అనుకోని కలయిక

అనుకోని కలయిక

రచన:సుజాత

సునిత చాలా వ్యక్తిత్వం గల అమ్మాయి సున్నితమైన  మనసు గలది దానికి తోడు  అందం కూడా ఉంది ఎంత ప్రేమిస్తుందో అంతా ద్వేషిస్తుంది.కూడ అందుకే అంటారు ప్రేమిస్తే  ప్రేమిస్తుంది ఎదైన తేడా.వస్తే అపరకాళిలా లేస్తుంది ఆడ జన్మ  చాలా పవిత్రమైనది అందుకే ఓర్పు సహనం ఆడదానికెే ఇచ్చారు  ఆ ఊర్లో  పట్టాభిరామయ్య పేరు మోసిన రైతుబిడ్డ   జానకి పట్టభిరామయ్యలకు, లేక లేక పుట్టిన బిడ్డ సునిత మెట్రిక్యులేషన్ దాకా చదివింది.

అది మామూలు పల్లెటూరు కావడంతో పైచదువులు  లేక చదువు ఆపేసింది  సునితకి పెళ్లి.చేయాలని  తన భర్తతో .ఏమండీ మన సునితకి పెళ్లీడు వచ్చింది  సునితకి  పెళ్లి చేయాలి కదండి అంది.జానకి అప్పుడే పెళ్లి.ఏంటే అన్నాడు  తన భర్త అది ఇంక చిన్నపిల్లన ఎంటండి అంది జానకి

తన భర్త మాటలకు నవ్వుతూ మన పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగిన.మనకు చిన్న పిల్లలుగానే కనిపిస్తారు  కాని దానికి..పెళ్లి వయస్సు వచ్చిందండి నవ్వుతు అంది అవున నాకు తెలియట్లేదు ఎంత దొందరగా రోజులు గడుస్తున్నాయి

ఆశ్చర్యంగా అన్నాడు అవునండి ఎప్పుడో అప్పుడు  పెళ్లి చేసి పంపించాలి కదండి ఎప్పుడైనా అది వెళ్లాల్సిందేనండి  అంది అవును ఆడపిల్ల అంటేనే ఆడ ఉండేది అంటే.అక్కడ ఉండేది అని అర్థమండి అంది జానకి

తన భర్తకి అత్తారింటికి పంపడం ఇష్టం లేదు ఇల్లరికము పెట్టుకోవాలనే నిర్ణయించుకున్నాడు   సునితకి పెళ్లిచేసి పంపిస్తే తను వెళ్లిపోతుంది. తనని విడిచి మనం ఉండగలమా  ఒక్కగానొక్క కూతురు కద అన్నారు  అయిన తప్పదు కదండి   తను కూడ బాధపడుతు.మరి మనం ఇల్లరికానికి తెచ్చుకుందాం నువ్వు ఎమంటావు అన్నారు.సరేనండి బాగానే ఉంది  కాని అబ్బాయి ఒప్పుకోవాలి ఆ తరవాత అమ్మాయి కూడా ఒప్పుకోవాలి అప్పుడు చూద్దాం  అంది  మనం ఒప్పిద్దాం సరే లెండి మీ సంబరం అంటూ

మీరైతే పంతులుగార్కి చెప్పండి అంటూ వెళ్ళింది వంటగదిలోకి జానకి  అమ్మ  ఏం చేస్తున్నావు నాకు చాల ఆకలిగా ఉంది  అంటూ వచ్చింది సునిత  అయిపొయిందమ్మ పెట్టేస్తాను త్వరగానే  అంది జానకి ఇందాక మీ నాన్నతో నీ.పెళ్లి గురించే మాట్లాడాను   అందుకే లేటయ్యిందమ్మా  అంది అప్పుడే పెళ్లి ఏంటమ్మ అంటూ అమ్మ భుజాలపై గడ్డం.ఆనిస్తు చేతులు వేసి గోముగా అంది చాల్లే  మీ సంబరాలు  మీ నాన్న అలాగే అంటారు నువ్వు అలాగే అంటావు అంది

ఎప్పుడు  మీ మాటే వినాలి సరెే ఇంక నన్నెందుకు అడగడం  అంటూ బుంగమూతి పెడుతూ వెళ్లబోయింది. ఆగమ్మ  అది కాదు తల్లి ఎప్పటికైన పెళ్లి  చెయ్యాలి కద. నీకు తెలియదు తల్లి కన్నతల్లి  బాధ అన్నది ఎ ఆడదానికైన తప్పదు నేను మీ నాన్నను పెళ్లి చేసుకుని రాలేదు అంది నవ్వుతూ జానకి సరే మీ ఇష్టం  అమ్మ అంది   జానకి సంబరంతో  పంతులుగార్కి.కబురు పంపడమే  ఆలస్యం  పంతులుగారు రానే  వచ్చారు

