మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
పచ్చని చెట్లు -ప్రగతికి మెట్లు(అంశం:: మొక్కలు నాటు సంరక్షించు)

రచయిత :: మోదేపల్లి. శీనమ్మ

అందరూ నాటాలి మొక్కలను
ఆహ్లాదకరమైన వాతావరణం తేవాలి
ఇంటింటా పెంచుదాం మొక్కలను
చూడచక్కని తెలుగు సున్నితంబు

పర్యావరణ పచ్చదనంతో సంతోషాలు
భవిష్యత్తరాలకు నిండైన ఆరోగ్యాలు
నీడనిచ్చు తరువులు నరకొద్దు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఇకనైనా తగ్గాలి వైపరిత్యాలు
స్వచ్ఛమైన గాలికి కారణమవుదాం
జీవరాశులకు మేలు కలిగిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

పసిడి కాంతుల పచ్చదనం
ప్రకృతమ్మ ఒడికి నిండుదనం
పుడమి తల్లికి చల్లదనం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రాణ వాయువునిచ్చేవి తరువులు
పండ్లను పూలను అందించును
చెట్లే ప్రగతికి మెట్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!