కార్తిక్ ఫైర్స్.. హ్యాపీ యానివర్సరీ

🌹కార్తిక్ ఫైర్స్✍️🔥❤️.. హ్యాపీ యానివర్సరీ 🌹

లక్ష్యం కోసం సాగే రాముడి వానర సైన్యంలా మేము..
ధర్మ యుద్ధంలో దిగిన పాండవులకు రథసారథి అయిన శ్రీకృష్ణుడులా సార్ మాకు…

– కార్తిక్ ఫైర్స్ కుటుంబం

****

కొన్ని పరిచయాలు, కొంత మంది మనుషులు.. మన జీవితంలో ఊహించని మార్పులకి కారణం అవుతూ ఉంటాయి. మనల్ని మనం బెస్ట్ గా మార్చుకోవడానికి కారణం అవుతాయి.
కథా రచయితగా సరదాగ మొదలైన నా ప్రయాణంలో అభిమానులుగా పరిచయం అయ్యి, నాకో కుటుంబంలాగా మారి మా అందరి అల్లరికి ప్రేమకి ఒక వేదికలాగా మారిన “కార్తిక్ ఫైర్స్ వాట్సప్ గ్రూప్” మొదలు పెట్టి ఈ రోజుకు ఒక సంవత్సరం.
ఒక చోట కలిసి ఉండక పోయినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే ప్రాంతాల్లో.. ఒక్కొక్కరం ఒక్కో చోట ఉన్న, అందరం కలిసినది లేకపోయినా, ఆట పాట, అల్లరి, కష్టం సుఖం, మంచి చెడూ అన్ని కలిసి పంచుకుని, ఒకరికి ఒకరు ఉన్నామని అండగా నిలబడుతూ… సాగిపోతున్న మా ప్రయాణంలో “తపస్వి మనోహరం” ఓ మజిలీ.
నా ఆలోచనను, నన్ను నమ్మి మనోహరం మొదలు పెట్టడానికి ప్రేరక శక్తులు… కలిసి కట్టుగా చేస్తే ఏదైన చేయవచ్చు అనే విషయంలో నాకు అండగా నిలబడ్డారు నా ఈ కార్తిక్ ఫైర్స్ గ్రూప్ సభ్యులు.
తపస్వి మనోహరం అనే సంస్థకి మూలం… ఈ కార్తిక్ ఫైర్స్ గ్రూప్. బహుశా ఒక రచయితకి ఇంతకు మించిన బహుమతి ఏమి ఉండదు అనుకుంటా, ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని.
ఇపుడు మనోహరం ద్వారా మా ఈ కుటుంబంలో భాగస్వాములు అయిన మీ అందరితో ఈ సంతోషం పంచుకోవడం మరింత సంతోషంగా ఉంది.
మా కార్తిక్ ఫైర్స్ మాత్రమే కాదు మనోహరంలో రచనలు చేసే ప్రతి ఒక్కరూ, మనోహరం వాట్సప్ గ్రూప్ లో మాతో పయనించే రచయితలు కూడా మా ఈ సంతోషంలో పాలు పంచుకుంటారు అని ఆశిస్తున్నాము.
“కార్తిక్ ఫైర్స్ వాట్సప్ గ్రూప్” కు ఏర్పడడంలో ముఖ్య కారకులై, నన్ను అల్లరి కన్నయ్యను చేసి ప్రేమను పంచే మా “యశోదమ్మ… దీపు” గారికి కృతజ్ఞతలు.🙏

✍️తపస్వి

******

కార్తీక్ ఫైర్స్ 🌟 ఆ పదం వింటేనే చాలు నేను మర్చిపోయిన చిన్నతనం గుర్తు వస్తుంది.

కార్తీక్ సార్ కి ముందుగా కృతజ్ఞతలు. సర్ కి చాలా ఋణపడి ఉన్నాను అని చెప్పాలి.
అక్షరం అనే స్నేహ బంధాన్ని నాకు పరిచయం చేసింది ఆయనే!!
ఇక ఈ గ్రూప్ లొ ఉన్న ప్రతి ఒక్కరు నాకు మంచి స్నేహితులు అయ్యారు.. పేరు పేరున స్పెషల్ థాంక్స్ అందరికీ😍

కౌంటర్స్ వేసిన, జోక్ చేసిన, సరదాగా కొట్టుకున్న అందరు చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు అది చాలా నచ్చిన విషయం మన గ్రూప్ లో.
మా అందరికి అతి పెద్ద సంతోషాన్ని ఇచ్చే విషయం మన “తపస్వి మనోహరం” మాగజైన్…
వాట్సాప్ గ్రూప్ నుండి ఒక సంస్థ ఏర్పడడం అనేది చాలా కొత్త విషయం కదా.

