ప్రసాద్ అభి ‘రుచి’

 ప్రసాద్ అభి ‘రుచి’

రచయిత :: ఎన్.ధనలక్ష్మీ

దేవుడా…ఈ పెళ్లిని అయిన సెట్ అయ్యేలా చూడు స్వామి… పెళ్లి నిశ్చయం అయితే ₹1116 రూపాయలునీ హుండీలో వేస్తాను…. కనీసం ఈ అమ్మాయీ అయిన మా ప్రసాద్ గాడికి నచ్చాలి…. నచ్చేలాగ నువ్వు చేయాలి లేదు అంటే నీకు వారంరోజుల పాటు పూజలు నైవైద్యం పెట్టను..
ఏమ్మా! దేవుడిని బ్రతిమాలలి కానీ ఇలా ఎవరి అయిన వార్నింగ్ ఇస్తారా….
ఇంకా ఏమి చేయను రా…నువ్వు ఎక్కడ పెళ్లి కానీ ప్రసాదు లాగ అయిపోతావు ఏమో అని నా భయం రా బాబు…!
అబ్బా…అమ్మ అలా నా ఫ్రెండ్స్ అంటేనే నేను ఒప్పుకోను నువ్వు అంటే ఎలానే చెప్ప సరే పద వెళ్ళాదాము..
రెండు గంటల ప్రయణం తరువాత వారు రావాల్సిన గమ్యానికి చేరారు…
ప్రసాద్ ను ,వారి అమ్మ గారిని సాదరంగా ఆహ్వానించారు  పెళ్లి వారు.
కూర్చోవడం ఆలస్యం ప్రసాద్ అక్కడ పెట్టినా ఫలహారాలను తినసాగాడు.
” రేయ్ వెదవ కతికితే అతకదు రా…తినకు!
” అబ్బా నువ్వు ఊరుకో అమ్మ!! వాళ్ళు పెట్టింది మనం తినడానికే కదా…నువ్వు తిను ఈ లడ్డు ఎంత బాగా ఉందో ”
అమ్మాయి నీ తీసుకు వచ్చారు…
“రేయ్ ప్రసాద్ ! తినడం అపి అమ్మాయీ నీ చూడరా సమంత లాగ ఉంది రా ! ఓప్పుకోరా..
“అమ్మ అదేమీ పోలికే …. నువ్వు కదా రా update అవ్వమన్నవు…. మహా లక్ష్మి అంటే ఓల్డ్ వెర్షన్ అవుతుంది కదా…అందుకే లేటెస్ట్ గ ఇలా అన్న ..
నా కర్మమ్మ …నేను ఎదో సరదాగా అంటే నువ్వు సీరియస్గా  తీసుకున్న వ్వు….అని మనసులో అనుకున్నాడు ప్రసాదు…”
” బాబు మీరు,అమ్మాయితో ఏమి అయిన మాట్లాడి అంటే మాట్లాడవచ్చు…అని అమ్మాయీ నాన్న అనడం ఆలస్యం ప్రసాదు నిలబడ్డాడు…
”  చూడు లక్ష్మీ ..నువ్వు నాకు బాగా నచ్చావ్
నేను చాలా ప్రాక్టికల్ మనిషినీ..ఏదైనా సరే ఓపెన్ గా చెపుతాను
లాయర్ గా వర్క్ చేస్తున్న…బాగానే  సంపాదిస్తున్న సొంత ఇల్లు ఉంది.  నువ్వు జాబ్ చేయాలి అనుకుంటే చేయవచ్చు.కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి జాబ్స్ చేసుకో ఇద్దరం బిజీ గ ఉంటూ ఎప్పుడో ఒక్క సారి మనల్ని మనం చూసుకుంటూ ఉంటూ. వీకెండ్ కోసం ఎదురు చూడడం ఇలాంటివి నాకు నచ్చవు.మనకు అంటూ కొంచం  టైం ఉండాలి కదా…
ఇంకో ముఖ్యమైన విషయం . నేను తిండి విషయంలో చాలా పెర్ఫెక్ట్ గ ఉంటాను .నిజం చెప్పాలి అంటే నేను పుడ్డి నీ ”
ఇప్పుడు నా గురించి అన్నీ విషయాలు చెప్పాను…
నేను నచ్చాన…
లక్ష్మీ సిగ్గుపడుతూ చాలా బాగా నచ్చారు అని చెప్తుంది..
ప్రసాదు సంతోషపడుతూ అంతకి  “నీకు వండడం వచ్చా లేదా”
నాకు అన్నీ వంటలు మా అమ్మ నేర్పారు.మీరు ఆ విషయంలో మీకు ఏమి సందేహం అవసరం లేదు అండి ..
అయితే నేను పెళ్లికి సిద్దం అండి…
అలా పెళ్లి కాని ప్రసాదు కాస్త  పెళ్లి అయిన ప్రసాద్ అయ్యాడు అంటు ఫ్రెండ్స్ అంతా పెళ్లి పందిరిలో ప్రసాద్ ను ఆట పట్టించారు..
పెళ్లి అయిన  ఒక వారం రోజుల తరువాత తీర్థయాత్రలకు వెళ్లి వస్తాను అని ప్రసాద్ వాళ్ల అమ్మ వెళ్లిపోయారు…
