ఆన్ లైన్ బంధాలు

కథ అంశం: బంధాలు అనుబంధాలు-2080

ఆన్ లైన్ బంధాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

అది 31/12/2079 సరిగ్గా రాత్రి 12గం//దాటగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పెద్ద, పెద్ద, సిటీ లో, రోడ్డుల మీద వందలాది కార్లు ఇంక పల్లెల్లో అయితే వందలాది బైక్ లు ఇలా ఊరుని బట్టి ఎవరికి వారుగా ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా న్యూఇయర్ చెప్పుకొంటున్నారు. బయట అయితే ఎక్కడ చూచినా టీవీ చానల్ వారు ఆరెంజ్ చేసిన న్యూఇయర్ యాడ్స్ ఆ దీపాలు, ఎలా ఉంటుందో చెప్పతరంకాదు. అంత అందంగా, ఇంక విదేశాల్లో ఉన్న ఆత్మీయుల గ్రీటింగ్ లు ఇంట్లో నేమో టాబ్ లు ప్రతి రూములో హల్లో ఉండే సిసి కెమెరాల కేసి చూస్తూ చేప్పుకొంటూ అలాగే ఆన్ లైన్ లో  కేక్స్ కొనేవారు. ఇలా ఆన్ లైన్ లో నే పుణ్యక్షేత్రాలు దర్శించేవారు. అంతా అన్ లైన్ ఇంకా కాస్త ముందుకు పోతే రోబో లతో పనులు చేయించే పక్రియ జరుగుతూ ఉంది. ఇంక  01/01/2080 ఉదయం 6గం//  అది వైజాగ్ అందులో గాజువాక “సముద్ర లీవింగ్స్” ప్లాట్ నెంబర్ 007, అందులోనే  xyz అనే భర్త, yzx అనే భార్య ఇద్దరూ ఉంటున్నారు. సరిగ్గా ఉదయం 6గం//లకు మెసేజ్ పర్సనల్ ఫోన్ కు ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన నెట్ కెమెరా ల ద్వారా టాబ్ లకు రోబో పనిమనిషి సార్ xyz కాఫీ, మేడమ్ yzx కాఫి ప్లీజ్ అంటూ పలకరింపులు, అదే రోబో లేనివారు, హలో త్రీ టి కప్స్ బిల్లు పైడ్ ఇన్ ఆన్ లైన్ అని మెసేజ్  విత్ఇన్ 10ని/లో టీ డెలివరీ, ఇలా నో హామ్ ప్రిపరేషన్,  ఇంట్లోనే ఆఫీసు ఎవరైనా సరే 8గం//లు జాబ్ తరువాత పర్సనల్ వర్క్ 24గం//లలో, ఎప్పుడైనా జాబ్ జాయిన్ అవ్వచ్చు. భార్య, భర్త, ఇద్దరూ, జాబ్, ఇంటిల్లో నే , ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ గది. ఆ గది లో నే ఆఫీసు పెద్దలకు, పిల్లల కు ఐతే  ఆ గదిలో నే స్కూల్ ఆడుకొవాటాలు, టోటల్, నిద్రలేచేది లేదు పనుకొనేది లేదు సూర్యుని తో నే పనిలేదు ఎవరి సంపాదవారిదే, ఎవరి పుడ్ వారిదే అంతా ఆన్ లైన్ ఆడర్స్ ఇంట్లో కేవలం స్టీమ్, కాకపోతే, ఎ సి అంతా ఎలక్ట్రిక్ పరికరాలు బయట నుంచి అన్ని రెడిమేడ్ తెచ్చుకొన్నామా, వేడి చెసుకొన్నామా, తిన్నామా, నోహామ్ కుకింగ్ భార్య భర్త లు ఒకరిని ఒకరు కావాలంటే విత్ పర్మిషన్ తో ఒకరి గదిలో కి ఒకరు