మన “తపస్వి మనోహరం” గొప్ప స్థాయికి వెళ్ళాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

మన ఈ గ్రూప్ కలకాలం ఇలాగే సంతోషంగా మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలి..

అనుబంధాల హరివిల్లు!!
ఆనందల విరిజల్లు!!
మన ఈ పొదరిల్లు!!
మనోహరంగా మెరవాలి
మన తపస్వి స్నేహజల్లు!!

✍️ దీపు ♥️

*****

అనుబంధం

వయసుల బేధం లేదు
వరుసలతో సంబంధం లేదు
వేరు వేరు ఊరు వాళ్ళం
వెరైటీగా కలసిన వాళ్ళం

ఉన్నంతలో హాయిగా వుంటాం
వింతగా చర్చిస్తూ వుంటాం
కవితలతో కవ్వించుకుంటాం
మధ్యలో రూటే మారుస్తుంటాం

మా అల్లరిని ఆపలేరు
మా అక్షరాలను ఆపలేరు
సందర్భంతో పనే లేదు
సమయం మాకు అసలే చాలదు

మా అలకలు ఎప్పటికి తీరవులే
ఈ కులుకులు ఎన్నటికీ ఆగవులే
ఆంక్షలు అసలే లేవులే
మా అక్షర దాహం ఎన్నటికీ తీరదులే

క్షమాపణలు అక్కడ లేవులే
కక్ష్యలకు అసలు చోటే లేదులే
కోపాలు కానరావులే
మా కవ్వింతలు ఎన్నడూ ఆగవులే

లిపి సాక్షిగా మొదలైనదిలే
కార్తికేయుని స్నేహజ్వాల మాదిలే
అవినాషుని.. గంగా ప్రవాహంలా
అనుబంధాల స్వప్నమై సాగుతుందిలా

🌹కార్తిక్ ఫైర్స్.. హ్యాపీ యానివర్సరీ 🌹

✍️ స్వప్న

******

🌹కార్తీక కుసుమాలు🌹

రంగు రంగుల పువ్వులం మనం
సువాసనలిచ్చే కుసుమాలం మనం
ఒకే కొమ్మకు పూసిన వన్నెల జాతులం
కొమ్మకో కొమ్మకో రంగునిచ్చే పరిమళ ఖ్యాతులం

భరించే కొమ్మ కార్తీకం
మనమంతా వాడని వసంతం
పూటకో కవనంతో
రోజుకో కధనంతో

ప్రేమ పారిజాతాలు మన బృందమే
స్నేహ సౌరభాలు మన బృందమే
అలకల అల్లికలు మన బృందమే
చిలిపి చేమంతులు మన బృందమే

చిట్టి గులాబీల గోలలతో
లేత లిల్లిపూలలా లీలలతో
కొలనులోనే కొలువున్న కమలాలతో
సుకుమారాల కనకాంబరాలతో
గుభాలించు తీగ జాజుల మాటలతో
మౌనంగా ఉండే మల్లియలతో
అపుడపుడు పూసే పున్నాగాలతో
మెత్తని ముల్లై తాకే మొగలిరెకులతో
వీ(వా)డిపోని ఎన్నో వసంతాల పూల వనాలమే
మనం అక్షరాలు కలిపిన ఆత్మీయులం
పదాల ప్రయాణంలో గమ్యాలం
సాహిత్య సంద్రంలో సరాగాల అలలం
రాజిల్లు రచయితల నీడన ఎదుగుతున్న కవన పువ్వులం
అనుభావాల చెంతన చేరిన అనుబంధాలం

ప్రేమ రాతలే రాయగలం
సరదా పలుకులు పలుకగలం
కలంతో ప్రశ్నించగలం
కవితలతో కరిగించగలం
మాటలతో మనసుని తడిచేయగలం
ఎదో సరదాగా అంటూ బంధాన్ని బలపరచగలం
మనసు తుళ్లి పడే తుంటరితనం చూపగలం
ఆలోచింప చేసే అక్షరాలను పేర్చగలం

