భార్య.

భార్య

రచయిత: శాంతి కృష్ణ

అమ్మ కావాలి; పెద్దమ్మ కావాలి!
అక్క కావాలి; చెల్లి కావాలి!
కూతురు కావాలి; కోడలు కావాలి!
హితురాలు స్నేహితురాలు కావాలి!
ఆఖరికి పడక సుఖానికి స్త్రీ కావాలి!
కానీ ఆలి అంటే మాత్రం చులకన కదా!!!

పడక మీద పడతి కావాలి కానీ,
భార్యలో అమ్మను చూడలేవా?!

ఆధరించడానికి అక్క చెల్లెoడ్లు కావాలి కానీ,
భార్య లో సోదరి ప్రేమ కనిపించటం లేదా?!

సలహాలు ఇవ్వడానికి స్నేహితులు కావాలి కానీ,
భార్య లో కరణేషు మంత్రి కనిపించ లేదా?!

అమ్మను కని
నీ అమ్మ రుణం తీర్చుకో!
తండ్రివై జీవితం సార్ధకం చేసుకో!!

నీ నుండి వెలువడిన కణాన్ని
సజీవంగా చేతులలో చూసిన
మొదటి అనుభూతిని
ఎన్ని కోట్లు పెట్టి కొనగలవు?!

యౌవనాన్ని కాలరాసి
మధ్యవయసు మంటగలిపి
వృద్ధాప్యంలో వెతుకులాడితే
కంటికి కనిపించే
తోడు దొరుకుతుంది కానీ,
మనసును పెనవేసుకునే
బంధం దొరుకుతుందా?!

ఆవేశం కాదిది ఆలోచన
ఆవేశం కాదిది ఆవేదన
ఆవేశం కాదిది ఆక్రందన
ఆవేశం కాదిది అభ్యర్ధన

ఆలోచించి అడుగు వెయ్యి
నీ మనసుకోక తొడును ముడి వెయ్యి
ఆనందాల తీరానికి మొదటి అడుగు వెయ్యి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!