అందమైన మోసం

అందమైన మోసం

రచన:ఎన్.ధన లక్ష్మి

రోషిని ,జ్వాలా  ఈ వీడియో చూసారా అని గట్టిగ అరుస్తూ వస్తుంది శాండీ ..అబ్భా ఏంటి నీ బాధ మార్నింగ్  నస మొదలెట్టావు …యూట్యూబ్ లో వీడియోస్ ని మన జీవితకాలం చూడచ్చు అన్ని అప్లోడ్ చేస్తుంటారు అన్ని చూస్తామా ఏంటి అంటూ నిద్ర లేస్తుంది మన జ్వాలా .. అంతేలేమ్మ  కెనడా లో
మీరు అడుగు పెట్టీ మీకు తెలిసిన వారి అడ్రస్ తెలియక మీరు ఎటు వెళ్ళాలో అయోమయంలో ఉంటే  అరే ఇండియన్స్ పైగా మా అమ్మ పుట్టిన ఊరు నుంచి వచ్చారు అని రూంలో షెల్టర్ ఇవ్వడమే కాకుండా కెనడా మొత్తము  గూగుల్ మ్యాప్ అవసరం లేకుండా మీకు తిప్పి చూపిస్తే నాది  నస అంటావా నేను హర్ట్ అని అలిగి వెళ్లిపోతుంది రోషిని
మళ్ళీ మొదలుపెట్టారా మీ టామ్ అండ్ జెర్రీ వార్ అని కిచెన్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తుంది రోషిని ..మా మంచి శాండీ కదూ బ్రేక్ఫాస్ట్ తిని తరవాత కావాలంటే  అప్పుడు అలిగి కూర్చో  బంగారం నిజమే కదా బాగా తింటేనే నేను ఫైట్ చేయగలను అంటూ స్పీడ్ గ  తింటూ ఉంటే  తనకు పొలమారుతుంది జాగ్రత్త  అంటూ వాటర్ ఇచ్చి వెన్ను నిమురుతుంది జ్వాలా .
మనం మనము ఒకటే నేను కాకపోతే ఇంకా ఎవరు నిన్ను ఏడిపిస్తారు చెప్పు అని నవ్వుతూ జ్వాలా కూడా బ్రేక్ఫాస్ట్ తింటూ ఇపుడు ఏంటి ఆ వీడియో మాటర్ అంటే ఆ వీడియో లో ఉన్న పర్సన్ ని చూపిస్తుంది ..జ్వాలా ,రోషిని షాక్ అవతారు ఆ పర్సన్ చూసి ..
ఆ వీడియో లో అతను గురించి చాల గొప్ప గ చెపుతూ ,ఇపుడు తాను డిజైన్ చేసిన డ్రెస్ లు ఫేమస్ అని ,అయన స్టయిల్ కి ఫిదా అని చెపుతూ ఉంటుంది ఆ యాంకర్ …శాండీ వీడియో ఆఫ్ చేయమంటుంది జ్వాలా ..రోషిని సైడ్ తిరిగి నీ మోసం తెలిస్తే అతను ఎం చేస్తాడు అంటూ ఉంటె  శాండీ  హే ఏంటి మోసం అంటున్నారు ..తెలిస్తే ఏమి అవుతుంది అంటున్నారు ఏంటి ఆ కథ ..నాకు సబ్ టైటిల్స్ లేకుండ కొరియన్ డ్రామా చూసినట్టు ఉంది అని శాండీ అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంగతి చెప్పడం స్టార్ట్ చేస్తుంది రోషిని ..

       నేను ,జ్వాలా ఇద్దరం కలిసి విజయవాడ కి వెళ్లడం కోసం ప్లాట్ఫారం దగ్గర వెయిట్ చేస్తున్నాము ..అపుడు ఒకడు సూసైడ్ చేసుకోవడానికి ప్లాట్ఫారం వైపు వెళ్ళడం గమినించి మేము ఇద్దరం ఫాస్ట్ గ వెళ్లి తనని సేవ్ చేసాం..తరవాత తనని ఒక చోట కూర్చోపెట్టి తనకి వాటర్ ఇచ్చి ఎందుకు చచ్చిపోవాలి అని అడిగితే అబ్బాయీ చుడండి ఇప్పటికి మీరు నన్ను కాపాడవచ్చు ,నేను చావడం మాత్రము పక్క ..ఇప్పటికి నాలుగు సార్లు ట్రై చేశాను ప్రతి సారీ ఎవడో ఒకరు వచ్చి సేవ్ చేస్తున్నారు ఈ సారి నన్ను నేనే పొడుచుకుంటా అని ఆవేశంగా లేచి కత్తిని తీసుకున్నాడు నేను అలెర్ట్ అయి ఆ అబ్బాయీ ని లాగి పెట్టి ఒకటి ఇచ్చాను .. ఆ అబ్బాయీ అపుడు కొంచం కంట్రోల్ అయ్యాడు ఏంటి నీ బాధ అంటే తాను చెప్పడం స్టార్ట్ చేసాడు ..

