మాయాదర్ఫణం

మాయాదర్ఫణం

రచన::పిల్లి హజరత్తయ్య

 సాంకేతిక పూదోటలో
విరబూసిన మాయాజాలము
వెదజల్లే మాయకు
మనిషి చిత్తవుతున్నాడు..!

అరచేతిలో వైకుంఠమునకు
దాసోహమైన మానవుడు
నేల విడిచి సాము చేస్తూ
చరవాణికి బందీయైపోయాడు..!

మాయ దర్ఫణములో పడి
మనిషిననే విషయం మరచి
ఊహాలోకంలో విహరిస్తూ
అధఃపాతాళంలోకి జారుతున్నాడు..!

అందమైన జీవితాన్ని
చీడపురుగులాంటి సెల్ ఫొన్
కబళిస్తుంటే ఊపిరాడక
బయటకొచ్చే దారి తెలియక
ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు..!

అంతర్జాలపు జాలమునకు
బానిసైన మానవుడు
సమాజ హితం కోరి
మితంగా వాడినట్లయితే
మనిషిగా ఎదుగుతాడు..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!