రావాలి, ఎవరికన్న! అనారోగ్యం తో బాధపడుతుంటే వారే హాస్పిటల్ కు ఒక్కరే వేళ్ళి జాయిన్ ఐ మెసేజ్ పెడతారు. నేను హాస్పిటల్ ఉన్నా. డిచ్చార్జ్ కాగానే వచ్చేస్తాను. అని. ఒక వేళ పిల్లల కి ఆరోగ్యం బాగా లేదంటే చిన్న పిల్లల హాస్పిటల్ కు మెసేజ్ చేస్తే చాలు వారు మొత్తం చూసుకొంటారు. దిగులుపడ అవసరం ఉండదు. అది వారి బాధ్యతగా చూసుకొంటారు. ఎందుకంటే ఫ్యాకేజ్. ఇక ప్రతి వ్యాపారం ఫ్యాకేజ్ లే. మొత్తం ఆన్ లైన్ పేమెంట్స్ డబ్బు చూస్తామన్న కనపడదు. నోట్లు అచ్చు గౌవర్నమెంటు రద్దు చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ బ్యాంకింగ్ చివరికి అడుకొనే, భిక్షగాడి కైనా సరే పేటియం లోనే దానం చేయాలి వాడు ఖర్చు ఆన్ లైన్ లోనే చేయాలి, హాస్పిటల్స్ కొత్త కొత్త గా వెలస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఒక ఫ్యాకేజ్ డెలివరీ టైమ్, లో హాస్పిటల్ లో చేరితే బేబీ, మదర్ కేర్ అనే ఫ్యాకేజ్ బేబి కి మూడు సంవత్సరాల వరకు అక్కడే ఉంచుకొని మనకు తిరి మూడు సంవత్సరాల తరువాత అప్పచేప్పుతారు. దానిలో ఎవరికి తగ్గ ఫ్యాకేజ్ లు వారికి ఉంటాయి. ఇక అరవై ఏళ్ళ వయసులో ఉన్న వారికి ఒక ఫ్యాకేజ్ సుఘర్, గుండె, కిడ్నీ జబ్బులు ఇంక అనే కరకాల జబ్బులకు ఫ్యాకేజ్ వారు అక్కడ చనిపోవే వరకు ఉండ వచ్చు. ఎంత కాలం ఉంటే దానికి తగ్గ ఫ్యాకేజ్, ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉంటుంది. ఇక భార్య, భర్తలైతే ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. తాళి బొట్టు ఉండదు. ఒక్క పెళ్లి రోజు మాత్రమే వేసుకుంటారు. లేదు ఎదైనా వ్రతం అలాంటి సమయంలో అది ఇష్టం ఉంటేనే, పిల్లలను, కనాలా వద్దు కావాలంటే ఎప్పుడు కనాలి అనే పూర్తి నిర్ణయం ఆడవారిదే, ఎవరికైనా ఫ్యామిలీ లో ఆరోగ్యం బాగా లేదంటే ఆన్ లైన్ లో వారికి నచ్చిన స్థాయిలో ఉన్న హాస్పిటల్ లో చేరే ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు ముందుగానే తీసుకోవాలి లేదంటే నో ఓపీ నో జాయిన్, కొన్ని సందర్భాల్లో జబ్బులు తెలియక పోవడం వల్ల ఆరోగ్యం బాగా లేని వారిని  వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయాలసిందే వారిని హాస్పిటల్ వారే చూసుకొంటారు. ఎవరు ఉండకూడదు. ఉండలేరు. ఎందుకంటే వైరస్ తెలియని వైరస్. అంతా “సాటిలైట్ యుగం”మన వారు చూడాలను కొంటే ఆన్ లైన్ లో ఒకటైమ్ లో వారి యోగ  