మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: బొల్లాప్రగడ ఉదయ భాను

చిన్ని మొక్క నాటి
నీరు పోయుచుండ చిగురించు
మొక్క చూడ సంతసమ్ము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పెరిగి పెద్దదై పుష్పించి
ఫలియించి నీడ నిచ్చు
తరువు బిడ్డ వోలె
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పరుల కొరకే చెట్లు
ఫలములిచ్చు, ప్రాణవాయువుని ఇచ్చు
రాళ్ళు రువ్వినా పండ్లనిచ్చు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

జీవజాతులకు ఆధారము తరువులు
ఆదివాసి తెగల కాటపట్టు
తండాలకు జీవితమైనట్టి వనములు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

. పుడమితల్లికి పచ్చదనం అద్దేను
సకాల వర్షములకు కారణమాయేను
పర్యావరణమును పరి రక్షించేను
చూడ చక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!