ఎన్ని చేసినా మనం
ఒక చిలిపి అల్లరితనం
గుంభనంగా ఉండే పెద్దరికం
భాధ్యతలు మనకు ఇల్లరికం
అందరికి మనం కార్తీక జ్వాలలం

🌹అక్షర తపస్వికి కృతజ్ఞతలు 🌹

ఆత్మీయ స్నేహానికి అభినందనలతో
కలతలని దూరంచేసే కార్తీక కలానికి
చిరునవ్వు పూయించే  మాటల మనసుకి
మదిని భావాలను చదివే బాల నయనుడికి
కోండంత అభిమానాన్ని కొసరి కొసరి పంచి
మా అందరి ఆదరణకు నిలువెత్తు
మంచితనానికి
చిరునవ్వుతో చంద్రునికి గుబులు పుట్టిస్తూ
మా అందరి అల్లరిని ఆనందగా భరిస్తూ
మా వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించే
మది మిత్రునికి మనస్పూర్తిగా ధన్యవాదాలు

   ✍️  గాయత్రి 💐

*****

వేరు వేరు దూరాలే చూడడానికి
అందరి పయనం ఒకే తీరం వైపే
అనుకోని పరిచయాలే ఆందరివి
అందరి మనసులు ఒక ప్రేమ వైపే

ఒక వృక్షం కింద సేదతీరే పక్షులం
ఏ దారులు వేరుగా ఉన్న
ముడి వేసుకున్న బంధాలు
స్నేహాలతో ఆనందానికి
ప్రతీకగా నిలిచిన నేస్తాలము..

ఒకరి అడుగులో అడుగులువేస్తూ
పదిమందికి దారుచూపే
చల్లని మనసుకు దగ్గరగా ఉన్న
లిపి కలిపిన
కార్తికేయ సమూహాలము..

ఏ అరమరికలు లేకుండా
నిండుమనుసుతో ఆనందంగా
ఒకరు ఇంకొకరిని ప్రోత్సాహించుకుంటూ
ఇంకా కొత్తగా మలుచుకుంటూ
సాగిపోయే అన్నయ్య కలిపిన అక్కచెల్లెళ్లము..

ఎంతో ఓపికతో ఎంతో బాధ్యతగా
మము ముందుకు నడిపిస్తూ
ఏ చిన్న కష్టం వచ్చినా గుర్తొచ్చే
మొదటి వ్యక్తిగా మారిన కార్తీక్అన్నయ్య
చల్లని పలకరింపుని ఏ చెల్లి కోరుకోదు చెప్పండి..

మన అనుబంధం ఎప్పటికీ
ఇలాగే కొనసాగలని కోరుకుంటూ
Happy anniversary karthik fires

✍️జో

*****

🌹మరువలేని స్నేహబంధమా🌹

కార్తికాన చివురించిన లేత చిగురులం
అనుకోని మలుపు తిప్పిన జీవన గమనం
ప్రేమ బంధం కన్నా మిన్నగా,
రక్త బంధం కన్నా గొప్పగా..
ఎదిగిన మన స్నేహం..

మనుషులుగా దూరం ఉన్నా…
ఆత్మీయ పలకరింపులతో
ప్రతి నిముషం మనసుకు దగ్గరగా..
బ్రతుకుపయనంలో ఈ పరిచయాలు
ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలినా..

మన స్నేహంలో చిలిపి తగాదాలకు చోటున్నా..
మనసు నొచ్చుకునే గొడవలు అసలే లేవుగా..
ఆత్మీయ సమూహంలో మన చేరిక
దీపపు వెలుగులు చిమ్ముతో ఆదర్శప్రాయంగా మారిందని గర్వంగా నిలిచాం సాహితి లోకాన..

జీవన మలుపులో మన స్నేహ పరిమళాలు మనోహరంగా సాగుతూ
మానసికోల్లాసానికి తరగని సంపదేగా..!!

