అతిథికి వీడ్కోలు

అతిథికి వీడ్కోలు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

మనింటికి వచ్చే అతిథికి వీడ్కోలు…
కూర్చున్న చోటు నుండి కదలకుండా ఇచ్చే వీడ్కోలు…
ఇక వెళ్లిరా తల్లి! మరేప్పుడు మా ఇంటికి రాకు! అని చెప్పకనే చెప్తున్నారని అర్థం.
లేచి వచ్చి గుమ్మం దగ్గర ఇచ్చే వీడ్కోలు…
మీ రాక సంతోషం కలిగించిందని అర్థం.
ప్రధాన ద్వారం వరకు వచ్చి ఇచ్చే వీడ్కోలు…
మీ రాక మాకేంతో సంతోషం కలిగించింది…
అప్పుడప్పుడు వస్తుండండి అని అర్థం.
వీధి గుమ్మం వరకు వెళ్లి…ఇచ్చిన వీడ్కోలు…
మీరు ఇలా వచ్చి, వెంటనే అలా వెళ్లిపోవడం బాలేదని…
మరి కొంత సమయం మీతో గడపాలని ఆశ పడుతున్నానని అర్థం…
అతిథి వెనక… లేకా వాహనం వెనక నడుస్తూ వీడ్కోలు చెప్తున్నామంటే…
మీరు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు…
మరల మీరు వచ్చే సమయం కోసం…
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని అర్థం…
ఒక్కోక్కరు ఇచ్చే వీడ్కోలు విధానం…
వారి మనసులో మన స్థానం ఏంటో తెలియచేస్తూ…
వెళ్లాలో వద్దో అన్న నిర్ణయం తీసుకునేలా చేస్తాయని మరవకు నేస్తామా!
మరల వాళ్లింటికి ఎప్పుడు… ఏ విధంగా వెళ్లాలో తెలియచేస్తుందని మరవకు నేస్తమా!!
మరల మరల నువ్వు రావాలని…
అతి తొందరలో మనం కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తూ…
నీరాక కోసం గుమ్మంలో నిరిక్షించే
నీ ప్రియనేస్తం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!