పిగ్గీ బ్యాంక్

పిగ్గీ బ్యాంక్

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

 

          అది ఒక ఒక మధ్య తరగతి కుటుంబం, ఎంతో పొదుపుగా చాలీచాలని జీతంతో భారంగా ఇద్దరు చిన్న పిల్లలతో సంసారం నెట్టుకు వస్తున్నాడు ‘వెంకటేశం’ అలాగే భార్య ‘మంగ కూడా అన్ని ఖర్చులు తగ్గించుకుంటూ తన ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా చూస్తూ కాలం వెళ్లదీస్తుంది.
ఆ ఇద్దరి పిల్లల్లో మొదటిది పాప ‘కారుణ్య’ 6 ఏళ్ల వయసు, రెండోవాడు బాబు ‘నిఖిల్’వయసు 2 ఏళ్ళు.
అలా సాగిపోతున్న సంసారంలో ఒక అలజడి రేగింది, బాబు  నిఖిల్ కు ఆస్తమాను ఏదో అనారోగ్యానికి గురికావడం, డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం వారు చేసిన చికిత్సకు, మందులకు డబ్బులు చాలక అప్పులు చేయడం అలవాటైపోయింది, దీనివల్ల భార్య భర్తల కు మనశ్శాంతి లేక ఏం చెయ్యాలో పాలుపోనీ సమయంలో  ఒక డాక్టరు చెప్పిన పిడుగు లాంటి వార్త వారిని కలిచి వేసింది.
“చూడండి, జాగ్రత్తగా వినండి, మీ అబ్బాయి అంతా ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ  మెదడులో ఒక నరం సరిగ్గా ‘ఫార్మ్’ అవ్వక బాబు తరచుగా చెప్పలేని తలనొప్పి, వాంతులు వలన క్రమంగా క్షీణించి పోతున్నాడు, మీరు త్వరగా గా  ఒక ‘న్యూరో సర్జన్’ కు చూపించడం మంచిది” అనగానే ఆ తల్లిదండ్రులు కాలికింద భూమి జారిపోతున్న ట్లు అనిపించింది.
ఆ తర్వాత బాబు ని తీసుకుని పేరుమోసిన డాక్టర్ (న్యూరో సర్జన్) దగ్గరకు వెళ్లి చూపించేసరికి, ఆయన అన్న మాటలు విని నిర్ఘాంతపోయారు, ‘మిస్టర్ వెంకటేశం, మీ బాబుకి ఒక ఒక చిన్న ఆపరేషన్ అవసరం పడుతుంది, ఎందుకంటే బాబు పుట్టినప్పుడే అతని మెదడు లోని ఒక నరం సరిగ్గా ‘ఫార్మ్’ అవ్వక చాలా బాధపడుతు తన బాధ ఏమిటో చెప్పలేని పసికందు, కనుక మీరు “ఒక లక్ష రూపాయలు” ఖర్చు పెట్టగలిగితే నాలుగు రోజులలో ఆపరేషన్ చేసి బాబుని బాగు చేస్తాను, అది ఇప్పుడు చేస్తేనే మంచిది, పెరిగి పెద్దయ్యాక చేసిన లాభం లేదు, మీరు నిర్ణయించుకోండి”, అని అని కొన్ని మందులు రాసి పంపించేశారు.
ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఎంత మందిని అడిగిన లాభం లేక విసిగిపోయిన వెంకటేశం ఆరోజు రాత్రి భార్య మంగ తో, “ఏమే, ఏం చేద్దాం, మన పరిస్థితి  గట్టెక్కేదెలా, బాబు ‘ఆపరేషన్’మనం చేయించ లేము, మందులతో ఎన్నాళ్ళు నెట్టుకొస్తోము, పోనీ లేవే మనకు వాడు ఎంతకాలం ప్రాప్తమో అంతేకానీ, నువ్వు చేస్తున్న పూజలు కూడా ఫలించలేదు, ఒక్క సాయం చేసేందుకు మన బంధుమిత్రులు కూడా మధ్యతరగతి మనుషులే కనుక దేవుడే శరణ్యం”,  ఆయనే మన బాబు కి అద్భుతమైన వింత మందు పంపిస్తాడు బెంగ పడకు ,అంటూ కంట నీరు పెడుతున్నా తల్లిదండ్రులను చూస్తూ ఏమీ అర్థం కాక తమ్ముడి తల రాస్తూ కారుణ్య కూడా  ఆలోచించసాగింది.