      నా పేరు సంజయ్ అని నేను ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేస్తున్న ..ఎపుడు లవ్ అని ఏ అమ్మాయీ వెంట పడలేదు ..అలాంటిది నాకు చూసిన వెంటనే నచ్చింది వర్ష ..ఒక మూడు నెలలు తరవాత తను కూడా నన్ను లవ్ చేసింది .. తాను ఏమి కావాలన్నా సరే వెంటనే తన ముందు ఉంచేవాన్ని…తన కోసం పార్ట్ టైం చేస్తూ తనకు కావలసిన వాటిని ఆరెంజ్ చేసేవాడిని ..అలాంటి నన్ను మోసం చేసి వాళ్ళ బావ ని మ్యారేజ్ చేసుకొని అమెరికా వెళ్ళింది తాను లేని జీవితం శున్యం అని ఏడుస్తాడు ..రోషిని ఇంత చిన్న మేటర్ కి నువ్వు చనిపోవాలి అనుకున్నావా అని నవ్వుతూ ఉంటె సంజయ్ లేసి ఏంటి మేడం నా బాధ మీకు కామెడీ గ ఉందా ..అయినా మీకు ఏమి తెలుసండి ప్రేమ గురించి ,ఎవరైనా మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అని ఆవేశంగా మాట్లాడుతాడు ..
రోషిని నాకు ఏమి తెలుసా ..నేను నీ లాగా మోసపోయిన దానిని …
అమ్మ ,నేను ,నాన్న ఇదే నా ప్రపంచం ..నాన్న బిజినెస్  చేసేవారు ..మాది చాలా అందమైన ఫ్యామిలి..నాన్న కు ఎంత పని ఉన్న మా కోసం టైం స్పెండ్ చేసేవారు ..ఒక రోజు మేము అంత కలిసి ఒక పార్టీ కి వెళ్ళాము ..అపుడు వచ్చాడు మా లైఫ్ లోకి వచ్చాడు వరుణ్ .నన్ను చూసి లవ్ అని వెంట పడితే నేను మా అమ్మ నాన్నల ఇష్టమే నా  ఇష్టం అని చెప్పితే వరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడి మా పెళ్లిని ఫిక్స్ చేసారు ..నా మాటకు అంత విలువ ఇచ్చాడు ..
అప్పటి నుంచి నాకు వరుణ్ ప్రాణం అయ్యాడు ..మా ఇద్దరికి చాల ఘనంగా ఏంగౌజ్మెంట్ కూడా చేసారు ..నన్ను ఒక సారీ లాంగ్ డ్రైవ్ కి తీసుకొని వెళ్లి నా మేడలో నల్ల పూసల దండ వేసాడు మా ఆచారం ప్రకారం అది వేస్తె మ్యారేజ్ అయినట్టు ..తరవాత మేము ఇద్దరం ఈ ప్రపంచం తో సంభందం లేనట్టు మా ప్రపంచం లో సంతోషంగా ఒక వారం రోజులు సంతోషంగా ఉన్నాము..
ఒక రోజు మా బాబాయ్ ఫోన్ చేసాడు త్వరగా రా అంటూ మేము వెంటనే వెళ్ళాము   అక్కడ అమ్మ నాన్న ఇద్దరు విగత జీవి గ పడి ఉన్నారు ..నాన్నను తన పార్టనర్ మోసం చేసారు అది తట్టుకోలేక నాన్న కు హార్ట్ ఎటాక్ రావడం వల్ల నాన్న ఆఫీస్ రూమ్ లోనే చనిపోయారని ..అమ్మ  ఆ మాట వినగానే ఆ షాక్ లో  చనిపోయారు అని బాబాయ్ చెప్పాడు ..
మా ఆస్తులు అని పోయాయి అని చెప్పారు ఒక్కసారిగా నా లైఫ్ అంధకారంలో పడిపోయింది ..
వరుణ్ కూడా మాట్లాడడం మానివేసాడు.. ఆఖరికి అమ్మ నాన్న దినం అపుడు కూడా రాలేదు ..నేను వెళ్లి ఎందుకు నన్ను  అవాయిడ్ చేస్తున్నావు  నాకు ఇపుడు అందరికన్నా నీ అవసరం ఎక్కువ ఉంది అన్ని అంటే తాను.. చూడు రోషిని నాకు నువ్వు అంటే ఇష్టం కానీ డబ్బు కావాలా నువ్వు కావాలా అంటే నేను డబ్బు కావాలి అంటాను ..నేను నిన్ను ఇష్టపడడానికి కారణం కూడా డబ్బు ..అది నీ దగ్గర లేనప్పుడు నువ్వు నాకు ఎందుకు .అని అన్నాడు ..ఒక సారిగా నా ప్రపంచం తలకిందులు అయింది ఎవరు సపోర్ట్ లేదు … ఆ అయోమయంలో ఏమి చేయాలో తెలియలేదు .నాన్న ఫోటోను చూస్తూ ఉండి పోయా అప్పుడే నా కర్తవ్యం ఏంటో తెలిసి వచ్చింది.
