కలాలను ఝుళిపించాలి

కలాలను ఝుళిపించాలి

రచన :: పిల్లి.హజరత్తయ్య

సమాజాన్ని నిద్ర లేపేది హితం
నిజాలు నిప్పులై విరజిల్లేది సాహిత్యం
అర్థం కాని సాహిత్యం వ్యర్థం
సమాజ హితమే దాని పరమార్థం
సమ భావనే ధ్యేయము…

ఆక్షీకరణలో సృజనాత్మక
కవిత్వంలో మానవత
భావంలో నిగూఢత
శైలిలో వైవిధ్యత
సామాజిక అభివృద్ధియే లక్ష్యం…

సాహిత్యం ఒక వేదన
సాహిత్యం ఒక పరిశీలన
అది ఒక అన్వేషణ
సాహిత్యానికి సమాజం
సమాజానికి సాహిత్యం అన్నట్టు సాగాలి…

నేటి సమాజానికి తగ్గట్టు ఉండాలి
గతాన్ని తోడాలి
భవిష్యత్తును ఊహించాలి
పాఠకున్ని ఆలోచింప జేయాలి
మనసు చలించి విస్ఫోటనం చెందాలి…

ప్రజలను చైతన్యపరిచి
మనసును రంజింపజేసి
సంస్కారాన్ని పెంచి
మంచిని నిర్దేశించే
ఆలోచనలకు పట్టం కట్టాలి…

సాంఘిక దురాచారాలను
అసమానతలను దునమాడాలి
సమసమాజ స్థాపన
సామాజిక పరివర్తన లక్ష్యంగా
కవులు కలాలను ఝుళిపించాలి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!