శ్రీ శ్రీ కవితా శైలి

శ్రీ శ్రీ కవితా శైలి

రచన :: పిల్లి.హజరత్తయ్య

కాన రాకే కదిలించగల శక్తి కలది…
సముద్రమంత ఆవేశం గలది…
కదిలించే కవిత్వమై వినపడి విస్తరిస్తుంది…
యుద్ధ సంగీతమై నిప్పులు కక్కుతుంది…
లావాలా ఎగిసిపడే చైతన్యమది…
నెత్తురు మండే శక్తులకు నూతనోత్తేజాన్నిస్తుంది…
ప్రజల నవనాడుల్లోకి పాకింది.
అభ్యుదయ సాహిత్యానికి కంచు కాగడాలా కాంతిని విరజిమ్మింది…
ప్రజా ఉద్యమాలకు ఊపిరి, ఉత్సాహాన్నిచ్చింది…
ఎందరో ప్రజాకవులను సృష్టించింది…
కాలాన్ని కదిలించి జాతిని ముందుకు నడిపిస్తుంది…
ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టిస్తుంది…
శ్రమైక జీవన సౌందర్యాన్ని శ్లాఘిస్తుంది…
శ్రామికులందరినీ ఏకంచేసి నడిపిస్తుంది…
పీడించే సాంఘిక ధర్మంపై సమరశంఖం పూరిస్తుంది…
కొత్త కథా వస్తువులను ఎంచుకోవాలని సూచిస్తుంది..
మా’నవ’ విజయాన్ని కాంక్షిస్తుంది…
కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి శాసిస్తుంది…
ఎన్నేళ్లయినా శ్రీశ్రీ కవితా చైతన్యము పలవరిస్తూనే ఉంది…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!