గులాబీ

గులాబీ

రచన:: యం. సుశీల రమేష్


నిన్ను చూసిన నా గుప్పెడంత గుండె
ధక్ ధక్ అంటుంది !

నిన్ను చూసిన నా యవ్వనం ఉరకలు వేస్తుంది !

నిన్ను చూసిన నా పరువం పొంగి పొర్లుతుంది.

నిన్ను చూసిన మరుక్షణం నా మనసు మనసులో లేదు!

నిన్ను చూసిన చూపుతో మరి దేనిని చూడాలనిపించలేదు !

నిన్ను చూసిన నా పెదవి నిన్ను ముద్దాడాలని అంటుంది.

నిన్ను చూసిన నా తనువు నిన్ను
హత్తుకోమంటుంది !

నిన్ను చూసిన నా బాహువు నిన్ను
కౌగిలించుకోమంటుంది !

నిన్ను చూసిన నా పాలబుగ్గ నీ
రంగు సంతరించుకుంటుంది !

నిన్ను చూసిన నా మనసు నిన్ను తాకాలని ఉవ్వీళ్ళూరుతుంది !

నిన్ను చూసిన నా ఆశ అనుక్షణం నీతో ఉండాలంటుంది.

నిన్ను చూసిన నా కంటి చూపు నాతో రానంటుంది.

ఓహో గులాబీ బాల ఏమి నీ అందము, వర్ణింప శక్యమా !

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!