రమణులు చెప్పిన కథలు

రమణులు చెప్పిన కథలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీరమణాశ్రమం వారి సంకల్పం

సమీక్షకుడు: యాంబాకం.

  ముందుగా పాఠకులకు మనస్సు పూర్తి వందనాలు. రమణ భగవంతుడు ఆధ్యాత్మిక ధర్మలను వివరించుటలో సమయోచితమైన కథల యొక్క ప్రయోజనం ఆత్యంతికమైనది. కథల ద్వారా సత్యం హృదయంలో చక్కగా కుదురుకుంటుంది. రమణులు వచించిన కథల వైపుల్యం వైవిధ్యం అంతా ఇంతా కాదు. అయితే “శ్రీ రమణాశ్రమం వారు భక్తులైన కొంతమంది రచయితల కలయికతో ఈ పుస్తకాన్ని రసపోషణ లో వారికి వారే సాటి అని పాఠకుల,శ్రోతల ఏకగ్రీవమైన అభిప్రాయం. పాత్రస్వరూపం లోలీనమైపోయి తగు అభినయాన్ని మేళవించుట చేత సన్నివేశం రసవత్తరమైన సజీవ సంఘటనగా సాక్షాత్కరించేదట రచయిత తను పాత్ర పోషించిటంలో ఎదురుగా ఏది ఉంటే అదే అయిపోతాడు అన్న సూక్తి ఈ పుస్తకంలో ఉన్న కథలు చదివితే ‌పాఠకులకు అర్థం అవుతుంది. అని నా అభిప్రాయం. ఇందులో శివగాథలు, అరుణాచల మహాత్మ్యము, రామాయణగాధలు, యోగవాసిష్ఠ కథలు, పురాణ ఇతిహాసములు, పెరియపురాణ కథలు, ఉపమన్యు శివభక్త విలాసము, తిరువిలై ఆడల్ పురాణము, పాండురంగ భక్తులు, ఇతరభక్తులు, మహిమలు, వివిధ గాయలు, ఒక్కొక్క దానిలో విడివిడిగా 128 కథలు పొందపరచి పాఠకులకు అందించారు. రమణాశ్రము, తిరువణ్ణామలై వారు. భగవాన్ రమణులు ఇట్టికథలు హృదయంగంమం అన్ని వయసుల వారు చదివి తరించ వలసినదే. కథల సమగ్రసఅవరూపం ఆత్మ స్పూర్తిదాయకం. ఒక్కసారి పాఠకులు ఈ రమణులు చెప్పిన కథలు పుస్తకం చదవి తరరించి పుణీతులు కాగలరని నా అభినందనలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!