అసలైన ఆనందం

అసలైన ఆనందం

“ఏవండీ ఎందుకు మీలో మీరే బాధ పడతారు.

మిమ్మల్ని ఒకరినే జాబ్ లోంచి నుంచి తీసే లేదుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఉద్యోగులు కాస్త నిరుద్యోగుల అయ్యారు .మీకు బాధ ఉంటుంది  నిజమే కాదు అనను అంతా మాత్రానికే బతకడం , తిండి తినడం మానేస్తామా చెప్పండి వచ్చి కొంచం తినండి భర్తను బ్రతిమాలింది కుసుమ” ..

” నాకు బాధ తప్ప ఇంకా ఏమి మిగిలింది కుసుమ.

సిటీలో గొప్పగా బ్రతికి చూపిస్తానని అమ్మానాన్నలు ఎదిరించి మరి ఇక్కడికి వచ్చాను. ఎంత ఓవర్ టైం చేస్తున్న ఎంత కష్టపడినా వచ్చే జీతం సిటీ లైఫ్ లో బతకడానికి సరిపోతుంది. ఇంకా గొప్పలకు పోయి స్థాయికి మించి వస్తువులు కొన్నాను. నెల వస్తే EMI లు  కట్టాలి కదా ఎక్కడినుంచి తెచ్చేది. పరువూ పోతుంది నలుగురి ముందు అని తన బాధను చెప్పాడు గోపి.”

“దయచేసి మీరు బాధ పడకండి..బ్యాంక్ లో ఉన్న నా నగలతో మన బాకీలు తీర్చుకోవచ్చు కదండీ”.

కుసుమ  నీ పుట్టింటి వారు నీకు ఇచ్చిన ప్రేమ కానుక వాటిని  అలా ఎలా అమ్ముకునేధి చెప్పు.

“మీరు నా అసలైన బంగారం అండి..మీ ముందు మిగతావి అన్నీ దిగదుడుపే కుసుమ మాటలను విన్న గోపి కంటిలో ఆనంద భాష్పాలు.. అలా నగలు అమ్మి తన బాకీలు తీర్చుకున్నాడు గోపి”

నాన్న  మనం ఎక్కడైనా వెళ్దాము నాకు ఇంట్లో ఉండి పిచ్చి ఎక్కే లాగ ఉంది అని ముద్దు ముద్దుగా కొంచం చిరాకుగా అన్నాడు నాని.

అవును అండి మనం మన ఊరికి వెళ్దాం అండి ఇప్పుడున్న పరిస్థితులకు మనం ఊరు వెళ్ళడం ఉత్తమం.

ఎంతో మంచి ఆలోచన చేసావు కుసుమ.ఎలాగో రెండు రోజులలో లాక్ డౌన్ పెడతాము అన్నారు. రేపు ఉదయమే మన ప్రయాణం లగేజ్ ప్యాక్ చేసేసే నేను కూడా నీకు సాయం చేస్తా అంటు ఇద్దరు కలిసి కావాల్సినవన్నీ సర్దుకున్నారు..

హేయ్ మనం ఊరికి వెళ్తున్నాం అని సంబర పడుతున్న నాని గాడిని చూసి ఇద్దరు నవ్వుకున్నారు.

కోటకొండ గ్రామానికి చేరుకున్నారు

చాలా రోజుల తర్వాత కొడుకు,కోడలు,మనవడిని చూసి చాలా సంతోషించారు లక్ష్మమ్మ సీతయ్య దంపతులు ..

”  నాన్న నా ఉద్యోగం పోయింది..ఏం చేయాలో తోచడం లేదు అని కన్నీరుమున్నీరయ్యారు గోపి…

సీతయ్య కొడుకుని హత్తుకొన్ని.. బాధపడకు రా నీ ప్రతిభ మీద నాకు నమ్మకం ఉంది కచ్చితంగా నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది.నీకు జాబు దొరికేంత వరకు పొలాలు ఎలా గో  ఉన్నాయి కదా వాటిని సాగు చేయి ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలు మనిషిని బలహీనుని చేస్తాయి.

నామీద నీకు కోపం రాలేదన్న మీ మాట కాదని సిటీ కి వెళ్లాను కదా…

సీతయ్య చిన్నగా నవ్వుకుని ఎందుకురా కోపమో బిడ్డ ఎదుగుతుంటే ఏ తండ్రి అయిన బాధ పడతాడ చెప్పు..నీకు సరైన అవగాహన లేక సిటీకి వెళ్లి ఎక్కడ ఇబ్బందులు పడతావని నా బాధ అంతే తప్ప వేరే ఉద్దేశం ఏది లేదు రా..అన్నీ మర్చిపోయి రేపటి నుంచి మన పొలంలోకి నాతోపాటు రా నేను టమాటా వేశాను , వేరుశెనగా పండిస్తున్నాను

అలాగే నాన్న తప్పకుండా వస్తాను”

నాని గాడు వాళ్ళ తాతయ్యా ఒడిలో కూర్చొని మాటలు చెప్పుతూ ఉంటే ఆనందిస్తూ ఆ రోజంతా వాళ్లంతా నవ్వుకుంటూ భోజనాలు చేశారు.

తరువాత రోజు గోపీని కలవడానికి ఊరిలో ఉండే మిత్రులు వచ్చారు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే తనకు ఆ రోజు ఎలా గడిచిందో తెలియలేదు. తన మనస్సు ఎంతో తేలిక పడింది

కుసుమ వాళ్ళ అత్తయ్యా తో  కబుర్లు చెప్పు కుంటూ పిండి వంటలు చేస్తూ ఉన్నారు.

గోపి వాళ్ళ నాన్న గారితో పొలం కి వెళ్లి పంటలు పండిస్తూ ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నారు..

తను పండించిన వేరుశనగ చేతిలో  తీసుకున్నప్పుడు గోపి ఎంతో ఆనంద పడ్డాడు..తను ఓవర్ టైమ్ చేసి శాలరీ తీసుకున్నప్పుడు కూడా అంతా ఆనంద పడలేదు..నిజమైన ఆనందం ఎందులో ఉందో తెలుసుకున్నాడు..

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో కాదు మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఆనందం వెతుక్కోవచ్చు అనుకున్నాడు..

నాని  అయితే ఒకప్పుడు ఫోన్ తో కాలక్షేపం చేస్తుండేవాడు కానీ ఇప్పుడు నాని అయితే కోళ్లను,ఆవులను చూస్తూ వాటితో ఆడుకుంటూ ఉన్నాడు..చుట్టూ పక్కన ఉన్న పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు…

సిటీలో మనం ఎలా ఉన్న పట్టించుకునే వారే ఉండరు.. కానీ గ్రామంలో ప్రతి ఒకరు ఆత్మీయంగా పలకరించే కుంటూ ఉంటారు..వారి మనసులో ఎటువంటి కల్మషం ఉండదు.. కష్టంలో చేదోడువాదోడుగా ఉంటారు..

గోపికి ఒకరోజు తను పని చేస్తున్న ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది మళ్లీ ఉద్యోగంలో  చేరమని ..తను రాను అని గ్రామంలోని తన అసలైన సంతోషం ఉందని తేల్చి చెప్పేశాడు అక్కడే ఉంటూ సంతోషంగా తన కుటుంబం తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించసాగాడు

       రచయిత::ధన

You May Also Like

4 thoughts on “అసలైన ఆనందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!