రెండవ నీడ

రెండవ నీడ

రచన : కొత్తపల్లి ఉదయబాబు

ఇపుడు నాకు రెండు నీడలు
ఏ ముహూర్తాన నిన్ను ఆవహించుకున్నానో
తలలో పేలులా, తలపుల్లో తేలులా
కాలిలో ముల్లులా, కంటిలో నలుసులా
మా ఇంటావిడ ప్రతిరూపంలా
కాల్చిన తేగలో చందమామలా
ఉంచలేను విసర్జించలేను
అవసరం తీర్చే సుఖానివనుకున్నా
దుప్పట్లో దాచుకున్న నిప్పువనుకోలేదు
రాచపుండులా మొదలై
సుఖరోగమై నిలవనివ్వడమే లేదు.
జననమరణాల సందిగ్ధ సంధికాలంలో
ఉన్నదానితో సంతృప్తి పొందలేక
ఆశ్రయించే ఆర్తత్రాణపరాయణీ
ఈబాధ తీరి నిన్ను మరల
కౌగిలించుకునే క్షణం కోసం
అటు నువ్వే ఇటు నువ్వే…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!