క్షేమాలు చూపిస్తారు. బయపడవలసినది. ఏమి ఉండదు. ఎందుకంటే హాస్పిటల్స్ అంతగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే వారికి వ్యాపారం కావాలి కదా! ఇక పెళ్లి చూపులు, పెళ్ళెళ్ళు చాల సింపుల్ గా ఉంటుంది. కులం, మతం, ఇలా ఏది ఉండదు, ఆడ, మగ నచ్చటమే తరువావే  పెద్ద వారికి పిల్లలు మాకు నిన్ను నే మ్యారేజ్ అయింది. ఆన్ లైన్ లో సర్టిఫికేట్ రాగానే మాకు  మొదటి రాత్రి అనే మెసేజ్ తో సంబరపడటమే, గ్యాస్ బుక్, వాటర్ ఇవి అన్నీ ఇల్లు కట్టేటప్పుడే, ఇచ్చేస్తారు. అంతా ఓవెన్ తోనే లేదా పుడ్ఆడర్ తోనే ఇంట్లో  పని భార్యకు ఉండదు. భర్తకు ఉండదు. పిల్లలకు బాక్స్ లు ఉండవు. స్కూల్ అంతా ఇంట్లో ఐయినా  స్కూల్ వారు ఇచ్చే ఫ్యాకేజ్ లను బట్టి వారికి ఆన్ లైన్ లో క్లాసులు పుడ్  స్కూల్ వారిదే, జాబ్ హోల్డర్ సంవత్సరానికి ఒక్కసారే ఆఫీసు కు వెళ్ళితే చాలు ఇక టోటల్ గా వర్క్ ఎట్ హామ్ అది ఏ ఉద్యోగం అయినా! వ్యాపారం అయినా! ఆటోలు ఉన్నా అందులో ప్రతి సదుపాయాలు ఉండాలి అంటే నెట్ లేదంటే  ఆటో కి నో ఫర్మిషన్, కార్లు అంతా ఆటోమేటిక్, గేర్స్ ఉండవు నో డైవర్ ఓనర్ కంమ్ డ్రైవర్ ప్రతి ఇంట్లో ఏ సి గదుల్లో కాదు కాదు సెంట్రల్ ఏసి నో ఫవర్ కట్ అంతా సోలార్ విద్యుత్ సరఫరా ఇంట్లో సోలార్ లేక పోతే ఇక ఇల్లంతా చీకటి కొట్టే ఇల్లు కట్టుకొనే టప్పడే సోలార్ ఉండాలి నిబంధన అప్పడప్పుడే చంద్రమండలం, భుధుడు, అంగారకల మీద ప్లాట్లు వేసి ఆన్ లైన్ లో కొనుగోళ్లు, అక్కడకు కొత్త కొత్త కంపెనీలు రావడం సాటిలైట్ విమానాలు తిరగడం మొదలు అవుతుంది.  ఒకే ఇంట్లో ఉన్న గదిలో నుంచే మోగక్షేమాలు, సఫోజ్ అమ్మమ్మ తో  మనవడు మాట్లాడాలంటే ఆగదిలోనుంచి ఆన్ లైన్ లో నే చాట్ చేస్తాడు. ముసలి వాళ్ళు 50సం//తరువాత బతకడం కష్టం అందుకే వారి కోసం ఓల్డ్ ఏజ్ హాస్పిటల్స్ పుట్టకు వస్తాయి. దానికి తగ్గట్టుగా ఫ్యాకేజ్ లు పాలసీలు, ఉంటాయి. ఎవరి స్థోమతని. బట్టి వారు నచ్చిన హాస్పిటల్ లో చేరవచ్చు.   బంధాలన్ని ఆన్ లైన్ గా మారిపోతాయి” ఎప్పుడో మాత్రికుడు ఒక అద్దం ముందు నిలబడి ఒక మంత్రం చదివి ఎక్కడో ఉన్న రాకుమారి ని చూపించనట్లు గానే” ఆ తంరం కూడా ఆన్ లైన్ లో ఎక్కడో ఉన్న బంధాలను పలకరిస్తారు. ఇంక పుట్టుకలు చావులు అంతా ఫ్యాకేజ్ లు గా మారిపోతాయి ఎక్కడో ఉన్న కొడుకు ఏక్కడో ఉన్న తండ్రి చనిపోతే వారి దహన సంస్కారం లుకు