విరహోత్ఖంఠిత
రచయిత :: ప్రసాదరావు రామాయణం
గుబురు మీసాల వాడ
గంపెడు మనసున్న వాడ
జోడెద్దుల కోడేగాడా
జోరైన పురుసుడా
సందేల కొత్తనంటివి
సగం రేతిరి జారిపాయే
మాట తప్పితివిరా మామ
మణుసంతా ఇది ఇదిగా ఉంది
సందమావకు కూసింతైనా ఇది లేదు
మావ లేడని మిడిసి మిడిసి పడతుండు
మల్లెపూలగాలి మరీ మరీ సంపతుంది
కోకిలమ్మ కూతకు కోక నిలవడం లేదు
ముద్ద దిగలేదు నీ ముద్దు కావాలంట
శాతీ మీన బంతులు శాన బిగిసి
పోతుండాయి
రైక సుంత కుట్లూడి పోయేను
చల్ల లాంటి నీ సల్లని సేతికై ఎదురు
సూత్తూన్డాయి
ఒళ్లంతా సలపరమయ్యేను
దూలతీర్చ రారా దూలగుండి మోహమోడా!
చాలా బాగుందండి
బాగుందండి..👌👌