనుషులు వస్తుంటే  వాళ్లు కూడా చాలా భయపడేవాళ్లు
చాలా గట్టిగా మాట్లాడేది నాకు చాల భయం వేసేది  ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ అందర్నీ హడావుడి పెట్టేది.కొన్ని రోజులకు తాతమ్మ కాలం చేసింది.

అప్పుడు కానీ మా అందరికీ తెలిసి రాలేదు ఎక్కడి పనులు అక్కడే ఉండేవి ఒక్కసారిగా మా ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది.అప్పుడు  బాధ్యతలన్నీ మా నాన్నపై పడ్డాయి!  చేసేవాళ్ళుంటే ఏది మనకు తెలియకుండా గడిచిపోతుంది బాధ్యతలను నెరవేర్చాలంటే ఎంత కష్టం ఉంటుందో అప్పుడు అందరికీ తెలిసి వచ్చింది.అప్పుడు అర్థమైంది మా తాతమ్మ లేని లోటు మా కోసం ఎంత కష్టపడిందో   అది గుర్తుకు వస్తే చాలా కష్టంగా ఉంది నా కళ్ళల్లో     నీళ్లు తిరిగాయి! నాకు ఇంకా నా కళ్ళముందే జరిగినట్టుగా ఉంది. ఎంత కష్టపడిందో?

“అందులో “పని చేస్తుందో ఏమో ఇటువైపుగా వస్తుంది.
యంగ్ లేడీ నావైపు తిరిగి ఎవరు కావాలండీ అని అడిగింది? సుందరమ్మగారు కావాలండి అన్నాను.  మీరెవరు ?ఆమెకేం ?అవుతారు! అని అడిగింది.  అమ్మమ్మగారు అవుతారని చెప్పాను  అవునా?  అటువైపు   స్ట్రెటుగా వెళ్లండి అంది!  నవ్వుతూ అలాగే  థ్యాంక్యూ అన్నాను నేను కూడా నవ్వుతూ చాలా ఏళ్ల నుండి  ఇక్కడే మా ఆశ్రమంలోనే  ఉంటుందని చెప్పి వెళ్లింది. నేను అటు వైపుగా వెళ్ళాను  అక్కడ ఇద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు.

చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను  ఆ ఇద్దరిలో  ఎవరా అనుకుంటూ దగ్గరగా వెళ్లాను
అబ్బా ఎలా ఉండేవారు  ఎలా అయ్యారు అనుకుంటుూ చాలా బాధపడ్డాను.తను చెప్పిన వైపు గానే ఉంది అక్కడ ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నారు.చాలా రోజులైన గుర్తు పట్టాను మా రెండు ఇళ్లు పక్కపక్కనే ఉండేవి  మా రెండు కుటుంబాలు చాలా క్లోజ్గా ఉండేవాళ్లం వాళ్ల అమ్మాయి తులసి నేను క్లాస్ మెట్స్  బాగున్నారా అమ్మా అని అడిగాను ఎవరు అన్నట్టుగా తన కళ్లజోడును సవరించుకుంటూ నావైపు చూసింది. ఎవరు అన్నట్టుగా  నేను అమ్మ తులసి ఫ్రెండును రాధను నన్ను గుర్తుపట్టలేదా అమ్మ అన్నాను.

ఎప్పుడు వాళ్ళింట్లోనే ఉండేదాన్ని  తులసిని చూసినట్టుగానే నన్ను చూసేవారు  సుందరమ్మ గారు ఎంతో అందంగా ఉండే వారు.అందమైన జడకొప్పు  దాన్నిండా మల్లెపూలు ఎప్పుడు నలగకుండా పెద్ద అంచు చీర కట్టుకునేది చేతులనిండా గాజులు వేసుకొని నుదుటిపై ఎర్రని పెద్దబొట్టు పెట్టుకుని   ఎప్పుడూ చెక్కు చెదరని చిరునవ్వు ఉండేది.

అడిగిన వారికి లేదనకుండా  కడుపునిండా అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి లేదనకుండా పెట్టేది ఆ తల్లి ఇప్పుడు ఎలా ఉంది తులసికి ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది.  అంత వరకే తెలుసు నేను కూడా అమ్మ అనెే పిలుస్తాను నన్ను  గుర్తుపట్టారా చేతులు పట్టుకుని అడిగాను ఆమెను అప్పట్లో చూస్తే అలాగే చూడాలని పించేంత అందంగా ఉండేది.మనసు బాధతో కలుక్కుమంది

తులసి ఫ్రెండ్ రాధని మీ ఇంటి పక్కన ఉండే ప్రసాద్  గారి  అమ్మాయిని  నెేను పరిచయం చేసుకున్నాను. “అమ్మ ” చాల సన్నబడింది.జుట్టు అంతా తెల్లబడిందీ. గుర్తు  పట్టనట్టుగా మారిపొయింది.తులసీ అనగానే   కళ్లనుండి కన్నీటిబొట్లు రాలాయి.ఎవరు అమ్మ నీవు
కళ్ల జోడును సరిచేసుకుంటూ అడిగింది.

