కాటి కాపరి!

కాటి కాపరి!

రచయిత :: రాజ్

ప్రాణ వాయుువు లేక..
ప్రాణాలను వాయువుల్లో కలిపేసినావా!
ఆక్సిజన్ అందక…
ఆయువును తీర్చేసుకున్నావా!

ఓ మందభాగ్య..
నీవెవరివో!
కోట్లకు కోట్లను కలిపే.. కోటీశ్వరుడివా!
లాభాలకు లాభాలను కలిపే..
లక్షాధికారి వా!
మదుపు లేక నలిగిపోయే..
మధ్యతరగతి..మందభాగ్యుడి వా
లేక!
పేదరికానికి పేటెంట్ కలిగిన…
దౌర్భాగ్యుడివా!

నీవేవరివైనను నాకేమీ!
నా కాటికి వచ్చిన నీవు..
ఈ కట్టెలను హత్తుకోవల్సిందే!
ఆహా!
ఈ దినమేమి నా భాగ్యము!
కుప్పలు కుప్పలుగా..కళేబరాలు
నాకు కప్పం గట్టేందుకు ఎగబడుచున్నవి!

ఏమి ఈ విచిత్రం!
ఈ దినంబొచ్చిన మృత జీవులందరూ
అనాధ ప్రేతముల.. లేక..
బంధువులెవ్వరూ లేరా?రారా?
అయినను..
చచ్చెడి వారితో వచ్చెడిదెవ్వరు?
కనీసం కాటికి సాగనంపనెవ్వరూ..లేరే!
ఎంతటి దౌర్భాగ్యమీ నిర్జీవులిది?

ఓ మృత జీవులారా!
కట్టెలన్నింటినీ హోమమునందేసినట్లు..
మిమ్ములందర్నీ..
ఒకే కట్టెల హోమమునందుంచి కాల్చెదను
నా కార్యమూ సులవుగును..
కట్టెల ఖర్చు…తరుగును!

ఓ నిర్భాగ్య.. నిర్జీవులారా!
వేడికి వైరస్ నశించిపోతుందని
తలంచి…
నిత్యం రగిలే రుద్రభూమికి యేతెంచినావా! ఏమి?

ఓ మందభాగ్య మృతజీవులారా!
కలెక్షన్లు ఎలక్షన్లు సెలక్షన్లు..
మేళాలు తాళాలు కుంభమేళాలు..
అంటూ..
మనల్ని నిలువునా ముంచేసే..
ప్రభుత్వాలను నమ్ముకుంటే..
మీరంతా..
కుప్పలు తెప్పలుగా..
ఇలా… కాటిలో కలవాల్సిందే!

ఓ బతుకు జీవుడా…
నీ బతుకుని…
నువ్వే బతికించుకోవాలి!

You May Also Like

One thought on “కాటి కాపరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!