ఎండ మావి

(అంశం:: “అర్థం అపార్థం”)

ఎండ మావి

రచన:: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

తాగుబోతైన బద్రి ఎప్పుడూ భార్య సుజాతని బాధపెడుతూ తనేమి చేసినా చెల్లుతుందనే గర్వంతో విర్రవీగే స్వార్థపరుడు.మంచి సంపాదన ఉన్నా తాగుడు వ్యసనమైనందున సుజాత బతుకు అగమ్యగోచరంగా తోచి లోలోపలే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.నన్ను మోసం చేశావని సుజాత అంటూ ఉంటే బద్రి నేను పెళ్ళికి ముందే చెప్పాను తాగుడలవాటు ఉందని అప్పుడు ఇబ్బందేమీ లేదని పెళ్ళై పదినెలలు గడవక ముందే భరించలేక పోతున్నావ్. నేనేమైనా రోజూ తాగుతున్నానా ఏదో రెండురోజులకొకసారి అంతేగా.నీకు అన్నీ సమకూర్చుతున్నా కదా నా తాగుడుతో నీకేం పని అంటూ తనని తాను సమర్థించుకుంటూ సంపాదనలో మునిగిపోయాడు.
పెళ్ళైన నాటి నుంచే సుజాతకి గడ్డురోజులు నెత్తికెక్కి కూర్చున్నాయి.బద్రి ప్రేమగా మాట్లాడింది లేదు అత్త మామల అనురాగం తప్ప భర్త ప్రేమానురాగానికి నోచుకోలేదు.సుజాత అందమైన సోయగపు నెచ్చెలి కానీ బద్రి ఆ కనకపు వన్నె పరువాన్ని రుచి చూడలేదు.అందుకే మగసిరి చేయి తగలని సుజాత తనువు భర్త స్పర్శకై తహతహ లాడినా లాభం లేదు సరికదా.ఒకే ఒక్క విసురు విసిరి నిద్రలోకి జారుకుంటాడు.సుజాత వలపు దాహంతో మంచం పై కూర్చుని ఎదురుగా ఉన్న ఎండమావిలోకి నీరెప్పుడు చేరుతుందా ఆ నీరు తన నోటికెప్పుడు అందుతుందా అని చూస్తూ వేచిచూడడం తప్ప మరో దారి లేదు.అందాన్ని ఆస్వాదించలేని ,తాళికట్టి సృష్టిధర్మం సాగించని బద్రికి ఏదైనా లోపముందేమోనని సుజాతకి మాత్రం డౌటు రావడంలేదు.ఎంతసేపూ నన్ను ఆ దృష్టితో చూడట్లేదు,ప్రేమగా మాట్లాడట్లేదు అంటూ గొడవ పడుతూ ఉంటుంది.

ఓ రోజు బద్రికి పిన్ని వరసైన సుదర్శనమ్మ చుట్టం చూపుగా వీళ్ళింటికి వచ్చింది.సుజాత అత్తా మామలతో ముచ్చటించేశాక సుజాత దగ్గరికొచ్చి ఏవమ్మా బద్రితో ఎలా ఉంటున్నావ్.కలిసి మెలిసి ఉంటున్నారా అనడంతో సుజాత మనసులో దిగమింగిన బాధంతా ఎగదన్నుకొచ్చింది.కానీ బయటపడితే తన బతుకు బజారుపాలవుతుందని అణచుకున్న బాధనంతా సంతోష సంబంరంగా మలచి నయనాలు తడుస్తున్నా సుదర్శనమ్మ ముందు ఆనంద భాష్పాల ముత్యాల్లా పారబోసింది. వీళ్ళ మధ్య గొడవలు తెలుసుకొని వచ్చిన సుదర్శనమ్మకి సుజాత లోపల బాధనుంచుకొని బయటకి ఆనందంగా నటిస్తూ ఉంటే బాధేసి “ఏమే..సుజాత ఇంకా కడుపు పండలేదు కదా ఆస్పత్రికెళ్ళరాదూ..బద్రిలో లోపమా ?నీలో లోపమో తెలుస్తుంది మందులు మింగితే పుట్టకపోరు “అంటూ మీరు మా మాట వింటారా అన్నట్లు గొనుగుతూ పోయింది.

