గజల్ లాహిరి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చయనం అరుణాశర్మ
పుస్తకాల మధ్యలోన మునిగిపోయె జీవితమే
మస్తకాన్ని తొలిచేస్తూ విసిగిపోయె జీవితమే
టెక్నాలజి పెరిగిపోయి శాంతిలేదు బతుకంతా
నెట్టింట్లో బందీలై మిగిలిపోయె జీవితమే
చరవాణితొ సంబంధమె విస్తరించె జగమంతా
ఆన్లైను ఉద్యోగమె అలసిపోయె జీవితమె
గూగులమ్మ తెలిపేనులె విశదముగా విషయములే
ఆలోచన తోచదాయె కరిగిపోయె జీవితమే
కళ్ళకేమొ కళ్ళజోడు తప్పదులే ఓ అరుణా
బావిలోన కప్పలాగ కుమిలిపోయె జీవితమే