చిట్టి పాపలు

చిట్టి పాపలు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు 

అల్లరి చేష్టలకు అంతే లేదు
అలసట అన్నది అసలే లేదు
ఆట పాటలకు హద్దులు కానరావు
పరిమితులేవి తమకు పనికిరావంటారు
మట్టిలో ఆడి, దుమ్ములో ఆడి
నీటిలో ఎగురుతూ
స్వేచ్ఛగా ఆడేటి పసిడి మనసులు వారే
పసిడి మనుషులు వారు
తరతమ భేద మసలే కానరావు,
కలిమిలేములు లంటే ఎరుగరు వారు
కోరినవన్నీ వెంటనే ఇవ్వాలి కోపగించుకుంటే
అలిగి పోతారు
ఆట ఉంటే చాలు వారికి
అన్నం నీళ్లసలు అక్కరలేదు
చురుకుగా గెంతేటి ఆటల్లు ఎన్నో
చిలకలా పలుకేటి మాటలెన్నెన్నో
చక్కని చుక్కలుగ వస్తారు వాళ్ళు
దుమ్ము దూళితో ఆడి వెళతారు వాళ్ళు పండువెన్నెల్లాంటి నవ్వులతో వాళ్ళు
వెలుగు జిలుగులెన్నో తెచ్చిపెట్టేరు.
ఆటపాటలతోటి మురిపించుతారు
నటనలెన్నో చేసి నాట్యామాడేరు
అందాల బొమ్మలు అసలు అడగరు వారు
ఆకుల అలములతోనైన ఆడుకుంటారు
చిటపట చినుకుల్లో తడుస్తుంటారు
ఎర్రనీ ఎండల్లో ఆడుకుంటారు
ఆప్యాయతలకు  వీరు పొంగిపోతారు
కోపగించిన చాలు ముడుచుకుంటారు పూలబాటలైతె మురిసిఫోతారు
ముళ్లబాటలు కూడా తెలుసుకోలేరు
మిల మిల మెరిసేటి తారల్లు వారు
చెంగుచెంగున ఎగిరే లేడి కూనల్లు
పచ్చని తుప్పల పడుతూ లేస్తుంటారు
రాళ్ళు రప్పలు అయినా ఎగురుతుంటారు
చిరు చిరునవ్వులతో సిరులు తెచ్చేరు
చిన్నారి పొన్నారి చిట్టిపాపల్లు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!