మనసు వేదన (కవితా సమీక్ష)
సమీక్ష: విస్సాప్రగడ పద్మావతి
కవితా శీర్షిక: మనసు వేదన
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
మనసా వింటున్నావా !!?? అని హృదయాన్ని కనుల ముందు అద్దంలా పరచి, మనసు పడే వేదన , ఎడబాటు నీ ఊసుల మాగాణిలో సేద తీరే తీరు..
చిలిపి చెలిమి చొరవ చేసే అల్లరిని చక్కని పదజాలంతో పోల్చిన వైనం, తియ్యగా పంచే విషాదాన్ని మిగిల్చిన చెడు జ్ఞాపకాలను తివాచీలా పరచి , నవ్వులు పూయించే రంగుల వలపు,మేలుకొలుపు గా.. అలసిపోయిన బంధాలకు ఆరాట పడే మనసును లింక్ చెయ్యడం మీకే సొంతం..
వెలుగు దూరమై, చూపు భారమైన…కన్నుల్లో తడి ఆవిరైనా.. సుడిగుండా సంద్రంలో నిద్రలేని రాత్రులు చవిచూసిన పెదవి దాటని ఊసుల జాడ కానారాకపో యినా.. తోడుకిరణం కోసం ఎదురు చూస్తూ మన కర్తవ్యాలను విడవద్దూ అంటూ.. అధ్భుతమైన పదజాలంతో, అనిర్వచనీయ మైన వర్ణనతో.. సుందరంగా చిత్రీకరించారు మీ కవానాన్ని మరింత అందమైన బాహుకత గల కవనాలు…మీ కలం నుండి జాలువాలాలని హృదయ పూర్వకంగా ఆశిస్తూ.. ఆకాంక్షిస్తూ…
మీ
ఆప్త మిత్రురాలు
విస్సాప్రగడ పద్మావతి
*******************
మనసు వేదన
రచన: దొడ్డపనేని శ్రీవిద్య
ఓ మనసా వింటున్నావా!!
మసక బారిన మనసుకు ఎడబాటు వీక్షణం
సేద తీరేలా మాటల ఊసులు తక్షణం
చొరవ చేసి అల్లరి చేసే చిలిపి చెలిమి
ఆశల కలల ఆవిరి పుడమి
అబద్ధపు మనుషుల చేదు జ్ఞాపకాల కొలిమి
తియ్యటి విషాన్ని విదజల్లే చల్లటి నిప్పులివి
ప్రతి క్షణం మేలుకోలుపుగా ఆలోచనల తలపు…
నవ్వులు పూయించే ప్రపంచం లో రంగుల వలపు…
అలిసి పోయిన బంధాలకు ఆరాట పడే మనసు
వెలుగు దూరమై చూపు భారమైంది
తడిసిన కన్నులలో కన్నీరు ఆవిరైంది
నిదుర కరువై దూరమైన సంబరం
సుడిగుండాలనీటి వలయాలకు వేదన వలలు
గొంతు నుంచి బయట పడ్డ మూగ బాసలు
ఓదార్పు కోరిన మనసుకి అండగా మెదిలే చిరునవ్వు
ఒంటరై, బ్రతుకు నవ్విన వేళ
తోడు కిరణం దారి చూపిన తరుణంలో
మనసు పడే వేదన తీర్చువారు దరి చేరే సమయం అసన్నమయ్యే వరకూ…
జీవితాన్ని సుందర నందన భరితం చేసుకోవటమే తక్షణ కర్తవ్యం
ఓ మనసా వింటున్నావా..!
*******************
మనసుకు ప్రోత్సాహాన్నిచ్చే కవిత
కవితకు ప్రోత్సాహాన్నిచ్చే సమీక్ష
ధన్య వాదాలు పద్మావతి గారు
చాలా బాగా సమీక్ష చేసారు.