అప్పటినుంచి సుజాతకి అనుమానం వచ్చింది.
ఆయన నిజంగా ఎండమావేనా.నీళ్ళున్నాయని భ్రమ కల్గినట్లే ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉన్నాయనుకుంటున్నానా? తాగొచ్చి అలా దూరంగా ఎందుకుంటున్నాడు.ఆయనకి లవర్ ఉండేదని తెలిసి ఆ ఫీలింగ్స్ ఉన్నాయని అనుకుంటినే. ఇప్పుడెలా తెలుసుకోవడం అనుకుంటూ ఆలోచనలో పడింది.పదినెలలుగా మనసంతా నిండిన ప్రేమ,శరీరమంతా నిండిన తాపాన్ని కళ్ళలోకి తెచ్చుకొని ,పెదాలను నాట్యమాడిస్తూ తన యువ రక్తం ఉరకలేస్తూ ఉంది.

ఆ రోజు గాంధీ జయంతి బద్రి తాగకుండా వచ్చాడు.తిన్నాక మంచంపై పడుకోబోయాడు. సుజాత గెలుపు గుర్రానికి కళ్ళెం లేదు.తన నోటికి గొళ్ళెమూ లేదు.మత్తుగా ఏవండీ అంటూ ప్రేమగా దగ్గర కూర్చుంది.దూరంగా ఉండు నిన్నటి దాకా గొడవ చేసి ఇప్పడేమో దగ్గరికొచ్చి ఏంటి నీ వేషాలు నేను పడను అంటూ అదిలించాడు బద్రి.కొంచెం సుజాత జంకినా తన భర్తతో జీవితాన్ని పంచుకోవాలనుకొని బద్రిపై చేతులు వేసి నా భర్తపై చేతులేసి ముద్దుపెట్టుకొనే స్వతంత్రం కూడా నాకు లేదా అంటూ నుదిటిపై మత్తుగా తన సుతిమెత్తని పెదాలతో ముద్దులు పెట్టింది.బద్రి టంప్ట్ అవుతున్నా ఆపుకుంటూ నన్ను టెంప్ట్ చెయ్యలేవు అన్నాడు.సుజాతకి అనుమానం పెరిగిపోతూ ఉంది.ముద్దులు పెట్టినా ఏంటీ దూరం అని.”అసలు మీ ప్రాబ్లం ఏంటండీ” అంటూ సూటిగా ప్రశ్నించింది.నాకా ప్రాబ్లమా అంటూ బద్రి నవ్వాడు.నేను సీరియస్ గా అడుగుతున్నానండీ నేను దగ్గరికొస్తే కసురుకుంటున్నారు,నేనంటే ఇష్టం లేదా అసలు విషయం చెప్పేదాకా ఈ అపార్థాల సంసారం నేను చేయలేను అంటూ ఏడ్వడంతో బద్రి నేను నా లవర్ ని మర్చిపోలేక తాగుతున్నా నిన్ను చూస్తే నాకెందుకో ఇరిటేషన్ వచ్చేస్తుంది.అందుకే దూరంగా ఉన్నాను అన్నాడు.సుజాత అంతేనా అంటూ బిగికౌగిట్లో బంధించి ఐ లవ్ యూ బద్రీ అంటూ ముద్దుల వర్షం కురిపించింది.ఎప్పుడూ వినని ఆ పిలుపుతో బద్రికి తెలియని కొత్త ఫీలింగ్ ఏర్పడింది.దాంతో సుజాత ఎదురుగా ఉన్న ఎండమావిలోని నీరు ప్రత్యక్షమైనట్లైంది. తనువూ తనువూ కలిసి దశమాస తాపాన్ని తనివితీరా తీర్చుకున్నాయి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!