🌹కార్తిక్ ఫైర్స్.. హ్యాపీ యానివర్సరీ 🌹

✍️విజయ మలవతు

******

ఇది నిజంగా నేనేనా…
ఏదో అనుమానం….
నాలో అల్లరి, నాలో తుంటరి, నాలో మాటకారి…
ఇది నిజంగా నేనేనా…

నన్ను నాకు సరికొత్తగా పరిచయం చేసిన,
గురువువి, నేస్తానివి, సోదరునివి అన్నీ నువ్వే…
మరువలేని స్నేహం నీవల్లే…
ఎల్లలు లేని పరిచయాలు నీవల్లే…

కొండంత సంతోషాలు పరిచయం అయ్యాయి నీవల్లే…
చిలిపి తగాదాల పరిచయం నీవల్లే…
నిద్రాణమైన కళను మేల్కొలిపింది నీవే…
నేడు నాకంటూ గుర్తింపు వచ్చింది నీవల్లే…

బాధలో బంధమై నిలిచావు,
సంతోషంలో స్నేహానివై తొడున్నావు,
వెనుకంజ వేసిన వేళ వెన్నుతట్టే గురువు వు అయ్యావు,
మొత్తానికి నన్ను మరో కొత్త మనిషిని చేసావు,

ఇన్ని సంతోషాలకు కారణమైన నిన్ను చాలా ఆలస్యంగా పరిచయం చేసాడు దేవుడు,
మరోజన్మంటూ ఉంటే స్నేహ బంధమే కాదు,
రక్త సంబంధమై కలకాలం తోడు ఉండాలనుకుంటున్నాను.

✍️ G. V. లక్ష్మి

*****

మనసుని తట్టి పిలిచే చిలిపితనాన్ని
బంధాల బలన్ని తెలియచేసే భావోద్వేగాలని
హృదాయానికి హత్తుకునే ప్రేమ పదాలని
విలువలని పంచే భావాలని
ఆలోచింపచేసే సామాజిక పోకడని
ఆనందాన్ని పెంచే సరదాలని
చిరునవ్వులను పూయించే
హాస్యకుసుమాన్ని మాకు
పంచుతూ.. ఆహ్లాదాన్ని పంచెే..
మా అక్షర మహర్షి.. వృక్ష నీడన
హాయిగా వెలుగుతున్న అక్షర దీపాలం..✍️

శుభోదయం  మొదలు  శుభరాత్రి వరకు
మనం చేసిన చిలిపి అల్లరి తలచుకుంటే
పెదవులపై చిరునవ్వు  పూస్తుంది!!!

పేలని మాటల తూటాలు మన సొంతం
నవ్వుల నిధులన్ని మన సొంతం
తెలుసుకోవాలనే తపన మన సొంతం
తెలిసింది తెలియచేయాలనే ఆత్రం మన సొంతం
ఎంత  చెప్పిన ఎన్ని చేసినా మనమందరం
అందమైన  మనసున్న తోకలేని కోతులం(సరదాగానే)

పురాణాల నుండి  వస్తున్న  ఒక సామేతను  మనందరం కలిసి అబద్దం చేసాము…
ఎంటో తెలుసా
“ముప్పై మంది  మగవాళ్లు కలిస్తే  ఒక దగ్గర ఉండగలరు కాని
మూడు కొప్పులు కలిస్తే మాత్రం కాసేపు కూడా నిలకడగా ఉండలేరు”అని
కాని మా “కార్తిక్ ఫైర్స్”
ఇందరం ఆడజాతి ఆణిముత్యాలం కలిసి సంవత్సరం కాలన్ని అలవోకగా దాటేసాము….కదా

కార్తీక్ ఫైర్స్ కుటుంబ సభ్యులకు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐

✍️సరస్వతి నిత్య

******

కన్నీళ్లు వస్తే
ఫ్రెండ్స్ తోడు..
అసలు కన్నీళ్లే రాకుండా
ఫైర్స్ గ్రూప్ చేదోడు.. వాదొడు

✍️కొఠారు నాగ సాయి అనూష

******

బంధమై అల్లుకున్న అనుబంధాలు..
స్నేహం అనే పొదరింట్లో ఒక్కటై.!!
కన్నీళ్లు తుడిచే నేస్తాలై,
సంతోషాలు నింపే సఖులై..!!
కార్తీక వెన్నెలను తీసుకువచ్చే చిరు దీపాలై.!!
ఆత్మీయతలో తల్లిదండ్రులై..!!
ఓదార్పులో తోబుట్టువులై.!!
ధైర్యాన్ని ఇవ్వడంలో స్నేహితులై.!!
తోడు నీడలో ఆకాశమై.!
ఒడి చేర్చుకోవడంలో అవనిజలై.!!
ప్రేమను పంచుతూ,అల్లరి చేస్తూ..
బంధమై అల్లుకుపోతే.!!
రక్తసంబంధమే కావాలా.!!
మణులు,మాణిక్యాలే కావాలా.!!
ముత్యమంటి చిరునవ్వులు పంచే.
సాహిత్య మధురిమలతో..
వెలుగులను పంచే..
మనోహరంగా మనస్సును గెలిచే..
తపస్విసేన సరిపోతుంది కదా.!!

