డూప్లెక్స్

డూప్లెక్స్

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

నరేష్ టెన్షన్ గా ఇంటికి వచ్చాడు.ఏమైందండీ అంది మాధవి.ఏం లేదు అంటూ కారుతున్న చెమటని తుడుచుకుంటున్నాడు.మాధవి పక్కన కూర్చుని ఎందుకలా ఉన్నారు.ఏంటి ఉమ్మా కావాలా అంటూ నరేష్ మెడపై ముద్దు పెట్టింది.నరేష్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ మాధవిని వెనక్కి తోసేశాడు.
మాధవి “ఏమైందండీ ఎందుకలా కోపంగా ఉన్నారు అంటూ దగ్గరగా రాబోయింది.
“దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు.నీవల్లే నా బతుకు ఇలా త్రశంకు స్వర్గంలా తయారయింది అంటూ నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు”అంటూ బాత్రూం పైన కట్టిన చిన్న స్టోర్ రూంలో దాక్కన్నాడు.మాధవికి ఏం జరిగిందో అర్థం కాలేదు ఆలోచిస్తూ కూర్చొని ఉండగా ఎస్.ఐ క్రాంతి కుమార్ వచ్చి “నరేష్ గారు వచ్చారా” అన్నాడు.ఎస్.ఐ ని చూడగానే మాధవికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.టెన్షన్ గా “రాలేదు సార్.ఏమైందండీ”అంది.మీ ఆయన చిట్ ఫండ్ కంపెనీలోని యాబై లక్షలు దొంగిలించాడు.కనిపెట్టేసిన ఎం.డి రాంజగన్ పై కత్తితో దాడి చేయబోగా స్టాఫ్ కాపాడారు.అటెంప్ట్ టు మర్డర్ అండ్ థెఫ్ట్ కేసులు బుక్ చేశాం.ఇక మీ ఆయన గురించి మరచిపోవడం మంచిది అంటూ ఇల్లంతా వెతకండి అంటూ కానిస్టేబుల్స్ ని ఆదేశించాడు.వాళ్ళు వెతికి బాత్ రూం లోపల ఉన్న స్టోర్ రూం కనపడకుండా ఉండడంతో వెళ్ళిపోయారు.

               నరేష్ ఓ పేరుమోసిన చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్.భార్య మాధవి పేదరికంలో మగ్గి మగ్గి నరేష్ తో ఓ గొప్ప జీవితాన్ని ఊహించుకొని కాపురానికి వచ్చిన ఆశాజీవి.ఒక్కమాటలో చెప్పాలంటే ఆస్తి మూరెడు ఆశ బారెడు లాంటి మనస్తత్వం గల మాధవి నరేష్ కి తోడుగా ఉండాలని తనూ ఉద్యోగం చేస్తూ చివరికి ఒక స్థలం సంపాదించుకున్నారు.కానీ ఆశకి హద్దేలేదు కదా.ఇప్పుడు అందులో డూప్లెక్స్ కట్టి అందరూ ముక్కున వేలేసుకొనేలా చేయాలని తాపత్రయంలో నరేష్ కి నస మొదలయింది.
ప్రతి నెలా మిగిలిన సంపాదనంతా హుండీలో వేసి ఆర్నెల్లకోసారి షార్ట్ టెర్మ్ ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయడం అలవాటుగా మారి పిల్లలకు సరిగా తిండికూడా పెట్టకుండా తయారుచేసేసింది మాధవి.ఓసారి పెళ్ళికి వెళ్ళిన పిల్లలు ఆవురావురంటూ తింటుంటే అందరూ విచిత్రంగా చూశారు.తలకొట్టేసినట్టు భావించిన నరేష్ పిల్లలకి కడుపునిండా పెట్టడానికి కొంత డబ్బు కేటాయించాలని అనుకున్నాడు.తరువాత నెలలో హుండీలో తక్కువ వేయడంతో ఏమైందని మాధవి అడుగగా “మాధవి..కూటి కొరకే కోటి విద్యలు, పిల్లలకు మంచి తిండి కోసం కొంచెం డబ్బు ఉంచుతానని “కరాకండిగా చెప్పాడు.ఇలా అయితే మనం డూప్లెక్స్ కట్టినట్లే అంటూ తిట్లపురాణం అందుకుంది మాధవి.”ఏంటి మాధవి బిడ్డలకంటే ఇల్లే ఎక్కువా?మొన్న చూడు ఎప్పడూ తినని వాళ్ళలా పెళ్ళిలో తింటుంటే నా పరువు పోయింది” అంటూ వెళ్ళిపోబోయాడు.మాధవి”ఆగండి..నేను పిల్లలని పస్తులుంచుతున్నానా ఏంటి ?వాళ్ళ కడుపుకి సరిపడా పెడుతూనే ఉన్నా అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు.ఆ పెళ్ళిలో ఏదో కొత్త ఐటెమ్స్ చూసి ఎక్కువ తిన్నారు అంతే అంటూ నరేష్ మాటలను కొట్టిపారేసి జేబులోని దాచిన డబ్బుని కూడా హుండీలో వేసేసింది.
పిల్లలతో పడుకొని ఉన్న మాధవిని నరేష్ అర్థరాత్రి నిద్రలేపాడు.ఏంటి అంది మాధవి.ఎందుకో నీకు తెలియదా అంటూ మత్తుగా మాట్లాడాడు.అన్నీ కొత్త డూప్లెక్స్ లోనే అంటూ మాధవి ఆశల సౌధాన్ని తన కాపురంలో అడ్డుతెరగా నిలిపింది.నరేష్ ఎంతో ఓర్పుగా చాలా సార్లు పిలిచి తన బెడ్ పై పడుకొని ఆలోచించాడు.”దీనికి ఇంటి పిచ్చి పట్టి బంగారంలాంటి సంసారాన్ని చేజేతులా పోగొట్టుకుంటూ ఉంది.ఆనందంగా ఉండే ఈ వయసు మళ్ళీ వస్తుందా.దీని తిక్క చేష్టలు అనుకుంటూ ఫిక్స్ డ్ డిపాజిట్లన్నీ మెచూర్ అవ్వాలంటే ఇంకా మూడేళ్ళలో ఇంటికి సరిపడా డబ్బు చేతికొస్తుంది.అన్ని సంవత్సరాలు ఎండమావిని చూసినట్లే మాధవిని చూసుకుంటూ బతకాల్సిందేనా.అందం ముందుంటే ఆగడం ఎంత కష్టం.గంధపు ఛాయ నా కళ్ళలో మెదులుతూ,దాని పరువాలు నా ఎదని తడుముతుంటే అన్ని రోజులు ఏం చేయకుండా ఎలా ఉండాలి అనుకుంటూ నిద్రపోయాడు.ఉదయాన్నే లేచి ఎలాగైనా మన కంపెనీలోని డబ్బులను రాంజగన్ కి తెలియకుండా నొక్కేసి ఇంటిని ఓ రెండు నెలల్లో కట్టేయాలని అనుకున్నాడు.అప్పుడే రాంజగన్ కి అనుమానం రావడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కత్తితో దాడి చేయడం జరిగిపోయిందన్నమాట.

