మనువు

మనువు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు 

గల గల పారే సెలయేరుల్లారా, మధుర గీతాల కోకిలమ్మ లారా,

చిలిపి కయ్యాలన్నొ ఆడినా గాని, గిల్లికజ్జాలెన్నో ఆడినా గాని, విడిపోని తియ్యని బాల్య మిత్రులారా,

ఆటలెన్నో ఆడి అలిసిపోయాము, పాటలెన్నో పాడి పరవశించాము,

ఇరుగు పొరుగున ఉన్న పిన్ని, అత్తల్లారా చిరు చిరు నవ్వుల చిట్టి పాపాయిల్లార,

మనువాడి మన ఊరు వదులుతున్నాను, మనసంతా భారంగా కదులుతున్నాను,

మా కన్నతల్లినెపుడు వదిలి నే లేను, నేను లేని లోటు మీరు తీర్చండి

నా కన్నతండ్రినెపుడు వదిలి నే లేను,  నేను లేని లోటు రానీయకండి

జ్ఞాపకాల పెట్టె తీసికెడుతున్నాను, మధ్యమధ్యలో చూసి మురిసి పోతాను,

అత్తవారింటికి వెళ్లె కాలమాసన్నమాయే, కదలి మీరొచ్చి ఇవ్వండి వీడ్కోలు

ఎరుగకా నేను తప్పులే చేసినా, ఎరుగకా నేను మిమ్ము నొప్పించినా, పెద్ద మనసుతోడ నన్ను మన్నించండి,

పదిమంది మీరు కలసినా వేళ, పక్కుమని నవ్వులు చిందేటి వేళ,

పండుగలు పర్వాలు జరిపేటి వేళ, నన్ను ఒక్కసారి తలవండి చాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!