రండి పంతులుగారు నమస్కారం అంటూ కూర్చోండి  అని  చెప్పి  లోపలికి  వెళ్లి  మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది  జానకి ఏమండి  పంతులుగారు వచ్చారు  రండి  అంటూ  జానకి  కేక  వేసి  పిలిచింది  భర్తను ఆ వస్తున్నాను. అంటూ  వస్తూనే .బాగున్నారా పంతులుగారు అని పలకరించారు ఆ మీ దయండి. అన్నారు మా అమ్మాయికి మంచి సంబంధం చెప్పండి  అన్నారు అలాగేనండి అందుకే వచ్చాను  బేస్ అయిన సంబంధం ఉందoడి  అంటూ తన దగ్గర ఉన్న ఫోటోలు చూపించారు ఫోటోలు.చూస్తూ అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

తనకి  నచ్చినవి  పక్కకు పెట్టి అమ్మ సునితా  ఇలా రామ్మ ఈ ఫోటోలో ఏ అబ్బాయి  బాగున్నాడో  చూసి చెప్పమ్మా  అన్నారు ఫోటోలు చూడకుండానే  నాకేం తెలియదు నాన్నగారు మీ ఇష్టం అంటూ వెళ్లింది.

తనకు కూడా  అంతగా నచ్చలేదు ఇంకా ఎమైనా ఉంటే  చెప్పండి  పంతులుగారు  అన్నారు మజ్జిగ పుచ్చకోండి  పంతులుగారు అంటూ జానకి.మజ్జిగ ఇచ్చింది తాగి వెళ్లోస్తానండి అన్నారు.సరేనండీ అంటూ తాంబూలాలు ఇచ్చి పంపించారు  ఏమండీ ఎవరైనా ఉన్నారా  అంటూ బయట నుండి పిలుపు వినబడింది  ఆ ఎవరండీ అంటూ సునిత బయటకు వచ్చింది  ఎదురుగా  ఆరుఅడుగుల పొడవు అందమైన  శరీరచాయతో ఒంటికి నంపిన  డ్రెస్లో చాల  అందంగా ఉన్నాడు  కళ్లు అప్పగించి అలాగే చూస్తుండి పోయింది.

హాలో  మిమ్మల్నేనండి రెండుసార్లు అనడంతో ఆ..ఆ అంటూ.మీకు ఎవరు  కావాలండీ అంది తడబడతూ ఉంగరాల జుట్టుతో ఎంత అందంగా వున్నాడో ఆనుకుంది మనసులో  సునిత ఎప్పుడు చూసినట్టు లేదు. పొరుగుఊరు అబ్బాయి కాబోలు  ఎందుకు వచ్చాడు  చదువుకున్న వాడిలా ఉన్నాడు ఈ పల్లెటూర్లో  ఏంపని .అనుకుంటూనే  అతని .వైపు చూసింది అతను కూడ నా వైపే చూస్తున్నారు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ  ఎవరు కావాలి అన్నట్టుగా చూసింది. ఇంత అందమైన అమ్మాయిని  నేను ఎక్కడ చూడలేదు  కోమలమైన  ముఖవర్చస్సు గల మొహం  లేత గులాభిలా ఉంది హాఫ్ శారీలో అందంగా ఉంది కాటుక కళ్లు రెపరెపలాడిస్తూ ఇంక నా వైపే చూస్తుంది.

పట్టాభిరామయ్యగారు ఉన్నారండి ఆ..ఆ ఉన్నారు
నాన్నగారకి చెప్తాను ఉండండి  అంటూ గబగబా లోనికి వెళ్ళింది.ఎవరమ్మా అని అడిగారు నాన్నగారు ఏమో తెలియదు నాన్నగారూ మీ కోసం వచ్చానంటూన్నారు ఎవరో కనుక్కుందాం పదమ్మ ఎవరు బాబు నమస్కరమండి నమస్కారం ఎవరు బాబు నీవు పరశురామ్ అబ్బాయి నండి అని  తన వివరాలు చెప్పాడు అవునా  బాబూ లోపలికి రా కూర్చో “బాబు”  జానకీ  ఎవరొచ్చారో చూడు ఆ వస్తున్నానండి నా స్నేహితుడు పరుశురామ్ తెలుసు గద వాడి అబ్బాయ్   ఎలా ఉన్నావు బాబు  అమ్మ  నాన్న వాళ్లు  కులాసేయేన అంటూ అడిగింది” జానకి ” ఆ అంటి  అందరు బాగున్నారు  అంతలో సునిత కాఫీ తెచ్చింది  అమ్మనాన్నకు ఇచ్చి ఆ అబ్బాయికి ఇస్తూ తన కళ్లలోకి చూసింది