✍️లంక జయ కుమారి

*****

ఊహలకందని కొత్త ప్రేమ మనది
ప్రేమను మించిన ఆప్యాయత మనది
ఆప్యాయతకు అర్ధం చెప్పే స్నేహం మనది
స్నేహాన్ని మించిన బంధం మనది
బంధంలోని ఆనందం తెలిపిన సమూహం మనది
సమూహంగా మారి ప్రాయాలను మరచి అల్లుకుపోయిన కుటుంబం మనది
ఆనందాల ఆవాసం, సంతోషాల నిధి
కార్తీక్ ఫైర్స్ (నా) కుటుంబానికి
మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

✍️ శాంతి కృష్ణ

******

అక్షర మహర్షి అక్షరాలు అండగా
కార్తిక్ ఫైర్స్ గ్రూప్ వారి తోడుగా
ఎవరికి ఎవరూ ఏమీ కాకపోయినా
అందరూ అయిన వాళ్లే ఇక్కడ..!!

సంతోషాన్ని రెట్టింపు చేసే మనుషులు
బాధని పంచుకొని కరిగించే మనసులు
అల్లరి చేస్తూ, ఆనందాన్ని పంచుతూ
కర్తవ్యాన్ని బోధపరిచే బాధ్యతాయుతులు..!!

ఏ బంధాన్ని వెతికినా దొరుకును
మా కార్తిక్ వారి అందాల పొదరిల్లులో..
అంతా అయిన వారే..
అన్ని బంధాలు మనవే అయినప్పుడు
బాధకి, కన్నీళ్లకు తావేది ఇక్కడ..!!

అక్షరాల వేటలో దొరికిన అందమైన బంధాలు
మనసుని అను నిత్యం వెంటాడే మధుర భావాలు
కార్తికుడి అక్షరాలు చదవడానికి తోడుగా
నిలిచిన చిరుదివ్వె మా దీపమ్మా అండగా
మా కార్తిక్ ఫైర్స్ కుటుంబం
మెలగాలి సంతోషంగా కలకాలం…!!

✍️హసీనా

******

అక్షరాలు అనే బృందావనంలో
అక్షర మహర్షి ఆధ్వర్యంలో
అల్లుకున్న పదాల తీగలం
పద అల్లిక తెలియని పువ్వులం
సాహిత్య మధురిమ ఆలయంలో
అందమైన పదమాలగా మము మలిచిన
తపస్వి మా ఆచార్యుడు.. కార్తికేయుడు

మహిళలకు చేయూతను ఇస్తూ
వారిలోని కళను,ఆశయల్ని వెలికి తీస్తూ
మా భావాక్షరాలను సరిచేస్తూ
యువ రచయితలను ప్రోత్సహిస్తూ
అన్ని వేళలా మమ్మల్ని నడిపిస్తున్న కార్తికేయడు

మదిలో దాగి ఉన్న  భావాలన్ని
అక్షరాల రూపంగా మారిన
మా రచనలే నిదర్శనం.

కార్తిక్ ఫైర్స్.. ఇది
రచయితలను ముందుకు
నడిపించే రహదారి ఇది

గ్రూపులు అంటే పలకరింపుల
సందేశాలను పంపించుకోవడమే కాదు…
ఇతర గ్రూపులకి ఆదర్శంగా నిలిచి
తపస్వి మనోహరం అనే
అంతర్జాల వార్తాపత్రికను స్థాపించి
ఎందరో రచయితలను ప్రోత్సహిస్తూ
ముందుకు సాగుతుంది.

ఇది మా కార్తిక్ ఫైర్స్ కుటుంబం..
ప్రాంతాలు వేరైనా, భాష ఏదైనా..
మా స్నేహం, ఆత్మీయత ఎప్పటికీ మారదు

వెలుగుతున్న చిరుదివ్వెలం మేం
అక్షరాలు ఉన్నంతకాలం
కళ కళలాడుతుంది మా అక్షర బంధం.