నిజం చెప్పాలి అంటే లక్ష్మికి వంట ఏమి రాదు. అబ్బాయీ ఏమి అడిగిన వచ్చు అని చెప్పమని అమ్మ చెప్పడంతో అలాగే చెప్పింది.ఇప్పుడు తనకు కాఫీ పెట్టడం తప్ప ఇంక ఏమి రాదు. ఇన్నాళ్లు అత్తయ్యా ఉంది ఆమె అన్నీ చేసేవారు . పైగా కొత్త కోడలు అని ఏమి పని చేయనియలేదు.ఇప్పుడు అత్తయ్యా అలా వెళ్లిపోవడంతో ఏమి చేయాలో తనకు అర్థం కాలేదు…
ఇంతలో ప్రసాద్ కాఫీ అనే కేక వేశాడు.తను చేసి తీసుకువెళ్ళింది..ప్రసాద్ కి అర్జెంట్ పని పడడంతో కాఫీ తాగకుండా వెళ్ళిపోయాడు…
లక్ష్మీ  నేను ఫస్ట్ టైమ్ చేశాను.ఎలా ఉందో అని తాగుతుంది ..పాపం తన కాఫీ తనకే నచ్చదు…ఇంకా నయం ఆయన కి ఇవ్వలేదు…ఇచ్చి ఉంటే నా గతి అదో గతి అయ్యేది అని మనసులో అనుకుంటుంది
లక్ష్మి నువ్వు నాకు నచ్చావు మూవీ చూస్తూ ఉంటే
మధ్యాహ్నం ప్రసాద్ ఫోన్ చేసి.లక్ష్మి ఈ రోజు నా ఫ్రెండ్స్ కొంత మంది నీ ఇంటికి డిన్నర్ కి పిలిచాను.వండమని పెద్ద మెనూ చెప్పాడు…
ఏమి చేయాలి అన్న టెన్షన్ లో ఉన్న తనకి..వెంకీ  మూవీ రూపంలో  ఐడియా  వచ్చింది…
ముందుగ అని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నది..
అలాగే ఆ రోజుకి సక్సెస్ అయింది.తరువాత రోజు
” లక్ష్మి నాకు పూరి తినాలి అని ఉంది దానికి కాంబినేషన్ పనిర్ కర్రీ సూపర్ గా ఉంటుంది.. చేసి పెట్టావా ” అని అడిగాడు ప్రసాదు
లక్ష్మి ఆర్డర్ ఇవ్వాలి అనుకుంది.కానీ తన భర్త ఫస్ట్ టైమ్ తనని అడిగాడు అని..యూట్యూబ్ సాయంతో చేయాలి అని ప్లాన్ చేసి కిచెన్ లోకి వెళ్ళింది….
ప్రసాద్ రెఢీ అయి. టిఫిన్ కోసం హాల్లో కూర్చున్నాడు.  లక్ష్మి  అని ఎన్ని సార్లు పిలుస్తున్న తన నుంచి ఎటువంటి స్పందన లేకపోతే తనే వెళ్ళాడు…
అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు…
లక్ష్మీ గిన్నేతో పిండిలో తన చేయి ఇరుక్కుపోయి కుస్తీలో పడుతూ ఉంటుంది..
కిచెన్ అంతా చెత్త చెత్తగా ఉంటుంది..
” ఏమిటి లక్ష్మి ?ఏమిటిది ఇదంతా ? నీకు వంట చేయడం రాదా?
అవునండీ…మీ కోసం యూట్యూబ్ లో చూసి చేద్దాం అనుకుంటే ఇలా నా చేయి ఇర్రుకుపోయింది
అండి అని బాధగా చెపుతుంది..
ప్రసాద్ ఎలా అలాగో లక్ష్మి చేతిని విడిపించి… తనని తాను తిట్టుకున్నాడు ..
నీకు వంట రాదు అన్నావు గా .మరి  నిన్న ఎలా మేనేజ్ చేశావు..
అది హొటల్ నుండి తెచ్చి ఇచ్చాను అండి..
పాపం లక్ష్మి నీ తిట్టి ఆ రోజు నుంచి తనతో మాట్లాడం మానివేశాడు ప్రసాదు..
ఎక్కువ టైమ్ తన ఆఫీస్ రూం లోనే ఉంటూ హొటల్  భోజనం చేస్తూ లక్ష్మిని పూర్తిగా దూరం పెట్టాడు.
లక్ష్మీ కృంగిపోయింది .. ఏమి చేయాలో తనకి అర్ధం కాలేదు . కేవలం వంట రాదు అన్న కారణంతో తన భర్త తనని దూరం పెట్టడం భరించలేక పోయింది..
పట్టుదలతో కుకింగ్ క్లాసెస్ వెళ్లి మరీ నేర్చుకుంది…
ఒకరోజు ప్రసాద్ కి ఇష్టమైనవి చేసి క్యారియర్ తీసుకొని ఆఫీస్ కి వెళ్లి బుజ్జకించి తినిపించింది ..