తరవాత నేను డాక్టర్ అవడం నాన్న గారి ఆశయం..దాని కోసం నాకు ఉన్న తెలివితో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్న ..అపుడే నేను ప్రెగ్నెట్ అని తెలిసి వరుణ్ కనీసం తన బిడ్డ కోసం అయినా నన్ను ఆక్సిప్టు చేస్తాడు ఏమో చిన్న ఆశతో తన దగ్గరకి వెళితే తాను తనకి ఈ బిడ్డ కి తనకి సంబంధం  లేదు కావాలంటే నన్ను బిడ్డ ను అంతం చేయమన్నాడు ఆ క్షణం వాడి మీద ఉన్న ఆ కొంచం ప్రేమ కూడా చచ్చిపోయింది ..ఇపుడు చెప్పు నేను చనిపోవాలి కదా మరి నేను ఎందుకు బతికి ఉన్న ..ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు నేను ఎందుకు చావాలి అందుకే నేను కస్టపడి చదివి డాక్టర్ అయ్యాను ఇపుడు కూడా ఆ పని మీద విజయవాడ వెళుతున్న ..
సంజయ్ కంటి నిండా నీళ్లతో మరి మీ బిడ్డ అంటే నాకు పాపా పుట్టింది ఇప్పుడు తనకి త్రీ ఇయర్స్ ..తనని ఇదో ఇక్కడ ఉండే జ్వాలా తన బామ్మా చూసుకుంటారు .మనం మనలని మోసం చేసినవారికి ఏ శిక్ష వెయ్యవలసిన అవసరం లేదు ..మనం వాళ్లకు అందనంత  ఎత్తుకు ఎదిగితే చాలు.
వరుణ్ కి చాల బాధ వేస్తోంది ..సారీ మామ్ నేను ఎంత పెద్ద తప్పు చేయబోయానో నాకు అర్థం అయింది నేను గొప్పగ బతకతాను అని థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు
శాండీ మరి నీ బిడ్డ ఏమి అయింది ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు అంటే జ్వాలా గట్టిగ నవ్వి తాను చెప్పింధి  అంత ఒట్టి అబద్ధం..రోషిని వాళ్ళ అమ్మ నాన్న తన చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు ..వరుణ్ సేవ్ చేయడానికి ఆలా అబద్ధం చెప్పింది ..మేము తరవాత ఇలా కెనడా కి రావడం ఇక్కడే ఉండిపోయాము …
మరి నువ్వు మోసం అంటున్నావు కదా అని శాండీ అంటే ..హి హి మేము సేవ్ చేయడానికి అల చెప్పడం కూడా మోసమే కదా అని జ్వాలా అంటుంధీ ..
అయితే అతను చెప్పిన ఆ దేవత నువ్వే అన్నమాట..అని శాండీ ఫుల్ వీడియో చూపిస్తుంది అపుడు సంజయ్ రోషిని గురించి చాల గొప్పగ చెప్పి తాను తీసుకున్నఅవార్డు తనకి అంకింతం అని చెప్పుతాడు ..సంజయ్ బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డు తీస్కుని ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆలా చెప్పుతాడు ..తరవాత వరుణ్ తన మరదలను కూడా పెళ్లి చేసుకున్నాడు ..ఇపుడు సక్సెస్ఫుల్ పర్సన్ …
.’అయినా నువ్వు ఎందుకు అల  అబద్ధం చెప్పావు అంటే ..రోషిని నవ్వుతూ సింపుల్ శాండీ ఎదుటివారు బాధలో ఉన్నపుడు వాళ్ళ కన్నా ఎక్కువ బాధ పడిన వారు ఉన్నారు అని తెలిస్తే అపుడు వాళ్ళ బాధ వాళ్ళకు చాల చిన్నగా కనిపిస్తుంది ..నేను చేసింది మోసం బట్ అది ఒక అందమైన మోసం గ ఉండిపోతుంది అని నవ్వుతుంది రోషిని.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!