జీవితానుభవం

జీవితానుభవం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జె వి కుమార్ చేపూరి

బడిని వీడేటపుడు మిత్రులు తెలిపే
ఆత్మీయ అభినందనమాల వీడ్కోలు
ఉన్నత విద్యకై విదేశాలుగునపుడు
బంధుమిత్రుల శుభాకాంక్షలు వీడ్కోలు

కళాశాల చదువు ముగిసినపుడు
స్నేహితుల సాగనంపు పలుకు వీడ్కోలు
కన్నకూతురు అత్తవారింటికేగునపుడు
కన్నవారి, తోడబుట్టిన వారి భావోద్వేగ వీడ్కోలు

కలసి ఉన్నప్పుడేన్నెన్నో కలతలు
చిన్న చిన్న గిల్లి కజ్జాలు
చీటికీ మాటికీ అలకలు
చెలరేగిన మనస్పర్థలు, అవన్నీ
వీడ్కోలు సమయాన పటాపంచలు

ఆనంద సమయపు పలుకులు
అభినందనల ఆత్మీయ వీడుకోలు
ఆప్తులు కనుమరుగైనప్పటి భావాలు
అవి బాధాతప్త కన్నీటి వీడుకోలు
పుట్టిన ప్రతి జీవికి చెప్పవలసిందే
ఎదో ఒకనాడు అంతిమ వీడుకోలు
అందుకే చేయిప్పుడే పది మందికి మేలు

==== ** ==== ** ====

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!