నేను రాధను అమ్మ బాగున్నారా అన్నాను ఏదో ఇలా ఉన్నాను,తల్లి మేము గూడూరుకు వచ్చాము?  మా నాన్నగారు పోయారు. దినకర్మ జరిగింది. అక్కడి కార్యక్రమాలన్నీ చూసుకొని మీ గురించి వాకబు చేశాను మీ గురించి ఇలా తెలుసుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది.అంటూ దగ్గరకు తీసుకుంటూ బాధపడింది.

రాఘవయ్య గారు పోయారు ఆయన పోయాక ఆస్తులన్నీ అమ్ముకొని అమ్మగారిని అనాథ ఆశ్రమంలో వేసి పిల్లలు విదేశాలకు వెళ్లిపోయారు? అని చెప్పారు. ఎలాంటి  దొరసాని ఎట్లాగయ్యారని ఎవ్వరూ లేని అనాధలా  ఇక్కడ ఉన్నారని చెప్పారు.  ఇలాంటి పరిస్థితి ఏ కన్నతల్లి కూడా రాకూడదు అని అందరూ బాధపడ్డారు. నవమాసాలు మోసి కనిపెంచి  తన కష్టాన్ని ధారపోసి ఇంతటి ప్రయోజకుల్ని చేసిన అమ్మా నాన్నలను బరువు అనుకుంటున్నారు తల్లి రుణం తీర్చుకోలేనిది.ఇలా చేయాల్సింది కాదు ? అన్నారు. అక్కడి జనాలు బాధతో చెప్పింది రాధ

ఇంతటి విపరీత కాలం వస్తుందని ఊహించను కూడా లేదు అంది సుందరమ్మ ఈ వృద్యాప్యంలో  పిల్లలు చేయూతగా ఉండవలసిన టైములో   ఒంటరిగా వదిలి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ?ఈ విపరీత కాలం కాకుంటే మరోటి ఏంటి  ఏం బాగోనమ్మ  చావలేక బతికి ఉన్నాను అలా ఎందుకనుకుంటారు?అమ్మ అలా అనుకోకుండా ఎలావుండనమ్మ  బాధగా అంది.

ఏమీ అనుకోకు తల్లి వయసు వచ్చిందిగా ఏదో వాగేశాను నా వైభోగమంతా ఆయనతోనే పోయింది. అంటూ నిట్టూర్చింది.అది అంతా ఒక కళ ఇది నిజమనే భ్రమల్లో బ్రతికాను ఇన్నాళ్లు  ఇప్పుడు వుండేది! అసలైన వాస్తవం!  ఒంటరిగా భూమిపై పడ్డాను ఒంటరిగా పోతాను  అలా అనకూడదు అమ్మ మీరు నాతో రండి  బాధ నాకు అర్థమైంది! ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ?నాతో రండి  ఇప్పుడు నేను ఎక్కడికీ రాలేనమ్మా  మీరు నాతో వస్తారని ఎంతో ఆశతో వచ్చాను నేను ఈ  కొత్త ప్రపంచంలోఅడుగు పెట్టాను.

వీళ్లంతా నాతో చక్కగా కలిసిపోయారు వీళ్లంతా నా ఆత్మీయులు నా ఆత్మబంధువులు ఇప్పుడు వీళ్లే నా ప్రపంచం ఎక్కడ పొందలేని ప్రేమను వీరితోనే పంచుకుంటున్నాను. మర్చిపోయిన గతాన్ని గుర్తు చేసి నన్ను బాధపెట్టకు తల్లి మేమంతా కలిసి కట్టుగా
సంతోషాన్ని పంచుకుంటూ హాయిగా ఉంటున్నాము .
మాకు ఇప్పుడు కావలసింది కొడుకులు కోడళ్లు కాదు ప్రేమను పంచే ఆత్మీయులు కావాలి

ఇప్పుడు పిల్లలతో రుణానుబంధం అయిపోయింది ఇక వీరితో ఉన్న రుణానుబంధం మిగిలి ఉంది
ఇలా గడవని మా శేష జీవితాలు ఇక వెళ్ళిరామ్మా
గతాన్ని మరిచిపోయి హాయిగా ఉన్నాం కలత చెందిన బాధతో నిట్టూర్చింది. వికలమైన మనసుతో వెనుదిరిగింది రాధ.

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!