సైనికుడు

సైనికుడు

రచయిత: బండారు పుష్పలత

సైనిక.. ఓ సైనిక..
భారతజాతి పౌరుషానివి నీవు ..
భారత దేశ గౌరవానివి
నీవు …
భరత మాత ఋణము
తీర్చుకొను భాగ్యశాలివి నీవు..
ప్రతిదినము తుపాకీలతో తెల్లవారుతుంది
మందు గుండ్లతోని మాతులాబాయే..
చుట్టూ శత్రువులతోటి..
మృత్యుదేవతతోటి సహవాసమయే..
పోరాట ప్రతీభతో
భయమన్నదేలేని ధైర్యశాలి…
కడుపు కన్నము లేక…
కంటికి నిదురలేక..
సుఖమన్నదేలేక..
రాత్రీపగలూ దేశాన్నీ కాపాడు సూర్యుడివి నీవు…
అలుపన్నదెరుగక అడివిలో బ్రతుకుతూ నీతోటి సోదరులకె ప్రాణభిక్షపెట్టి న
ప్రాణదాతనీవు…
బాడర్లో నిలుచున్న భరత సింహానివై…..
పంజా విసిరితే ఎంతటి శత్రువువైన గడగడా లాడుతాడు ..
ఏదేశ శత్రువైన హిందూదేశం వైపు కన్నేసినా మరి…
కాలేసి నా వాడిని…
చేతిలో తుపాకీ తూటాలా.. గర్జనతో తుదముట్టిస్తావు..
చలిలోన మంచులో వాన లో ఎండలో ఏ ఋతువులోనైనా
చావుకెదురెళ్ళేటీ ధీరుడవు నీవు …
భరత భూమిలోన
ఏ వీరమాతపుణ్యాలపంటవో నీవు…
తల్లిదండ్రుల వదిలి..
తోడబుట్టిన వాళ్ళ తోడు వదిలి..
భార్య పిల్లల ను బలగాన్నివదిలిన త్యాగశీలి..
అనుకోని స్థితి లోన..
ఊపిరిని వదిలిన…
భరతమాత ఒడిలోనే ఆనంద శయనమని నీ ఆత్మ సంతసిల్లె….
ఓ త్యాగశీలీ నీకు సలాం…
భరత జాతిమొత్తం
మోకరిల్లిన సలాం…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!