ప్రక్రియ :: సున్నితం
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు
రచయిత :: యం.తారాసింగ్
ఊరు::దారారం (అచ్చంపేట)
మొక్కలు నాటడం మరువకు
వాటిని రక్షించడం మరువకు
మొక్కలు మానవుల ప్రాణదాతలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు..!!
మొక్కలను పెంచాలి మనం
అవిపెరిగి కావాలి వనం
మొక్కలను కాపాడాలి జనం
చూడ చక్కని తెలుగు సున్నితంబు..!!
పుట్టినరోజున మొక్కలు నాటాలి
పుడమిపై ప్రకృతిని కాపాడుకోవాలి
పచ్చని ప్రకృతిని పరిరక్షించుకోవాలి
చూడ చక్కని తెలుగు సున్నితంబు..!!
నాటిన మొక్కలు వృక్షాలవ్వును
వృక్షములై భావితరాలకు ఫలాలనిచ్చును
ప్రాణవాయువు నిచ్చి కాపాడును
చూడ చక్కని తెలుగు సున్నితంబు..!!
.మొక్కలే ప్రకృతి ప్రాణధారలు
మొక్కలే కురిపించు నీటిధారలు
మొక్కలే ఆహారపు అన్నదాతలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు..!!