ఆ మరుసటి రోజు సాయంత్రం కారుణ్య స్కూల్ నుంచి రాగానే ‘అమ్మ, ఇప్పుడే వస్తాను,’ అంటూ తన రూములోనే దాచుకున్న ఒక “పిగ్గీ బ్యాంకు” డబ్బా తీసుకుని బయటకు పరిగెత్తింది, ఎన్నో రోజుల నుంచి దాచుకున్న డబ్బులను సరిగ్గా లెక్కపెట్టలేనీ వయసులో  సందు చివరనున్న ‘మెడికల్ షాప్’ కు వెళ్లి “అంకుల్, మా తమ్ముడికి మంచి అద్భుతమైన వింత మందు ఇవ్వండి, వాడు చనిపోతాడు అంట, మా అమ్మానాన్న ఏడుస్తున్నారు వారి దగ్గర  డబ్బులు లేవు, ఇదిగో  నా ‘పిగ్గీ బ్యాంకు ‘లో చాలా డబ్బులు ఉన్నాయి, ప్లీజ్ తొందరగా మందులు ఇవ్వండి, అంటూ ఎంత చెప్పిన నా వినకుండా షాపు దగ్గర ఏడుస్తున్న కారుణ్య ను”‘పాప, అలాంటి మందులేమీ లేవు వెళ్ళిపో మీ నాన్న ని తీసుకురా”, అని విసిగి పోయి గెంటి వేస్తున్న షాపు ఓనర్ అరుస్తున్న నేపథ్యంలో  షాపు లోపల కూర్చుని ఉన్న అతని అన్నయ్య గారు ఆ రోజే ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఈ గొడవంతా చూస్తున్నా అతను లేచి  “ఉండరా, నేను మాట్లాడుతాను’చిన్న పాప కదా, అంటూ కారుణ్య దగ్గరకు వచ్చి ‘, “ఏమైంది, నీకు ఏం కావాలి, మీ ఇల్లు ఎక్కడ,? పద , నేను వచ్చి మాట్లాడతాను అంటూ వ్యాపారానికి అడ్డం కాకుండా కారుణ్య తో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
“రండి అంకుల్, మా ఇంటికి మా తమ్ముడ్ని చూపిస్తాను, అంటూ లోపలికి తీసుకు వచ్చి “అమ్మా, మందుల షాపు అంకుల్ వచ్చారు తమ్ముడ్ని చూస్తారట”అని పిలవగానే మంగ చీర సర్దుకుంటూ వచ్చి ‘నమస్కారమండి, మా పాప ఏమైనా గొడవ చేసిందా, అంటూ కంగారుగా అడిగింది,
లేదమ్మా, మీ పాప మా షాప్ దగ్గర అ ఏడుస్తూ తన పిగ్గీ బ్యాంకు లోని డబ్బులతో ఏదో వింత మందు ఇమ్మని ఏడుస్తుంది అందుకే అర్థం కాక నేను వచ్చాను, అని అతను అనేసరికి కళ్ళనిండా నీళ్ళతో, ఏం చెప్పమంటారు సార్, రోజు మా బాధలు చూస్తూ తన తమ్ముడు ఏమైపోతాడో, నన్న బెంగతో మీ దగ్గరకు వచ్చింది, చిన్నది ఇది మా అమ్మాయి తప్పు క్షమించండి, అనేసరికి ‘మీ వారు ఏరి? అసలు ఏమైంది? అంటూ ఆరా తీసేసరికి మొత్తం జరిగిందంతా వివరిస్తూ తన బాబు నిఖిల్ ని చూపిస్తూ చెప్పింది, ఇంతలో అప్పుడే వచ్చిన వెంకటేశం కూడా ఎంతో బాధపడుతూ డాక్టర్లు చెప్పిన విషయాలు చెప్పాడు.
