స్త్రీ మూర్తి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన:వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు
“పురిటి నొప్పులతో కాలం గడుపుతున్న,
నా ఒంటరి ఊపిరి చిరునామా,
పేదలపాలిటి కల్పతరువు ఒక ప్రభుత్వ ఆసుపత్రి.
కడుపులో మెలికలు తిరుగుతున్న,
ఒక ప్రాణం బాబో, పాపో ఈ లోక దర్శనం కోసం,
ఎనలేని ఆత్రుత.,’కన్నవాళ్ళ ఆరాటం, మెట్టినింటి ఆశాదీపం,
ఎవరో తెలియని ఆందోళన,
కన్నతల్లి కడుపు చించుకు పుట్టింది ఒకరు,
తల్లి మనోవేదన, తరతరాల అనుభవం,!!
బిడ్డ జన్మ ఆమెకు పునర్జన్మ!!
వంశాంకురం కోసం మెట్టినింటి ఆరాటం,
ఆడబిడ్డ అయితే శాపనార్థాలు!! మగ బిడ్డ అయితే హర్షధ్వానాలు!!
ఇది కలికాలం మహత్యం, చిమ్మచీకటి తొలగింది,
తెలుగు వెలుగుల జాణ’ఉద్భవించింది,
ఏ బిడ్డ అయినా పరవాలేదు,
భార్య ప్రాణాల కోసం భర్త దైవప్రార్థన!!
కాలక్రమాన బాలిక సంపూర్ణ స్త్రీ గా ఉదయించే వేళ, కొంటె కొంటె చూపులతో,
తలపు తలపున పరదాల మాటున,
ప్రియుని కోసం సిగ్గుపడే ఓ మగువా!
నీ అందచందాలు చూచి
నివ్వెరపోయిన బృందావనాలు.!