తననే ఓరగా చూస్తున్నారు కాఫీ తీసుకోండి అంది ఇంక అలాగే చూస్తున్నారు ఎమండి నాన్నవాళ్లు  చూస్తున్నారు.కాఫీ.తీసుకోండి అంది గట్టిగా చూపులు ఆపి నవ్వినవ్వనట్టుగ చూస్తు కాఫీ తిసుకున్నాడు  బాబు నీ పేరు అంటూ అడిగాడు అభిరామ్ అని చెప్పాడు బాగుంది.నాయన అన్నాడు  వాడికి ఇప్పుడైన గుర్తుకువచ్చాను.ఎన్నేళ్లు అయింది.  ఇప్పుడైన కలుసుకున్నాము అన్నారు.సంతోషంగా   అంకుల్ ఎప్పుడు మా నాన్న మీ గురించే  చెప్తుంటారు .హలో నాన్నగారూ  ఆ చెప్పు అభి మీ ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాను. నాన్నగారు అంకుల్ వాళ్లు చాలబాగ రిసీవ్ చెసుకున్నారు.

నాన్న నేను చెప్పాను కదరా నువ్వే భయపడ్డావు సరే నాన్న అంకుల్ కు ఇస్తున్నాను మాట్లాడండి  హలో పట్టాభి ఎలా ఉన్నావురా నీవు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను అరేయ్ పరుశురాము  ఇన్నాళ్లక కలువడం ఇప్పుడు మేము గుర్తుకు వచ్చామట్రా నా బిజినెస్ తెలుసు కద క్షణం తీరిక ఉండదు.ఎప్పుడు ఎదొ హడావుడి నువ్వు కూడ రార ఆ వస్తానులేర అవును వాడి గురించి చెప్పనే లేదు కదు వాడు అగ్రికల్చర్  వ్యవసాయం గురించి చదివాడు  వాడు అక్కడే ఏదో రిసెర్చి చేసుకుంటాడు కొన్నాళ్ల పాటు మీ దగ్గరే ఉంటాడు. ఎక్కడో  ఉంటానంటే  ఎక్కడో ఎందుకు నా  ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను.

సరేరా ఇలాగైనా వస్తుంటావు  ఇక్కడే ఉండని ఎమ్ ఫర్వాలేదు.అన్నాడు పట్టాభి సరేర ఉంటాను సరేనంటూ ఫోన్ పెట్టెసాడు జానకి బాబుకి గది చూపించు సరేనండీ రా బాబు .అంది మిద్దేపై గది చూపించి ఇదే బాబు.నీ గది  ఫ్రెష్ అయిరా  బాబు భోజనం చేద్దువు గాని రా సరే ఆంటీ బ్యాగ్ లోపలపెడుతు అన్నాడు.

గది అందంగా ఉంది  సింగిల్ బెడ్  ఉంది  ఒక టేబుల్ ఒక కుర్చీ కూడా ఉంది   కిటికి  కర్టెన్స్  జరిపి  తలుపులు తెరిచాడు చల్లటి గాలి వస్తుంది పల్లెటూరి వాతావరణం చాలా బావుంది  పండ్ల చెట్లు చాల ఉన్నాయి కిటికీలో నుండి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అభి గారు అమ్మ రమ్మంటుంది భోజనానికి అంటూ సునిత వచ్చింది.వినబడనట్టుంది ఇటువైపు చూడలేదు అలాగే అలోచిస్తు నిల్చున్నాడు హలో అభిగారు అంటూ ఎదురుగా వచ్చి చిటికవేస్తు
హలో సార్ ఎక్కడ ఉన్నారు అంది.ఆలోచనలోనుండి
బైటికి వచ్చి అయ్యో ఎంతసేపు అయ్యిందండి వచ్చి
నొచ్చుకుంటూ.అన్నాడు

ఫర్వాలేదు లేండి అంతగా ఎమ్ అలోచిస్తున్నారు. అంది నవ్వుతూ మీ ఊరి వాతావరణం చాల బాగుందండి అన్నాడు.అవును మీరు పల్లేటూరును ఎందుకు ఇష్ట పడ్డారు.ఉద్యోగాలు చెయడం నాకు ఇష్టంలేదు.వ్యవసాయం అంటే చాల ఇష్టం.రైతులు ఎంత కష్టపడితే మనకు గింజలు వస్తున్నాయి.