తిన్న ప్రసాద్ అహ ఏమి రుచి లక్ష్మీ అని మెచ్చుకున్నాడు…ఆ రోజు నుంచి లక్ష్మి కష్టాలు మొదలు అయ్యాయి ..యూట్యూబ్ లో ఏమి కొత్త వంట చూసిన చేయమని చెప్పేవాడు.. ఇదంతా ఒక ఎత్తయితే  ఒక రోజు  నాతో పాటు రా అని లక్ష్మి చేస్తున్న పనిని ఆపి తన ఫ్రెండ్ వల్ల ఇంటికి వెళ్లి
లక్ష్మి చేతిలో  నోట్ పాడ్ పెట్టీ చెల్లాయి  నువ్వు నిన్న చేసిన పెసర లడ్డు నువ్వు ఎలా చేసావో కాస్త నా భార్యకి చెప్పవా??
మొదట లక్ష్మి షాక్ అయిన భర్త చెప్పాడు కాబట్టి లక్ష్మి నోట్ చేసుకుని ట్రై చేసింది .
పాపం ప్రసాద్ ఎక్కడికి వెళ్లి ఏమి తిన్నా సరే తనని తీసుకొని వెళ్లి మరీ నేర్చుకో అని చెప్పేవాడు…
ఎంత బాగా చేసిన తప్పు బట్టేవాడు
లక్ష్మి ఇంకా భరించలేక పోయింది.ఈ సారి ఎదో క్లైంట్స్ వాళ్ళ ఫంక్షన్ లో చేసిన చైనా గ్రాస్ చాలా బాగా ఉంది నాకు చేసి పెట్టావా అనడంతో
లక్మి స్వీట్ చేసింది యధావిధిగా .ఆయనకి బుద్ది వచ్చేలా చేయాలి అని భావించి స్వీట్ లో మోషన్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చింది.
పాపం ప్రసాద్ ఆ రోజు అంతా వెళ్ళడం రావడం పాపం చాలా అలసి పోయాడు.
లక్ష్మి లెమన్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది ..
తాగుతూ ఉంటే లక్ష్మి జీ తెలుగు ఛానెల్ పెట్టింది…
అందులో  సత్య నారాయణ గారు ఇలా చెప్పుతున్నారు..
” కంటికి నచ్చింది, లేదా రుచి బాగా ఉంది కదా అని ఏది పడితే అది తినకండి .మీ కడుపు ఏమి గ్రైండర్
అనుకుంటున్నారా! ఇలా తింటూ ఉంటే 70 ఏళ్లకు పోయేది కాస్త 50 ఏళ్లకే పోతారు..
ఏదైనా సరే లిమిట్ లో తినాలి …కంటికి కనిపించిన ప్రతిదీ కదా  తింటే మీరు ఇంకా వాష్ రూంలో ఉండి పోవచ్చు…”
ప్రసాద్ కి అది బాగా తగిలింది..ఇన్నాళ్లు ఇలా ఎలా తిన్న నేను తనని తాను తిట్టుకున్నాడు
ప్రసాద్ కి అసలు విషయం తెలీక  ఆ రోజు నుంచి అతిగా తినడం మానివేశాడు.ఎంత నచ్చినా సరే లిమిట్ గ తింటూ హెల్దీగా తయారు అయ్యాడు…
లక్ష్మి ఏమి చేసినా సరే ఇప్పుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. లక్ష్మి మొదట భర్తకి మోషన్స్ టాబ్లెట్స్ ఇచ్చినందుకు మొదట బాధ పడ్డ ఇప్పుడు తనలో మార్పును చూసి ఎంతో సంబరపడింది..
తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన ప్రసాద్ వాళ్ళ అమ్మ గారు కూడా ప్రసాద్ లో  మార్పు ను చూసి ఆశ్చర్య పోయింది…
ఒక రోజు లక్ష్మి అసలు విషయం చెప్పింది…
అత్తయ్యా గారు తిడుతారు ఏమో అనుకుంటే.ఆవిడ ఈ ఆలోచన నాకు ముందే వచ్చి ఉంటే బాగా ఉండు అమ్మ మీ పెళ్లి కాక ముందు నన్ను కూడా అందరి దగ్గరకి తీసుకొని వెళ్లి నేర్చుకో మని తల తిన్నేవడు పోని నీ వల్ల వాడు మారాడు అది చాలు…
ఎంతైనా నువ్వు గడుసు పిల్లవే అన్నీ హై ఫై ఇచ్చుకున్నారు ఒకరికి ఒకరు…..

You May Also Like

One thought on “ప్రసాద్ అభి ‘రుచి’

  1. Chala bagundi dhana ayina tinatam kosam bathikithe ilane vuntundi.lakshmi manchi pani chrsindi lekapothe papam kitchen lone vundedi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!