గడచిన జ్ఞాపకాలు

గడచిన జ్ఞాపకాలు

యం.ఉసేందర్

మకర రాశిలోకి
భానుడి ప్రయాణం
తెలుగు లోగిల్లలో
సంక్రాంతి సంబరం
భోగిమంటలతో వేకువ జామున లేచిరి వనజాక్షులు
కలాపి చెల్లి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి,
ముస్తాబయ్యిరి ముద్దబంతులు
హరిదాసు కీర్తనలతో
హోరెత్తె వాడ వాడ
గంగిరెద్దు ఆటలతో
గడబిడలాడే గల్లులంత
గాలిపటాలతో
పతంగుల గంతులాట
కోలాటాలతో
యువకుల సందడంట
ఇల్లంతా శోభామయము
ఊరంతా ఉత్సవమయము
పిండి వంటలతో, పిల్లలతో,
బావ మరదళ్లతో, అల్లుళ్ళతో, అలంకరించుకొని వచ్చె
తెలుగువారి పుణ్యాలపంట సంక్రాంతి పండుగ
ధాన్యపు రాశులతో రైతులు
కోడిపందాలతో కొందరు
ఎడ్లబండ్లలో గోవింద నామస్మరణతో ఊరేగుతుంటే
గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటే…..
వచ్చేనమ్మా సంక్రాంతి పండుగ
ప్రతి ఇంటిలో ఉత్సాహాన్ని నింప

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!