✍️ధనలక్ష్మి

******

మనకు జన్మనిచ్చి సరికొత్త జీవితాన్ని ఇచ్చేది తల్లిదండ్రులు అయితే ఆ జీవితంలో సుఖదుఃఖాలలో తోడుగా నిలుస్తూ నిలిచేది స్నేహితులు. ఆ ఆత్మీయ బంధంతో అను నిత్యం నా వెంట ఉండే మా “కార్తీక్ ఫైర్స్” కి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐💐

✍️హిమబిందు(మీ మైక్)

*****

కార్తిక్ ఫైర్స్ వాట్సప్ కుటుంబంలో మేము భాగస్వామ్యులు అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
కార్తీక్ ఫైర్స్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా
మా కుటుంబ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు…. 🎉🎊🎂💐

✍️ ప్రశాంతి,సంగీత,లలిత జ్యోతి, లలిత దేవి, ప్రమీలా రాణి,అన్నపూర్ణ,ధరణి.

 

 

You May Also Like

25 thoughts on “కార్తిక్ ఫైర్స్.. హ్యాపీ యానివర్సరీ

  1. Happy anniversary to our Karthik fires group.ee group lo join ayyi entho mandhi freinds ni pondhamu alane sir ee vushayam ayina oka family laga entho baga respond ayyi chala baga ardham ayye laga cheptaru.very happy to be a part of this group elanti enno anniversaries jarupukovalani korukuntunnanu

  2. 🎈🎈Happy anniversary to Karthik fires…💐💐💐

  3. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ “మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కార్తీక్ ఫైర్స్” 🎊🎉💐🎂🍫❤️❤️❤️❤️❤️

  4. Wish you a happy anniversary karthik sir 🎉🎊🎉🎉👏👏👏 karthik fire s and team members

  5. విజయం ముందుకు వేసే అడుగులో అడుగై వరిస్తుంది … Happy Anniversary Team తపస్వి మనోహరం

  6. వార్షికోత్సవ శుభాకాంక్షలు కార్తిక్ ఫైర్స్…..💐💐💐💐💐💐💐💐

  7. చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర ) says:

    కార్తీక్ ఫైర్స్ ఫ్యామిలీ కి వార్షికోత్సవ శుభాకాంక్షలు…

  8. ప్రియమైన మా కార్తీక్ పైర్స్ కుటుంబ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు💐💐💐💐💐💖💖💖💖🌹🌹🌹🌹🌹🌹

  9. Manam antha kalisi adugulu veyadam modalupetti appude one year ayinda ane ascharyamlone unna inka nenu… ee aluperagani sneha prayanam ilage konasagalani manahspoorthiga korukuntunnaa…. Happy anniversary friends….💐💐💐🤝🤝🤝🤝🤝

  10. Happy Anniversary 🎉🎉 to Karthik Fires Group

  11. వార్షికోత్సవ శుభాకాంక్షలు కార్తిక్ ఫైర్స్ …🎂🍫🍰💐

    1. స్నేహబంధం అనేది వయసుకుగాని ప్రాంతానికి గాని
      లెక్కలు వేసి సరిచూసుకొని చేసేది కాదు అని మా కార్తీక్ ఫైర్స్ సమూహం నిరూపించింది…
      అమ్మ అనుబంధం తరువాత స్నేహ సంబంధం చాలా గొప్పది, దానికి అక్షరబంధం తోడు అయ్యి ఒకే దారంతో కట్టిన వీరజాజుల దండవలే సువాసనలు వెదజల్లుతు
      కలిసికట్టుగా ఉన్నాము.. ఇలాంటి వార్షికోత్సవలు మరెన్నో జరుపుకోవాలని సమూహం అంటే ఇలా ఉండాలి అనుకొనేలా ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మా కార్తీక్ ఫైర్స్ గ్రూప్ కి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌹

  12. గ్రూపుల అందు మా కార్తిక్ ఫైర్స్ గ్రూప్ వేరయ్యా…కొత్త శకానికి మా గ్రూప్ నాంది…
    ఇలాంటి ఎన్నో యానివర్సరీ జరుపుకోవాలని కోరుకుంటున్నా…
    నేను కూడా కార్తికేయుని అక్షర పూదోటలో భాగమైనందుకు ఆనంద పడుతున్నాను…హ్యాపీ హ్యాపీ యానివర్సరీ మై డియర్ ఫ్యామిలీ మేమంబర్స్🍫💐🥳🎉🎂

  13. కార్తీక్ ఫైర్స్ కుటుంబ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు 🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!