     స్టోర్ రూంలో దాక్కున్న నరేష్ దగ్గరికి వెళ్ళిన మాధవి “ఏంటండీ మీకు దొంగతనం చేయాల్సిన కర్మ ఎందుకు?”అంది.ఇల్లు కట్టాకే అన్నీ అంటివి కదే టెక్కులాడీ అందుకే తొందరగా డబ్బులు కావాలంటే దొంగతనమే సరైనదని నేరుగా ఎం.డి బీరువాలో ఉన్న యాబై లక్షలు తీసుకొని రాబోతుండగా రాంజగన్ వచ్చేశాడు.దొరికేశా.నీవల్లే నా జీవితాన్ని నాశనం చేసుకున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు నరేష్.తను చేసిన ఒత్తిడి వల్ల కాపురాన్ని ఇంటితో ముడిపెట్టడం వల్లే ఇదంతా జరిగింది.ఇదంతా నావల్లే జరిగింది అనుకుంటూ “ఏవండీ పిల్లలు ,నువ్వు,నేనూ అందరం కారు మాట్లాడుకొని తమిళనాడుకి వెళ్ళిపోదాం.మీకు పాస్ పోర్ట్ ఉంది కదా మీరు కొన్ని రోజులు దుబాయ్ కి వెళ్ళిపోండి.నేను పిల్లల్ని చూసుకుంటూ ఆ యాబై లక్షల్తో డూప్లెక్స్ కట్టుకొని ఉంటాను ఓ రెండేళ్ళ తర్వాత మీరూ వచ్చేయండి అంటూ తన ప్లాన్ ని చెప్పింది.అంతా విన్న నరేష్ “నేనేమైపోతానో అని కనికరం లేకుండా నువ్వు మాత్రం డూప్లెక్స్ కట్టుకొని ఉంటానంటావా..అంత ఆశెందుకే.మన పిల్లలు ఏమైపోతారోనని నేను బాధ పడుతున్నా.ఒకవేళ నేను దొరికిపోతే నా పిల్లల్ని పోషించే బాధ్యత నీదే.ఆశలన్నీ కట్టిపెట్టి మర్యాదగా తృప్తిగా బతుకు”అన్నాడు.”అలా ఏం జరగదండీ మనం వాళ్ళకి దొరకం.మనం ఎక్కే కారుని ఎవరూ ఆపరు,చెక్ చేయరు.ఎందుకంటే అది తమిళనాడు వి.ఐ.పి కార్ అంటూ హడావిడిగా అందరూ కారెక్కి తమిళనాడుకి చేరిపోయారు.తెలిసిన వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఉంచి నరేష్ ని దుబాయ్ ఫ్లైట్ ఎక్కించేసింది మాధవి.
ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటూ డూప్లెక్స్ కోసం స్థలం కొని లగ్నం చేసి పునాదులు కూడా వేసేసింది.ఇంతలో పిల్లలు ఇద్దరూ కనపడకుండా పోయారు.ఎంత వెతికినా ఎక్కడా కనపడక పోవడంతో పక్కింటి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.పోలీసులు గాలించగా పిల్లలిద్దరూ వాళ్ళ సొంతూరి పోలీసు స్టేషన్ లో  ఉన్నారని మాధవిని రమ్మన్నారని సమాచారం తెలియడంతో మాధవి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది.పిల్లల కోసం వెళ్ళక తప్పలేదు. పోలీసులు విచారణ చేశారు.తన భర్త గురించి ఏమీ తెలియదని చెప్పడంతో “ఊరొదిలెందుకు వెళ్ళావు,అక్కడ ఇల్లు కట్టడానికి డబ్బెక్కడిదంటూ?” అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకక మాధవి తల వంచుకొని రాబోయే సమస్యలన్నింటినీ బేరీజు వేసుకొంటుండగా లేడీ కానిస్టేబుల్స్ లాఠీలను ఒక రౌండ్ వేసేసరికి  నరేష్ ఎక్కడ ఉన్నాడో చెప్పక తప్పలేదు.నరేష్ ఊచలు లెక్కడుతూ మాధవి ఆశకు నేను ఆవిరయ్యాననుకంటూ కాలం గడిపాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!