“సరే బాధపడకండి, అమ్మా, నేను  ఆ మెడికల్ షాపు ఓనరు అన్నయ్యని నిన్ననే ‘ఇంగ్లాండ్ ‘నుంచి వచ్చాను మా ‘న్యూరో సర్జన్’ డాక్టర్ల అంతర్జాతీయ సమావేశం ఉంది, అందుకోసమే నేను వచ్చాను, రేపు జరగబోయే ఈ సమావేశంలో మీ అబ్బాయి కేసు కూడా విచారించి, మీ స్థితిగతులు వివరించి బాబు కి ఆపరేషన్ ఉచితంగా జరగడానికి అందరి సమ్మతి పొంది నేను ప్రయత్నిస్తాను, నా పేరు” డాక్టర్ అమర్నాథ్”అని అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఆ దంపతులిద్దరికీ ధైర్యం చెబుతూ, ‘”పాపా, మీ తమ్ముడికి అద్భుతమైన వింత మందు నా దగ్గర ఉంది, మీ తమ్ముడికి ఆరోగ్యం బాగుంటుంది, ఇకనుంచి నువ్వు ఏడవకుండా తమ్ముడితో ఆడుకో” అంటూ వెళ్లిపోయారు డాక్టర్ అమర్నాథ్.
ఆరోజు చాలా హడావిడిగా వచ్చిన వెంకటేశం,’మంగ, బాబు ని తయారు చేయు, మన అదృష్టం, ‘డాక్టర్ అమర్నాథ్’ గారు కబురు పంపించారు, ఈ రోజే ఆపరేషన్ చేయడానికి వాళ్ల  న్యూరోసర్జన్ డాక్టర్ల సమావేశంలో అనుమతించారు, ఆయన దయవల్ల మన బాబు కి’ K.G.H’లో ఆపరేషన్ చేస్తారట, నీ పూజలు ఫలించాయి, అంటూ చెప్పేసరికి దేవుళ్లకు వేయి దండాలు పెడుతూ బాబు ను తయారు చేసి, కారుణ్య తో సహా బయలుదేరారు.
‘డాక్టర్ అమర్నాథ్ ‘గారు ఎంతో సహృదయంతో చక్కగా బాబు నిఖిల్ కు విజయవంతంగా ఆపరేషన్ చేశారు, ఆ వార్త తెలిసిన కారుణ్య ఎంతో ఆనందంతో తల్లిదండ్రులను హత్తుకుంటూ “అమ్మా, డాక్టర్ అంకుల్, ఎంత మంచి వారు, నేనింక రోజు తమ్ముడితో ఆడుకుంటాను'” అంటున్న ఆ పసి దాన్ని గుండెలకు హత్తుకుంటూ ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందం పొందడం చూస్తున్న ప్రతివారికి కంటి నీరు తెప్పించింది.
అందరి ముందే వెంకటేశం, మంగ డాక్టర్ గారి కి కృతజ్ఞతా పూర్వకంగా ఆయన పాదాలకు నమస్కరిస్తూ మీరే మాకు “ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి” లా సమయానికి ఆదుకుని మమ్మల్ని అన్ని విధాల కాపాడారు, అంటూ అనగానే, డాక్టర్ గారు,”ఇందులో నా గొప్ప ఏమీ లేదు, నాకు చేతనైన సహాయం చేశాను దీనికి కారణం, మీ అమ్మాయి కారుణ్య, ఆమె తన తమ్ముడి కోసం  చిన్న వయసులో ఎంతో సాహసం చేసి మా షాప్ దగ్గరికి వచ్చి తన పిగ్గీ బ్యాంక్ లోని డబ్బులతో ఏడుస్తూ ఒంటరిగా పోరాటం చేసింది అదే నా గుండె ను కలిచివేసింది, ఎంతైనా “కారుణ్య ది గ్రేట్”అంటూ మెచ్చుకుంటూ, ఇదిగో నీ ‘పిగ్గీ బ్యాంకు’ లో నేను కూడా డబ్బులు వేస్తున్నాను, దాచుకుని తమ్ముడు నువ్వు ఆడుకోడానికి మంచి బొమ్మలు కొనుక్కోండి అంటూ కారుణ్య ని ఎత్తుకొని ముద్దాడారు” డాక్టర్ అమర్నాథ్”.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!