నిన్నే పెళ్ళాడుతా

నిన్నే పెళ్ళాడుతా

రచన::దాస్యం కవిత

ఒక ఊర్లో బావ మరదలు ఉంటారు అలాగని పెద్దవాళ్ళు లేరని కాదు కుటుంబానికి వీళ్లే హైలెట్ ముఖ్యంగా నెరజాన రమ్య పెంకిది గడుసు అమ్మాయి అని చెప్పవచ్చు అందరి గారాబం వల్ల అలా అల్లరి పిల్లలా పెరిగింది బావ రమణ చదువు తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు ఉంటాడు భావన సరదా పట్టించడం తప్ప వేరే ధ్యాస లేదు అంత ఇష్టం బావ అంటే మరదలికి తనుసరిగా పట్టించుకోకపోయినా ప్రేమ ఉన్నచోట ఇవేమీ కంటికి కనిపించవు ఎందుకంటే ప్రేమ గుడ్డిది అని చెప్పారుగా ఆ రీతిలో మన రమ్య రెచ్చిపోతుంది వరసకు బావైన తనను బాయ్ ఫ్రెండ్ గా భావిస్తూ ఏరోజుకారోజు కొత్తగా ప్రేమిస్తుంది ఇద్దరిదీ ఒకే కాలేజ్ అయినా ఎవరికి తెలియనివ్వద్దంటుంది బావ మరదలని ఎందుకంటే ప్రేమించుకోవడానికి వీలు ఉండదు కదా అని ఒక పిచ్చి ఆలోచన రమ్యది బావకి రోజు ఒక ప్రేమ లేఖ రాసి ఫ్రెండ్ ద్వారా అందిస్తుంది ఇలాంటివన్నీ రమణ కు నచ్చవు కానీ ఎవరినీ నొప్పించడం కూడా తనకు అలవాటు లేదు అందుకే స్వీకరిస్తాడు ఇంకా అసలే మరదలు రమ్యను ఏడిపిస్తే ఇంట్లో ఉండటమే కష్టం అంతా ఆమె పార్టీ నే ఇంకా అలాంటపుడు రమణ చూసి చూడనట్టు పోవడమే బెటర్ బావను ముద్దుగా పూరి అని పిలుచుకుంటుంది అవసరానికి తప్పా పొంగడ ని అలా పెట్టుకుంటుంది కాలేజీ ఫ్రెండ్ కి లెటర్ ఇస్తూ ఏంటి ఆ పూరి ఏమంటున్నాడు చదువుతున్నాడ చి ంపేస్తున్నాడా అమ్మో అదేంటి అని ఫ్రెండ్ చింపేసిబతుకుతాడా ఏంటి అని వ్యంగ్యంగా నవ్వుతుంది అయినా నీ పిచ్చి గాని చలనం లేని ఆ రమణ తప్పితే కాలేజీ లో ఎంత మంది లేరు నీ వెంట పడే వారు వెతుక్కోవచ్చు గా అంటుంది దీనికేం తెలుసు పిచ్చి మొఖం తన బావని మించిన అందగాడు తన కలల రాకుమారుడు వేరే లేరని నవ్వుకుంటుంది తన బావ కొంచెం టైం ఉన్న లైబ్రరీ లోనూ గార్డెన్ లోనూ చదువుతూ కనబడతాడు వేరే ధ్యాస లేదు ఎందుకంటే చిన్నతనాన తండ్రి చనిపోతే తల్లీ వ్యవసాయ పనులలో తన కొడుకుని చూసుకోలేక మంచి చదువులు చదివి వాడు డాక్టర్ కలెక్టర్ కావాలని కోరిక తల్లి కోరిక మేరకు చదువు కానీ తనకు స్టేట్ వెళ్లాలనే కోరిక ఎమ్మెస్ చేయాలని అందుకే వేరే ధ్యాస లేక చదువుతున్నాడు మరదలి ఆట చిన్నప్పటినుంచి అలవాటయింది అక్క కొడుకు తమ్ముడు బిడ్డ రమ్య అలా బావ మరదలు పక్క పక్క ఇళ్ళే కావడం భర్త చనిపోవడం వల్ల తమ్ముడే అన్నీ దగ్గరుండి చూసుకోవడం కుటుంబాలు పక్కనే ఉండడం రమ్య అల్లరికీ అంతులేకుండా పోయింది ఊరికి 20 కిలోమీటర్లు కాలేజ్ వెళ్లి రావాలి బండిమీద వెళ్తున్నారు కొద్ది దూరంలో ఆపమంటుంది కాలేజీలో అందరికీ తెలుస్తుందని దీని అల్లరికి ఆకతాయికి అవధులు లేవు అని లో లో గొణుగుకుంటాడు జర్నీ లో ఏదో మాట్లాడుతూనే ఉంటుంది ఏంటి ఇలా నీ తనువు నా తనువు తాకితే ఏ వైబ్రేషన్ లేదా బావ అంగాంగ సౌష్టవం అన్నీ సక్రమంగానే ఉన్నా యే అని బూతులు మాట్లాడుతుంది చిన్నగా నవ్వుతాడు అయ్యో బావ ముత్యాలు రాలి నా మెడలో దండ కు కూడా ఎక్కువ అవుతాయేమో అని బుంగ మూతి పెట్టి చూస్తుంది తన కష్టానికి ఫలితం అన్నట్టు క్యాంపస్ సెలెక్ట్ అవుతాడు తన కోరిక మేరకు ఇంకా చదవాలని ఆశతో టూ ఇయర్స్ స్టేట్స్ వెళ్లాలని నిశ్చయించుకొని ఇంట్లో అందర్నీ ఒప్పిస్తాడు ఒక క్షణం బావని విడిచి ఉండలేని రమ్యా గట్టిగా పట్టుకొని నన్ను తీసుకెళ్లావా అని మారాం చేస్తుంది ఎందుకే నేను ఉంటే ప్రాబ్లం కానీ నేను వెళ్తే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు నీ పిచ్చి కుదురుతుంది ఏడుపు ఎందుకు అంటాడు ఏంటి బావ నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా ఇలా కాదు నేను నిజం చెప్తున్నా నీ మీద ఇష్టం ఉంది కానీ ప్రేమ లేదు ఇష్టం వేరు ప్రేమ వేరు నీ కొరకు ఏదైనా చేసే ంత ఇష్టం ఉంది ప్రేమంటే మనసులు కలవాలి నీ మీద ఆ ఫీలింగ్ లేదు చిన్నగా నచ్చచెప్తాడు ససేమిరా ఒప్పుకోదు సరే ఈ టు ఇయర్స్ నేను వచ్చేవరకు నీ ప్రేమ అలానే ఉంటే నా అంత అదృష్టవంతుడు వేరొకరు ఉండరని పెళ్లి చేసుకుంటా అంటాడు చిత్రం ఏంటంటే టు ఇయర్స్ బావ కంటే రమ్యనే పెద్దది అయినా సరే నీ ప్రేమ ఇలాగే ఉంటే అన్నింటిని మరిచి నిన్నే పెళ్ళాడుతా అని వెళ్తాడు చెక్కుచెదరని ప్రేమతో బావ ని సొంతం చేసుకోవడానికి తన కలను నెరవేర్చుకో డానికి అందమైన ప్రేమతో ఎదురుచూస్తుంది ప్రేమ గుడ్డిది వయసు వ్యత్యాసం కూడా కప్పేస్తుంది అని తన రాకతో తెలుసుకుంటుంది ఇద్దరు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!