మస్తు యాదికొస్తుంది

మస్తు యాదికొస్తుంది

రచన: అనిశెట్టి సతీష్ కుమార్

మస్తు యాదికొస్తుంది
మన తెలంగాణ యాస
ఇయ్యాల ఎవ్వరి ఫోన్ల సూడు నీ ఫోటోనే
రోజు మాట్లాడనీకి సిగ్గేస్తుంది
ఎవడెక్కిరిస్తడో అని బుగులైతుంది
గీ రోజుల్లో మన తిండి తిననీకి
నోరు తెరుసుకుంటలేదు
మన బట్ట కట్టానీకి
మన పెయ్యే ఇరుత్తుంది
మన పండుq గ సేస్కోనీకి
మనకే మనసొప్పదు
నీ యాదిలనన్న
తెలంగాణ యాస యాదికొచ్చింది
‘కాళన్న’ నువ్వు ఈడ లేకున్న
గీ ఒక్క దినమన్న సంబరంగుండు
మస్తు యాదికొస్తుంది
మన తెలంగాణ యాస
మళ్ళొచ్చే యాడాది దాక
నీ సెవులకు గీ యాస ఇనవడదు
నీ బొమ్మ ఏడ కనవడదు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!