అందుకే ఎరువులు ఎలా తయారు చెయాలి మందులు లేనిఎరువులగురించి చెపుతు నేను వ్యవసాయం  చేస్తాను అలాగే నర్సరీ కూడ పెట్టి అందరికి  ఇక్కడి నుండే సప్లయి. చేయాలనుకుంటున్నాను.మరి మీరు పల్లెటూర్లో అడ్జస్ట్ అవుతారా  అవుతాను  అందరికి సేంద్రీయ ఎరువుల గురించి చెప్పాలనుకుంటున్నాను  అందరం మందులేని ఎరువులను తయారు చేసుకోవాలి  మన పంటలకు మనమే ఎరువులను తయారు చేసుకోవాలి చాలా వుందెే మీ దగ్గర నవ్వుతూ అంది పదండి చాలా లేట్ అయింది అమ్మా ఎదురు చూస్తుంది  అంటూ ఇద్దరు కిందికి  వెళ్లారు.రా బాబు భోజనానికి చాల లేటు అయింది ఎమ్ ఫర్వాలేదండి నాకు అలవాటే నేను ఇంట్లో కూడ లేటుగానే తింటాను
అంటీ అన్నాడు.

వడ్డిస్తు ఈ కుర్రాడు చాల కలుపుగోలుగా ఉన్నాడు మంచిచేడుల గురించి తెలిసిన వాడిలా వున్నాడు  తొందరగా అర్థం చెసుకుంటాడు అనుకుంది మనసులో  ఎమ్ నాయన మరి నీవు ఇక్కడే ఉంటావ అని అడిగింది అవును ఆంటీ మరి నీవు.పెళ్లి ఎప్పుడు చెసుకుంటావు.అని అడిగింది జానకి

చేసుకుంటాను ఆంటీ  అమ్మ కూడా రోజు గొడవ పెడుతోంది పెళ్లి చేసుకొమ్మని నేనే ఆగమన్నాను దీంట్లో  సెటిలయ్యాక  చేసుకుంటాను ఆంటీ మనసులో ఒకటే సంతోషం.పిల్లవాడు బుంది మంతుడు తనకు చెప్పాలి సునితని ఈ బాబుకు ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందని ఇక్కడే ఉంటాడు కనుక పెళ్లి చేసుకుని కూడ చూడవచ్చు ఇది ఎదొ బాగుంది.అయిడియా  తన.చెవిలో వెయ్యాలి అనుకుంటు భోజనం కానిచ్చి  తన భర్త దగ్గరకు వెళ్ళి ఎమండి మీ ఫ్రెండ్ అబ్బాయి ఉన్నాడు కదండి మన సునితని ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందండి.

గుక్కతిప్పుకోకుండా లొడలొడా వాగేసింది  అది సరే
వాడు ఒప్పుకోవాలి కదా  ఎందుకు ఒప్పుకోరండీ మీరే అడగండి  సరే లేవెే   ఫోన్ చేసి అడగండి తొందరగా
చేస్తాను లేవే ముందు చేయండి ఫోన్ చేతికి ఇచ్చింది హలో పరశురామ్  చెప్పర పట్టాభి  ఏం సంగతులు మా అభి ఎమ్ అంటున్నాడు ఎలా ఉన్నాడు  నిన్ను ఒకటి అడగాలి చెప్పర  నా దగ్గర మొహమాటం ఎందుకు అది ఎమ్ లేదురా మీ చెల్లేలు జానకి  మీ అబ్బాయిని మా సునితకు ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని నీ అభిప్రాయం అడగమంది నీ అభిప్రాయం మీ అబ్బాయి అభిప్రాయం కనుక్కోవాలి కదా  అని అన్నాన్నేను నీవేమంటావు  శుభం పిల్లలకు  ఇష్టం అయితే నాకేం అభ్యంతరం లేదు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇద్దరి  సంతోషం అంతా ఇంతా కాదు  పిల్లల అభిప్రాయాలు పెద్దల అభిప్రాయాలన్నీ కలిశాయి శుభముహూర్తాన  అభి సునీత పెళ్లి  అంగరంగ వైభవంగా జరిగింది పట్టాభిరామయ్య కోరిక నెరవేరింది కళ్లముందు బిడ్డ అల్లుడు తిరుగుతుంటే కళ్లలో సంతోషం కనబడుతుంది సంవత్సరంలోగ
మనవడిని ఎత్తుకున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!