కరోనా కాటు

కరోనా కాటు

రచయిత:: Dr. J. చలం

ఓ మిత్రమా నా ప్రియమిత్రమా!
ఎందుకంత హడావిడిగా వెళ్లి పోయావు?
పాతికేళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచుకుని,
కరోనా కాటుకు బలై వెళ్ళిపోయావా?

ఆటలు, పాటలు, అల్లరి అన్నింటిలో తోడున్నావు
ఒకే కంచం ఒకే మంచం అన్నట్లున్నాము
ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని అనుభూతులు
ఇక అవన్నీ ఎవరితో పంచుకోవాలి?

నూనుగు మీసాల ప్రాయంలో కలిశాము.
కాలేజ్ చదువులు పూర్తి చేశాము.
జీవితంలో కుదురుగా స్థిరపడ్డాము
కానీ బాధ్యతలు తీరకుండానే కనుమరుగయ్యావు..

ప్రపంచాన్ని కాకా వికలం చేస్తున్న మహమ్మారి
నీ భీకర కోరలకు ఇంకెంతమంది కావాలి బలి..
బరువు, బాధ్యతలున్న మనుష్యులనే మాయం చేస్తావా?
ఇక ఆ అనాథ కుటుంబాలకు దిక్కెవ్వరు ?

విధి ఆడిన వికృత నాటకంలో సమిధలా,
బలైపోయిన ప్రియ స్నేహితుడా !
నిన్నెన్నటికి మరువను గాక మరువలేను.
నీ జ్ఞాపకాల దొంతరలో నా శేషజీవితం..

You May Also Like

5 thoughts on “కరోనా కాటు

  1. చిన్ననాటి స్నేహాన్ని ఆ నాటి తీపిగురుతులను మరవటం
    జరుగదు…మనిషి శాశ్వతంగా దూరమైనా జ్ఞాపకాలు ఎప్పటికి మన తోడేగా…heart melting lines sir….👌🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!