మహిళలపై మానవ మృగాల వేట

మహిళలపై మానవ మృగాల వేట

రచన: బుదారపు లావణ్య

అడుగడుగునా
ఆపదల పోరాటం
ఆదరణ కరువైన
ఇల్లాలి జీవితం….

రంగురంగుల
కలలతోసాగిన బాల్యం
యవ్వనంలో
మొదలైన కష్టాలు
స్వేచ్ఛకు నోచనిజీవితలు
పంజరంలో చిలుకలు
ఈ వణితలు…..

ప్రేమపేరుతో
వలలువేసే వంచకులు
పసిబిడ్డలను
వదలనిపాపాత్ములు
కామాంధుల నడుమ కాలగమనం
ఏ… క్షణం ఏం జరుగుతుందో
తెలియని అతివలజీవితం….

వావివారుసలు
మరిచిన జనం
వణితలని
వరించే బలవన్మరణం
మానవత్వం మరిచిన
మృగాలు మానిని మానం
దోచి చంపే రాబందులు….

మానవ సమాజంలో
మహిళ మనిషియే
మగాడు మనిషియే అయినా
మనిషి మనిషిపై
చేసే అరచకాలేన్నాళ్లు
ఎన్నాళ్లీ…మహిళలపై అత్యాచారాలు….

సమధర్మం సమవర్తన
సమాజంలో సాగిన
సడలునేమో
అతివల ఆక్రందన
ప్రాణానికి ప్రాణం బలిగొన్న
అంతరించును మహిళలపై మృగలవేట
అంతరించును మహిళలపై మానవ మృగాలవేట.
***********************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!