జీవితం ఒక పుస్తకం

జీవితం ఒక పుస్తకం

రచన : వాడపర్తి వెంకటరమణ

మనిషెప్పుడూ నిత్య విద్యార్థే
జీవితం నేర్పుతున్న పాఠాలను
ఆలోచనాత్మకంగా ఆకళింపు చేసుకుని
ముందుకు సాగుటయే తన కర్తవ్యం
సమ్మిళితమైన జీవిత పుస్తకంలో
కొన్ని పుటలు పరిమళాలు వెదజల్లితే
కొన్ని పుటలు చేదు మాత్రలు వేస్తాయి
రెండింటినీ జీవిత పయనంలో
సమ తూకంగా స్వాగతించాలి
మానవత్వమనే పునాది త్రవ్వి
సేవాతత్ప్రరతనే గోడలు నిలిపి
దయార్ద్ర హృదయనే పైకప్పు వేసి
పదుగురూ మెచ్చుకునేలా
మనిషెప్పుడూ ప్రేమను పంచే
ప్రేమాలయం నిర్మించుకోవాలి
సాటి జీవులకు సహాయపడి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు
సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!