కష్టజీవి

కష్టజీవి

రచయిత: తేలుకుంట్ల సునీత

ఆవిరైన కన్నీటి ధార
ఆరని చెమట చుక్కయి..
గరీబుసింగు సెంటు చుక్కల మారి
అలవాటు పడిన మేను
నేనున్నానంటూ భరోసా ఇస్తూ
బాధ్యతల బరువుతో
నడుము వంగిపోయి
పక్కటెముకలు పిక్కటిల్లినా
పంటి బిగువున బాధను బిగబట్టి
అవరోధాలను అవలీలగా
అధిగమిస్తూ…
ఆవురావురంటూ
ఆతృతగా కూటి కొరకు
ఎదురు చూసే…
గూటి పక్షుల
ఆకలి కేకలను ఆర్పడానికి
ఆరు దశాబ్దాలు దాటిన
పట్టువదలని విక్రమార్కుడిలా..
పదములు తడ పడనీయక,
అస్తమించే వయసును లెక్కచేయక
ఆత్మవిశ్వాసంతో ..
చీకటిని చీల్చే సూర్యుడిలా..
వెండి తలకట్టుతో
కాంతులీనే ముఖవర్చస్సుతో
కొన ఊపిరి ఉన్నంతవరకు
ఆహుతై పోవడానికి
ఆలోచించని శ్రమజీవి
చేతిలోని గీతలు మాసిపోయి
నుదుటి ముడతలుగా మారినా
కష్టాన్నే నమ్ముకొని
బతుకుతున్న కష్టజీవి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!