ఫ్యాకేజ్ ల ద్వారా ఏర్పాటు చేసి ఆ బూడిద ను కొడుక్కి పంపుతారు. అది సాధారణం ఐయిపోతుంది. ఆ దహన సంస్కారం అంతా మనకు ఆన్ లైన్ లో లైవ్ లో చూపి సిడి కూడా ఇస్తారు. అది కర్మంతరం రోజు అందరూ చూడవచ్చు. చనిపోయిన తరువాత మట్టిలో బూడవటం ఉండదు. కరేంటుతో కాల్చి బూడిదను ఆన్ లైన్ మాత్రమే ఇస్తారు. ఇందులో బాధ పడవలసిన విషయం గా అనుకోరు. అంతా మాయా జీవితం, మాయా ఆన్ లైన్ జీవితాలు ఆన్ లైన్ ప్రేమలు ఆన్ లైన్ కష్టాలు అన్ లైన్ స్వర్గ సీమలు, టాలెంట్ యుగం స్వచ్ఛ బ్రతుకులు అంతా యాప్ ల ద్వారా నే లగ్జరీ లైఫ్ మాట్లాడు కోవడాలు లేదు చూసుకోవడాలే. వచ్చేకాలం గంధర్వ లోకం మనం ప్రస్తుతం సినిమా వారిని తెరపై చూసి ఎలాగైతే వారికి అభిమానులు గా మారి పోతున్నామో!అభిమాని స్తున్నారో! అలాగే మనం, మనవారిని, మనబంధాలనను తెరపై చూసుకుని అభిమానించు కోవడమే ఇక రాబోయే కాలంలో ఇంకా చెప్పాలంటే రాజకీయ పార్టీలు గాని, రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ సైన్స్ లేదా, కొన్ని కోర్సులు పెట్టి ఆ కోర్సులు చేసి మెరిట్ సర్టిఫికేట్ ఉన్నవారే  రాజకీయం లోకి వచ్చేవిధంగా మార్పులు వస్తాయి.
ఇక దేవుని బంధాలు చూస్తే ప్రతి ఒక పుణ్య క్షేత్రంలో ఆన్ లైన్ ఫ్యాకేజ్ ఆ ఫ్యాకేజ్ ను బట్టి మనకు ఆన్ లైన్ లో పూజలు నిర్వహించి ప్రసాదం ఆన్ లైన్ లో పంపుతారు. ఒకవేళ తలనీలాలు సమర్పించు కావాలంటే ఇంట్లో నే పటం ముందు గుండు గీకి ఆ తలనీలాలను. ఫ్యాకెట్ లో ఆన్ లైన్ పంపిస్తే అవి కళ్యాణ కట్ట లో ఉంచి తరువాత డిస్ ఫోజల్ చేస్తారు. బంధాలు ఆన్ లైన్ లో పదిలంగా మెరుగ్గా ఉంటాయి అందంగా అపురూపంగా ఉంటారు. సంప్రదాయాలు చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే మనిషి దూరమైనప్పడే కదా! ప్రేమలు బయట పడేది. అసలు బంధాలు ఎప్పుడూ ఒకటే త్రేతాయుగం లోను, ద్వాపరయుగం లో ను కలియుగం లోను బంధాలు మారలేదు మార్పు మనలోనే, బుధ్ధి వక్రమార్గం లో పోనంత కాలం బంధాలు అనుబంధాలు చెక్కు చెదరవు, అంతే కాదు ఆన్ లైన్ ద్వారా ప్రతి పని అంటే గౌవర్నమెంటు పని కావచ్చు, పర్సనల్ పని అయినా నిముషం లో గంటల్లో రోజుల్లో యాప్ ద్వారా అవసమైనవి ఫౌరులకే నేరుగా అందుబాటులో ఉంటాయి. అందుకే వచ్చే ముందురోజు గోల్డెన్ డేస్ సాటిలైట్ యుగా నికి స్వాగతం  పలుకుతూ బెస్ట్ ఆఫ్ లక్ 2080.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!